పఠనీయం

ఆశ-సుందర భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలంచు జరీకోక-
రచన: యర్రమిల్లి విజయలక్ష్మి, వెల:రూ.125/-,
ప్రతులకు:
రవీంద్ర పబ్లిషింగ్ హౌస్, తణుకు, జయసూర్య హైదరాబాద్, మరియు
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్:9440664610
*
కుల వృత్తులను ఇతివృత్తంగా తీసుకుని నవల / కథ రాయటం ఒక గొప్ప ప్రయత్నం. ఆ వృత్తిపైన గొప్ప అవగాహన వున్నవారు తప్ప రాయలేరు.
శ్రీమతి యర్రమిల్లి విజయలక్ష్మిగారు గత 40 ఏళ్ళుగా సాహిత్య సేవ చేస్తున్నారు. కథ, నవల, కవిత, వ్యాసం, నాటకం లాంటి పలు సాహితీ ప్రక్రియల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. వివిధ తెలుగు పత్రికల్లో వీరి రచనలు ప్రచురితం అయ్యాయి. పలు పురస్కారాలు వీరిని వరించాయి. ఉద్యోగినిగా, గృహిణిగా అనుభవం గడించి తల పండిన పండితురాలు.
వీరి నవల ‘చిలకంచు జరీకోక’ ఉగాది నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
పద్మశాలీయుల వృత్తి జీవన పోరాటం, ఆ పోరాటంలో ఆర్థికంగా అంతంతమాత్రమే వున్న బడుగు కుటుంబాల కష్టసుఖాలు; పడుకు, పేకలా కలబోసి మన కందివ్వబడిన నవల.
చరిత్ర పుస్తకంలా, సాఫీగా నల్లేరుమీది నడకలా సాగే ఈ నవలలో శివయ్య, మరియు భ్రమరమ్మ కథానాయకా నాయికలు. ఏ రోజు కారోజు కష్టపడితేకాని కాలం గడవని అతుకుల బ్రతుకులు. కల్లా కపటం ఎరుగని కష్టజీవులు. సింహభాగపు కథ భ్రమరమ్మ, ఆమె ఆలోచనలు, ఆవేదనలు మధ్య సాగుతుంది.
శివయ్య, భ్రమరమ్మ భార్యాభర్తలు. పానకాలు, సీతమ్మ ఆమె అత్తా మామలు. ఆమె మరిది మల్లికార్జున, సరోజిని మరిది భార్య. లౌక్యం తెలిసిన మల్లికార్జున సరోజినలది వేరుకాపురం. లీలావతి, పద్మావతి, వెంకటేశులు శివయ్య సంతానం. అన్నదమ్ములమధ్య వచ్చి అంగీకారంవల్ల సీతమ్మ శివయ్యతో, పానకాలు మల్లికార్జునతో వుండి కాలం గడుపుతుంటారు.
తమ స్థోమతకు మించిన కట్నమైనా, కూతురు సుఖపడుతుందని తల తాకట్టు పెట్టి లీలావతి పెళ్లిచేస్తారు. వియ్యపురాలు నరసమ్మ గడుసుది. లీలావతి భర్త శివప్రసాదు ఆకు కందని పోక కందని అప్రయోజనకుడు. కుటుంబం పడే కష్టాలు గమనించి వెంకటేశులు కూడా బడి తరువాత బీడీలు చుట్టడం లాంటివి చిన్న చిన్న పనులతో కుటుంబాన్ని ఆదుకో ప్రయత్నిస్తుంటాడు. లీలావతి ఓ కూతురును కంటుంది. రెండవ కూతురు పద్మావతి పెళ్లి నిశ్చయం అవుతుంది. అత్తగారి దౌష్ట్యానికి లీలావతి అసువులు బాస్తుంది. శివయ్య నరసమ్మ కుటుంబాన్ని కోర్టుకీడ్చుతాడు. తరువాత కథ అంతా చకచకా సాగిపోతుంది. వెంకటేశ్వర్లు (వెంకటేశు) పదో తరగతి ప్యాసయి కులవృత్తిని నమ్ముకుంటాడు. ‘్భవన వసన నిర్మాత విధాతా చతురత’తో వృత్తిని కొనసాగిస్తూ, శివయ్య బ్రతుకు సమరాన్ని ధీరోదాత్తంగా సాగిస్తున్నాడని చెప్పి నవల ముగిస్తుంది రచయిత్రి.
రచయిత్రి శీలా సుభద్రాదేవి తన ముందు మాటలో కష్టసుఖాల కలనేత- ఈ నవల’ అంటారు కాని, పానకాలు, శివయ్య దంపతులకు కష్టమే కాని, సుఖం అనుభవించిన దాఖలా కనపడదు. పైపెచ్చు, మల్లన్న (మల్లికార్జున), సరోజన కుటుంబం బాధ్యతలనుండి తప్పుకుని సుఖపడతారు. లౌక్యం ఎరిగిన సరోజ తండ్రి భావనారాయణ ‘కుటుంబం సుఖపడుతుంది, ఎక్కడేసిన గొంగళి అక్కడే’లాగా.. శివయ్య కుటుంబం అట్లానే ఉండిపోతుంది.
నేత పరిశ్రమలోని కష్టాలు, నష్టాలు, తీరుతెన్నులు, కూలంకషంగా శోధించి రాసిన నవల ఇది. ఎన్నోచోట్ల ఈ పరిశ్రమలోని ‘శ్రమ’ని మగ్గాలు, రాట్నాలు, చుట్టు కర్రలు, బద్దలు, నేత మోకు, బేడుముళ్ళు, పూచికవేరు, కుంచెలు, గంటాలు, ఇరుసులు, పలుగులు, మరాసులు లాంటి పనిముట్ల వివరాలు నేతపై గొప్ప అవగాహన కలిగిస్తాయి. ప్రకాశం జిల్లా (ఒకప్పటి) మాండలికంలో రాయటంతో నవలకు సహజత్వం చేకూరింది. ‘మారుతున్న ఈ సమాజంలో కాలానికి అనుగుణంగా మారితేనే తప్ప మనుగడ లేదు’ అని అంతర్లీన సందేశం ఇస్తుందీ నవల.

-కూర చిదంబరం