పఠనీయం

ఆలోచింపచేసే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడదాకా కలిసి (కథాసంపుటి)
డా. మద్దాళి ఉషాగాయత్రి వెల:రూ.100/-
101, 102, మద్దాళి గోల్డెన్ నెస్ట్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్.
=============================================================
డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి వౌలికంగా ఒక నృత్య కళాకారిణి, ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన నాట్యగురువు కూడాను. ‘కినె్నర’ సాహితీ సాంస్కృతిక సంస్థ అధినేత అయిన రఘురాం గారి ధర్మపత్ని. బహుశా ఆ సాంగత్యం, ఆయన కూడా సాహితీ ప్రియుడూ, కవీ కావడంతో వారిరువురూ సంస్థాగతంగా, ఎన్నో సాహిత్య సమావేశాలకూ, కవి సమ్మేళనాలకూ వెళ్ళడం, పలువురు సాహితీవేత్తలతో, వారి రచనలతో పరిచయం పెరగడం కారణంగా- గాయత్రి గారిలో సహజంగా పధ్నాలుగో ఏటనే కలిగిన రచనాభిలాష తొలి రచన ‘్భయం’గా స్వాతి మాసపత్రికలో అచ్చయినది లగాయితు ధైర్యంగా తన కూచిపూడి దక్షతతో బాటు రచనా దక్షత కూడా పురోగమించింది.
2000 సంవత్సరంలో బ్యాంక్ ఉద్యోగినిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2013లో నృత్యంలో పిహెచ్‌డి పట్టాను పొంది తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ‘హంస’ పురస్కారం అందుకుని నాట్య వృత్తిగా, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా మలుచుకుని పలు దిన, వార, మాసపత్రికలలో కథా రచయిత్రిగా ఎదిగారు.
తమ తొలి కథల సంపుటి ‘్భరతనారీ వర్థిల్లు’ యద్దనపూడి సులోచనారాణిగారికి అంకితం చేశారు. ఆవిడ స్ఫూర్తియే తన రచనలకు కారణం అంటారు. అమ్మ జానకమ్మ ద్వారా సాహిత్య సంగీతాభిరుచి ఇనుమడించింది అంటారు. డా మద్దాళి ఉషాగాయత్రి రెండవ కథల సంపుటి ‘కడదాకా కలిసి’. ఇందులో అష్టాదశ కథలున్నాయి. ‘ఇష్టకామ్యాభిసిద్ధిరస్తూ’ అని మొదలై ‘సాహసం సాధ్యమే’ అనే కథతో ముగిసే ఈ సంపుటిలో ‘వారెవా! వామ్మో’ అనిపించే మంచి కథలున్నాయి. పాఠకుడు ‘అదే! అదే! అదే నేను కోరుకున్నది’ అని సంతృప్తిపడే కథలున్నాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అని ఆశావహ దృక్పథాన్ని కలిగించే ఇతివృత్తాలున్నాయి. శ్రీ కినె్నర రఘురాం, మద్దాళి ఉషాగాత్రి ఇద్దరూ ‘దొందూ దొందే!- అంటే ‘మరోలా అనుకోకండి’. ‘గెలుపెవరిది?’ అని విచికిత్స పడక ‘కడదాకా కలిసి’ సాగే ‘ఒకరు + ఒకరు = ఒక్కరే’ అనిపించే కళాత్మక మిథునం వారు.
ఇందులోని కథలు వివిధ పత్రికల్లో వచ్చినవే అయితే వాటిని ఒక చోట చదవడం ఒక ‘కథానుభూతి’. ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ కథ ఆధునిక సాంకేతిక పరికరం ‘సెల్‌ఫోన్ పరికరం’వల్ల కలిగే ముప్పులను హెచ్చరికగా తెలిపే కథ. సాంకేతికతను కాదనడం కాదు ఇది. ‘వ్యామోహం’లో యువత పడిపోకూడదనే ఆర్తి. జీవితం చాలా విలువైనది అని ప్రబోధిస్తుంది. ‘డస్ట్‌బిన్’ కథ ఈనాడులో ప్రచురితమైనప్పుడే ఎందరో పాఠకులను ఆకట్టుకుని కథా రచయిత్రిగా ఉషా గాయత్రికి గుర్తింపు తెచ్చిన నవీన కథ. అత్తమామలను ‘డస్ట్‌బిన్స్’గా భావించే నవ నాగరిక యువతి మనస్తత్వాన్ని చిత్రిస్తూ ‘‘ఇవ్వాళ మీరిద్దరూ డస్ట్‌బిన్స్ అవుతే భవిష్యత్తులో నేను వేస్ట్‌పేపర్ అవనని నమ్మకమేంటి’ అని ఆ యువకుడు తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం కథలోని విశేషం. ‘‘జీవితం ఒక్కటే దాన్ని ఆనందంగా జీవించాలి. సమస్యలు కొనితెచ్చుకోడూదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి చెడ్డలకు మనకు అండగా ఉండేది మన సొంతవాళ్ళే’’ అని ప్రబోధిస్తూ ఆ యువతి కళ్ళుతెరిపించడం ఒక మంచి ముగింపు.
‘మూసీకి పుష్కరాలొస్తే’, ‘చల్ చల్ గుఱ్ఱం’ చక్కటి హాస్యకథలు. నిజానికి ఒకప్పుడు ముచికుందా నదిగా శుభ్రజాలాలతో వుండినదే నేటి భాగ్యనగరపు మూసీనది. ఇప్పుడంటే అది మురికికి నిలయమైంది. అలాంటి మూసీకి పుష్కరాలను కలగన్న ఆంజనేయులు పాత్రను భలే చిత్రించారు. అలాగే ‘బారాత్’ పేరుతో గుఱ్ఱం కోసం పడే శంకరం తాపత్రయం ‘చల్ చల్ గుర్రం’లో హాస్యం పండించింది. పనికిరాని సంతానం పదిమంది వున్నా లాభం లేదనీ, పండగలకీ, పబ్బాలకూ రాలేకపోయినా అవసరానికి అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే సంతానం వుండడం గొప్ప అదృష్టమనీ ‘గంగిగోవు పాలు’ కథ వివరిస్తుంది.
‘కడదాకా కలిసి’ అనే సంపుటి పేరిట కథ ఒక తల్లి కడుపున పుట్టిన సంతానం చివరివరకు కలిసే వుండాలనీ, పిల్లలు వాళ్ళ జీవితాలు వారు జీవిస్తూ కలిసినపుడు స్వేచ్ఛగా, ప్రేమగా ఆనందంగా గడిపేలా వుండాలనీ, తమ ఇంటినే ఓల్టేజ్ హోమ్‌లా కాక గోల్డెన్ హోమ్‌లా తల్లిదండ్రుల సేవలో తరించవచ్చనీ ఆత్మీయ బంధాలను గుర్తుచేసి సమష్టి జీవనాన్ని ప్రబోధించే కథ. ఈ కథలు చదివిన పాఠకులు రసానుభూతి ఆనందంతో మనసులో నాట్యం చేస్తే రచయిత్రి కథలకు అంతకుమించిన సార్థకత ఏముంది.

-సుధామ 98492 97958