పఠనీయం

న్యాయమార్గమే విజయబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
======================================================
తన నిర్ణయాన్ని పాటించడం కోసం కామన్ లా (ఇంగ్లండ్ న్యాయశాస్త్రాని)కి సంబంధించిన లావుపాటి గ్రంథాలను ఆయన తొమ్మిది నెలలపాటు కష్టపడి అధ్యయనం చేయవలసి వచ్చింది. రోమన్ న్యాయశాస్త్ర మూలగ్రంథాలను చదవడం కోసం ఆయన లాటిన్ నేర్చుకున్నాడు. అప్పట్లో బారిష్టరు డిన్నర్ బారిష్టర్లు అనేవారు. ఎందుకంటే వాళ్ళు న్యాయశాస్త్రం చదివిన మూడేళ్ళూ కనీసం 72 డిన్నర్లకు హాజరవ్వాలి. ఈ ఖరీదైన విందు భోజనాల ఖర్చును విద్యార్థులే భరించాలి.
గాంధీకి అలా సామూహిక సమావేశాల్లో పాల్గొనడం అలవాటు లేదు. మద్యం తాగడం, విందు భోజనాలు చేయడం మంచి న్యాయవాది కావడానికి ఎలా ఉపయోగపడుతుందో ఆయనకు అర్థం కాలేదు. అయినా ఈ విందులకు హాజరుకావడం తప్పనిసరి. ఆయన శాకాహారి, మద్యాన్ని ముట్టడు. విందులో చాలా వంటకాలు తినడు, మద్యం తాగనే తాగడు. దాంతో చాలామంది న్యాయశాస్త్ర విద్యార్థులు ఆయనతో వెళ్ళటానికి ఆసక్తి చూపేవారు.
పాఠ్యగ్రంథాల అధ్యయనం కానీ, విందులలో పాల్గొనడం కానీ గాంధీ బిడియాన్నీ, కంగారునూ తగ్గించలేకపోయాయి. తాను కేసులు వాదించేటప్పుడు పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం ఎలా అని ఆయన ఆలోచించేవాడు. ఒక ఆంగ్ల న్యాయవాది ఆయనను ప్రోత్సహించి మంచి న్యాయవాదిగా, ఒకమోస్తరు ఆదాయం సంపాదించేందుకు నిజాయితీ, కృషి సరిపోతాయని గాంధీకి చెప్పాడు. ‘‘చట్టంలో నాలుగింట మూడొంతులు వాస్తవాలే ఉంటాయి. కేసుకు సంబంధించిన వాస్తవాలను జాగ్రత్తగా చూసుకుంటే, కేసును గెలిపించే సంగతి చట్టమే చూసుకుంటుంది’’ అని ఆయన వివరించాడు. చరిత్ర, జనరల్ నాలెడ్జికి సంబంధించిన పుస్తకాలు చదవమని గాంధీకి సూచించాడు. గాంధీ ఆయన సలహాను పాటించాడు.
ఇంగ్లాండులో ఉండగా కొద్దికాలంపాటు గాంధీ ఒక చక్కటి ఇంగ్లీషు పెద్దమనిషిలా ఉండేందుకు ప్రయత్నించాడు. ఆయన సరైన ఉచ్ఛారణను, ఉపన్యాసాలు ఇవ్వడాన్ని, నాట్యం చేయడాన్ని, వయొలిన్ వాయించడాన్ని, సరైన విధంగా ముస్తాబు కావడాన్నీ నేర్చుకొనేందుకు ప్రయత్నించాడు. ఆయన లండన్‌లో అత్యంత షోకైన దుకాణం నుంచి ఖరీదైన సూట్ కొన్నాడు, జంట బంగారు గొలుసున్నవాచీ పెట్టుకున్నాడు. ఖరీదైన టైలు, టోపీలు ధరించాడు. యువతులతో స్నేహం చేశాడు.
ఆయన సుఖమయమూ, సౌకర్యవంతమైన జీవితం వైపునకు మళ్లిపోతున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆయనకు తానెంత మూర్ఖంగా ప్రవర్తిసున్నాడో అర్థమైంది. ఖరీదైన అలవాట్లకోసం తన పెద్దన్నయ్య మీద ఒత్తిడి పెంచుతున్నాడు. తానిక్కడకు చదువుకునేందుకు వచ్చాడు కానీ ఆంగ్లేయుల పద్ధతులు అనుకరించేందుకు కాదు. తక్షణమే తన జీవన విధానం మార్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తక్కువ అద్దె వున్న గదిలోకి మారి, ఒక స్టవ్ కొనుక్కొని తన అల్పాహారం, భోజనం తానే వండుకోసాగాడు. చౌకైన శాకాహార భోజనశాలల్లో తినడం ప్రారంభించాడు. తన సుఖాలమీద డబ్బు ఖర్చుపెట్టడం ఆపేశాడు. రోజూ ఎనిమిది నుంచి పదిమైళ్లు నడవడం మొదలుపెట్టాడు.
అలా 32 నెలలు ఇంగ్లాండులో వున్న తర్వాత బారిష్టరుగా నమోదయ్యాడు. రెండు రోజుల తర్వాత ఓడలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశం చేరిన తర్వాత ఆయన ముంబయిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, ఒక వంటవాడిని నియమించుకున్నాడు. ముంబాయి హైకోర్టుకు క్రమం తప్పకుండా వెళుతూ అక్కడి కేసులు ఎలా నడుస్తున్నాయో చూసేవాడు. బార్ (న్యాయవాద సంస్థ) గ్రంథాలయంలో గంటల తరబడి గడుపుతూ కేసుల గురించి అధ్యయనం చేసేవాడు. ముఖ్యంగా భారతీయ న్యాయశాస్త్ర గ్రంథాలను చదివేవాడు.
ఆయన మొదటి కేసు సామాన్యమైనదే. దాన్ని వాదించేందుకు ఆయనకు ఇస్తానన్న ఫీజు 30 రూపాయలు. కానీ ఏ మాత్రం అనుభవంలేని 22 సంవత్సరాల యువ న్యాయవాది వాదించడానికి లేచి నిలబడి ధైర్యం కోల్పోయాడు. అతనికి తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. నాలుక నోటికి అతుక్కున్నట్లుగా అనిపించి మాటలు పెగల్లేదు.