పఠనీయం

ఇష్టంతో దేనినైనా సాధించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
====================================================
దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు కస్తూర్బా రెండుసార్లు తీవ్రంగా జబ్బుపడింది. ఆమె బాగుపడుతుందనే ఆశ చాలా తక్కువగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. గాంధీ ఆమెకు ఎంతో ఓపికగా, ధైర్యంగా, శ్రద్ధగా సేవలందించాడు. దక్షిణాఫ్రికా జైలులోంచి విడుదలయ్యాక ఆమె చాలా బలహీనంగా ఉంది. గాంధీ ఆమెకు పళ్లు తోముకొనేందుకు సహాయం చేశాడు, కాఫీ కలిపి ఇచ్చాడు, ఎనిమా చేశాడు, ఆమె మలమూత్రాలను ఎత్తిపోశాడు, ఆమెకు తలదువ్వి జడవేయడానికి కూడా ప్రయత్నించాడు. తెల్లవారు జామున వెలుతురు రాగానే ఆయన ఆమె మంచాన్ని చక్కగా గాలివేసే ఒక చెట్టునీడకు చేర్చేవాడు. రోజంతా అక్కడే ఉంచి సేవలు చేసి, మళ్లీ సాయంత్రం చీకటి పడేవేళకు ఇంటి లోపలకు మార్చేవాడు.
శిక్షణ పొందిన భారతీయ నర్సు దక్షిణాఫ్రికాలో దొరకడం కష్టం. నల్ల మహిళలకు తెల్ల నర్సులు పురుడు పోసేందుకు నిరాకరించే అవకాశం చాలా ఉంది. కస్తూర్బా గర్భం ధరించినపుడు గాంధీ కాన్సు చేయడానికి సంబంధించి అధ్యయనం చేశాడు. కస్తూర్బా తమ ఆఖరి సంతానాన్ని సుఖంగా ప్రసవించేందుకు సహాయపడ్డాడు.
ఆగాఖాన్ పాలెస్‌లో కస్తూర్బా ఆఖరిసారి జబ్బుపడినప్పుడు గాంధీ (అప్పుడు అతనికి 75 ఏళ్ళు) ఆమెకు కటిస్నానం చేయించి ఊరట కలిగించేందుకు ప్రయత్నించాడు. యెర్రవాడ జైలులో అపెంటిసైటిస్ శస్త్ర చికిత్స చేయించుకున్నప్పుడు అక్కడి నర్సులు, స్వయంగా నర్సూ, కాంపౌండరూ అయిన గాంధీని ఎంతో మెచ్చుకున్నారు. ‘‘నర్సింగ్ సాధారణంగా అంత ఆనందకరమైన పనేమీ కాదు, కానీ గాంధీకి నర్సు పనిచేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అని వాళ్ళల్లో ఒక నర్సు చెప్పింది. ‘‘నువ్వు అందరికీ ఇచ్చినట్లు నీ సూచనలన్నీ జాగ్రత్తగా రాసి ఇవ్వాల్సిన పనిలేదు అని మా డాక్టరుగారు చెప్పారు. నిజంగానే ఆయనలాంటి రోగిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని నేను బదులిచ్చాను’’ అని ఆమె వివరించింది.
ఉపాధ్యాయుడు
గాంధీ 13 ఏళ్ల వయసులో అంతే వయసున్న కస్తూర్బాను పెళ్లిచేసుకున్నాడు. ఆమె నిరక్షరాస్యురాలు. అంటే చదవటం, రాయడం రాదు. ఈ కౌమార భర్త తన భార్యకు చదవటం, రాయడం నేర్పాలని ప్రయత్నించి దారుణంగా విఫలమయ్యాడు. 1914లో ఇంగ్లాండ్‌కు ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిరోజూ కాలెన్‌బాక్‌కు గుజరాతీ నేర్పించాడు. కస్తూర్బాకు రామాయణం, భగవద్గీత నేర్పించాడు. కస్తూర్బా ఆ రెంటినీ చాలా ఆసక్తితో నేర్చుకుంది. 73 ఏళ్ల వయసులో కస్తూర్బా గాంధీతో కలిసి ఆగాఖాన్ పాలెస్‌లో ఖైదుగా ఉంది. అప్పుడు ఆమె కోసం ఆయన రామాయణ, భాగవతాల్లోని కొన్ని అధ్యాయాలను ప్రవచనం చేశాడు. రోజూ ఆమెను కూర్చోబెట్టి భూగోళం, గుజరాతీ సాహిత్యం, వ్యాకరణాలకు సంబంధించిన పాఠాలను బోధించేవాడు. ఆయన శిష్యురాలు ముసలితనంవల్లా, దుఃఖంవల్లా పాఠాలకు సరిగ్గా స్పందించలేకపోయేది. ఖైదీగా ఉన్నప్పుడు గాంధీ తన తోటి చైనీస్ ఖైదీకి ఆంగ్లం; ఐరిష్ జైలరుకు చరిత్ర, గుజరాతీ; తన మేనకోడలి కూతురుకి భూగోళం, రేఖాగణితం నేర్పాడు. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన భౌగోళిక పటాలను ఖచ్చితంగా గీయగలిగేవాడు.
ఉపాధ్యాయునిగా తన సామర్థ్యం మీద గాంధీకి గట్టి నమ్మకం ఉండేది. కానీ చదువుమీద ఆయన అభిప్రాయాలు, ఆయన బోధించే విధానం అప్పటికి ఆమోదం పొందిన పద్ధతులకూ చాలా భిన్నంగా ఉండేవి. ఒకసారి దక్షిణాఫ్రికాలో ఒక క్షురకుడు, ఒక గుమస్తా, ఒక దుకాణదారు ఆంగ్లం నేర్చుకోవాలనుకున్నారు. కానీ వారి వద్ద రోజూ తరగతులకు వెళ్ళేంత సమయంకానీ, ప్రత్యేకంగా ఒక శిక్షకుని నియమించుకునేంత ధనం కానీ లేవు. గాంధీ రోజూ వారి వద్దకే వెళ్లి ఆంగ్లం బోధించాడు. ఎనిమిది నెలల్లో పద్దు పుస్తకాలు నిర్వహించుకొనేందుకూ, వృత్తిపరమైన లేఖలు రాసుకొనేందుకు అవసరమైన ఆంగ్లం వాళ్లునేర్చుకున్నారు.
కొంతకాలం గాంధీ తన కొడుకులకు వౌఖిక పాఠాలు నేర్పాడు. ఆ రోజుల్లో ఆయనకు తీరిక బాగా తక్కువగా ఉండేది. ఆయన కార్యాలయానికి వెళ్ళేటప్పుడు కొడుకులను తనతో నడిపించుకొని వెళుతూ వారికి గుజరాతీ సాహిత్యం, కవిత్వం, ఇతర విషయాలు బోధించేవాడు.