పఠనీయం

ఆహ్లాదం కలిగించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరికొత్త వేకువ (కథలు)
-కోసూరి ఉమాభారతి
వెల: రూ.100
ప్రతులకు: జెవి పబ్లికేషన్స్
8096310140
వంగూరి ఫౌండేషన్
9849023852
*
పరాయిగడ్డ మీద బ్రతుకుతూ, స్వదేశ సంస్కృతిని ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ, వాటిని నిలుపుకోవటం ఒక గొప్ప ప్రయత్నం. శ్రీమతి కోసూరి ఉమాభారతిగారు ఈ కోవకు చెందినవారు. ‘సరికొత్త వేకువ’ వీరి నాల్గవ గ్రంథం. ఇవి అమెరికా జీవితాన్ని చిత్రించే కథలు. అమెరికా వెళ్లి వచ్చిన వారి కథలు కొన్ని. అన్ని కథలు కూడా ప్రవాసాంధ్రుల జీవితాలను చిత్రించినవి. తననూ, తన చుట్టూ ఉన్న జీవితాలను ప్రేమించమని ఉద్బోధించే కథలివి. జీవితం అంటే ప్రేమించటం, ప్రేమించబడటం అని చెప్పే కథలివి.
ఈ కథాసంకలనంలో పది కథలున్నాయి. ఇవన్నీ ఏదో ఓ సందర్భంలో ఏదో ఒక పురస్కారాన్ని పొందినవి. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ - అమెరికాలోనే కాదు - ప్రపంచవ్యాప్తంగా సాహితీసేవ చేస్తోంది. వారు ఈ కథా సంకలనాన్ని ప్రచురించి, ఉమాభారతిలో దాగి ఉన్న ప్రతిభకు పట్టం కట్టారు.
గొంతు పలకని పరమేశ్వరి వసంతరామ్‌ల కూతురు. డా.మాలిని డేవిడ్ నిరంతర కృషి, చికిత్స అంతగా ఫలితాన్నివ్వవు. వసంత పిన్నమ్మ సీతమ్మగారికి సంగీతంలో ప్రవేశం ఉంది. ఆయమ్మ పరమేశ్వరితో చేయించిన సాధనే ఓ రోజు పరమేశ్వరికి గొంతు తెప్పించి వారింట పుత్తడి వెలుగుల్ని పూయిస్తుంది.
జాబిలమ్మ లాంటి ముద్దులొలికే చంద్రకళ - చందూ. వాళ్ల అమ్మమ్మ ‘కథాసమయం’ అంటూ ఓ కథ చెప్పి చందూని ఓ విశిష్ట వ్యక్తిగా అందరూ ప్రేమించేలా తీర్చిదిద్దుతుంది. చందూ ఎడ్వర్డు అనే విదేశీయుడిని ఇష్టపడితే, కూతురు సుఖం కంటే ముఖ్యం ఏముందని ఎడ్వర్డుతోనే పెళ్లి జరిపిస్తారు. ఒకనాటి దుర్ముహూర్తాన చందూకి ‘బ్రెయిన్ కేన్సర్’ ఉందని తెలుస్తుంది. మతి-గతి కోల్పోయి హాస్పిటల్లో ‘లైఫ్ సపోర్ట్’ మీద జీవించి ఉండటం చందూ ఇష్టపడక ‘యుధనేషియా’ స్వచ్ఛంద మరణం ఎంచుకుంటుంది. గుండెల్ని పిండేసే కరుణ చిప్పిల్లే కథ ఇది (అనగనగా ఓ జాబిలమ్మ).
అమ్మమ్మ పేరు పెట్టుకున్న ‘తులసి’ అచ్చ అమ్మమ్మ పోలికే! తల్లి సాగరికి, చెల్లెలు మానస, తమ్ముడు సాయికి సాయం చేయటమే కాకుండా చర్చిలో ‘బాలల బైబిల్ స్టడీ’కి, లెక్కల్లో సహాధ్యాయులకు సాయం చేసి పెడుతుంది. లెక్కల పాఠాలకు వచ్చిన డబ్బుతో అమ్మకు సర్‌ప్రయిజ్ ఇవ్వాలని చెప్పదు. అదే అపార్థానికి దారితీసి చివరకు నిజం తెలిసాక తులసిని అందరూ అభినందిస్తారు ‘తులసి’లో. బంగారం గాయని. సీతాపురం జూ.కాలేజీ ఆమె జావళి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే రాంబాబు అనే దుష్టుడు ఆమెపై కనే్నస్తాడు. ఊళ్లో ఉంటే రక్షణ కరువవుతుందని బంగారం తల్లిదండ్రులు ఆమెను రఘురాం దమయంతి దంపతుల వద్ద ఉంచుతారు. రఘురాం దంపతుల కొడుకు సాగర్ అమెరికా నుండి తన కాబోయే వధువు సోఫియాతో వస్తాడు. సాగరిని చూడగానే బంగారంలో ఒక విధమైన ఆరాధనా భావం కలుగుతుంది. డాక్టరయిన సాగర్, అటు అమెరికాలో ఇటు ఇండియాలో కేన్సర్ చికిత్స చేస్తుంటాడు. ఇండియాకు వచ్చినప్పుడల్లా బంగారం సాగర్‌తో కలిసి పని చేస్తుంది. కొన్నాళ్లకు కారు ప్రమాదంలో సోఫియా చనిపోతుంది. సాగర్ కుంటివాడవుతాడు. బంగారానికి రాహుల్ వర్మ అనే కంప్యూటర్ వ్యాపారితో పెళ్లవుతుంది. రాహుల్ సంసార సుఖానికి పనికిరాడు. అందువల్ల ఇద్దరూ వేర్వేరుగా బ్రతుకుతుంటారు. గాయపడి వచ్చి సాగర్ కొత్త వెలుగై బంగారం నిలుస్తుంది - ‘సరికొత్త వేకువ’లో.
ఇలాంటి కథలే మరి ఆరు ఉన్నాయి ఈ సంకలనంలో. మానవ సంబంధాలను అతి మధురంగా చిత్రీకరించబడిన కథలివి.

-కూర చిదంబరం 8639338675