పఠనీయం

అల్ప పొత్తం.. అనల్ప ఆలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు : 56 వెల: రూ. 35/-లు
దొరుకు చోటు విజ్ఞాన ప్రచురణలు,
శ్రీ జి. మల్యాద్రి 162, విజయలక్ష్మి నగర్, నెల్లూర్ 524004, చరవాణి: 9440503061
============================================================
‘Common sense is most uncommon thing among people ’ అని ఇంగ్లీషులో ఒక కోట్ ఉంధి. సాధారణంగా ‘కోట్స్’ అర్థసత్యలే! కానీ ఈ కోట్ అక్షర సత్యమే! సరిగా ఈ కారణంగానే ‘సెన్సూ కామన్‌సెన్స్’ లాంటి పుస్తకాలు సమాజానికి అవసరం ఉంది.
ఈ పుస్తక రచయితలు డా. నాగసూరి వేణుగోపాల్ శ్రీమతి నాగసూరి హంసవర్ధిని.
భార్యాభర్తలైన రచయితలు విడివిడిగా రచనలు చేసిన సందర్భాలు మనకి ఉన్నాయి. పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి, ప్రోలాప్రగడ రాజ్యలక్ష్మి అలాగే కె.కె.రఘునందన శ్రీమతి కె.కె. భాగ్యశ్రీ లంటి ఉదాహరణలు కనబడుతాయి. దంపతులిద్దరూ ఒకే కలంపేరుతో రచనలు చేసినవారు తెలుగు సాహిత్యంలో కొందరు తారసపడుతారు. బీనాదేవి , వసుంధర లాంటివారు ఈ కోవలోకి వస్తారు. ఈ పుస్తకాన్ని రచించిన డా. నాగసూరి శ్రీమతి హంస వర్ధిని నిజంగా జంట రచయితలే.
పుస్తకానికి ముందు మాట రాసిన ఓల్గా దీన్ని ‘వివేకం లేని సమాజానికి చిన్న ఔషధం’ గా అభివర్ణించారు. అనాదిగా ప్రజల్లో పాతుకు పోయయిన మూఢ విశ్వాసాలపై సెటైరికల్‌గా రాసిన రచన ఇది. ప్రజాశక్తి దినపత్రిక. ‘స్నేహ’ ఆదివారం అనుబంధంలో వారం విడిచి వారం నిర్వసించిన కాలమ్‌నే ఇప్పుడు పుస్తక రూపంలో తెచ్చారు. విజ్ఞాన ప్రచురణలు నెల్లూరు వారు ఈ మంచిపనికి పూనుకున్నారు.
హేతువాద దృష్టికి నిలబడని అనేక విషయాల్ని మనుష్యులు ప్రపంచ వ్యాప్తంగా నమ్మటం చూస్తాం. మనిషిలోని ఇంగితం లేదా కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు అంధ విశ్వాసాలు దూదిపింజల్లా తేలిపోతాయి. కానీ ఈ తరహా ఆలోచనా సరళి మానవుల్లో సకృత్తు ‘గొర్రె దాటు తగ్గించు. బుర్ర కాస్త ఉపయోగించు’ (దాశరథి) అనే కవి భావనను పట్టించుకునేవారు తక్కువే. మూఢ నమ్మకాలతో, అర్థంపర్థం లేని ఆకారాలు, ఆలోచనలతో కునారిల్లుతున్న వర్తమాన సమాజంతో ఈ తరహా పుస్తకాల అవసరం ఎంతో ఉంది.
‘ఒక మోసానికి రెండు మోసాలు అదనం’ , ‘మిస్డ్ కాల్స్ మిచ్చ్ఫీ’ లాంటి ఆకర్షణీయ శీర్షికలు కలిగిన 15 వ్యాసాల సమాహారం ఈ చిన్ని పుస్తకం.
ఏదో ఉచితం అనగానే ఇక ఏ ఆలోచనా లేకుండా అవసరం ఉన్నా లేకపోయినా వేలం వెర్రిగా వస్తువుల్ని కొనేయడం లాంటి ధోరణుల్ని దుయ్యబట్టారు. ఇదో మధ్యతరగతి సరికొత్త మందహాసం ‘సుమూర్తం - దుర్ముహూర్తం’,‘ గుడ్‌లక్ ప్లాంట్ -బ్యాండ్ థింకింగ్ ’ ఇలా అనేక విషయాల్ని ప్రస్తావించి శాస్ర్తియ దృష్టిలో విశే్లషించారు. టీవీ సీరియళ్లల్లో పిచ్చి పిచ్చి దృశ్యాల్ని ఎత్తిచూపే వ్యాసం మరోటి. టీవీని మొదట్లో ‘ఇడియట్ బాక్స్’ అనేవారు. ఆ మాట పుట్టుకకికారణం ఈ సీరియళ్ల దృశ్యాలే కారణం అనిపిస్తోంది. నిజానికి మొదట్లో కార్యక్రమాలు మరీ ఇంత దిగజారి ఉండేవి కావు. ఓల్గా తమ ముందుమాటలో ఈ పుస్తకాన్ని ఓ ‘ప్రాధమిక వాచకం’ అన్నారు. ఈ వ్యాసాలు చూస్తే ఆమాట కరక్టే అనిపిస్తుంది. ఇవి చాలా సింపుల్ గా ఉండి సాధారణ పాఠకుల్ని ఉద్దేశించి రాసినవి. రచయిత నిర్దేశించుకున్న టార్గెట్ రీడర్స్ వారే. అయితే మూఢనమ్మకాలు, గొర్రెదాటు పద్థతులు ఈ వర్గం వారికే పరిమితం అని చెప్పలేం.
యువతీ యువకులకి ముఖ్యంగా స్ర్తిలకి ఈ పుస్తకం చేరితే కొంత మార్పు వారిలో వచ్చే అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని ఆ యా వర్గాలకి చేర్చే బాధ్యతను విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు తీసుకొంటే మంచిది. ముఖ్యంగా వామపక్ష సంఘాలకి సహజంగానే ఈ బాధ్యత మరీ ఉంది.
ఈ పుస్తకంలో ప్రస్తావించిన మూఢనమ్మకాలే కక ఇంకా అనేకం సమాజంలో నెలకొని ఉన్నాయి. వాటిని కూడా ఈపుస్తకంలోకి తెస్తే బాగుండేది. ఇంకొంచెం లోతుగా సమస్యల్ని చర్చించి ఉంటే పుస్తకం విలువ మరింత పెరిగేది. ఆ ప్రయత్నం మరో సందర్భంలో రచయితలు చేస్తారని భావిద్దాం.
ఇదో విషయ ప్రధానమైన పుస్తకం. యుటిలైజేషన్ దృష్టితో రాసిన పుస్తకం. ఈ రచన మొత్తం సంభాషణల రూపం లో ఉండటం ఒక విశేషం. పెద్ద ప్రయోజనాన్ని సాధించే పాకెట్ బుక్ లాంటి పుస్తకం.

ఎస్. హనుమంతరావు 8897815656