పఠనీయం

వైవిధ్యానికి ప్రతీకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల గోదారి (కథాసంపుటి)
రచన : దాట్ల దేవదానం రాజు
వెల: రూ.120/-లు
ప్రతులకు : రచయిత H.No. 8-1-048, జక్రియ నగర్, యానాం - 533464
నవోదయా, విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఎమెస్కో, అన్ని పుస్తక కేంద్రాలు
============----------------------------======================---------------------------
గోదావరి పరిసర ప్రాంతాలైన రాజమండ్రి ధవళేశ్వరాలను శ్రీ బి.వి. యస్ రామారావుగారు, కృష్ణాతీరం అమరావతిలను శ్రీ సత్యం శంకర మంచిగారు అవిభక్త కరీంనగర్ జిల్లా లోని వేములవాడనుశ్రీ జింబో రాజేందర్‌గారు కథల కెక్కించి ఆయా ప్రాంతాలకు ప్రాణం పోశారు. కవి, కథకుడు, చారిత్రకుడు, ప్రస్తుత కథల గోదారి రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజుగారు ఈ కథా సంకలనంలో యానాం పరిసర ప్రాంతాలకు అక్కడి గోదావరి నదికి ప్రాణం పోసాడనిపిస్తుంది. ఈ కథా సంకలనానికి మరో ప్రత్యేకత ఉంది. అవధాన ప్రక్రియలో ఓ సమస్య ఇచ్చి, దాన్ని పూరించమని అవధానకర్తను అడిగనట్లుగా డా.ఎన్. గోపి ఎండ్లూరి సుధాకర్, కుప్పిలి పద్మ, శిరంశెట్టి కాంతారావు లాటి ప్రముఖులు ముందుగా ఇచ్చిన కథా శీర్షికులకు రాజుగారు కథలను అల్లారు.అంతే ఆచారానికి భిన్నంగా శీర్షికను అనుసరించి కథలను రాయాలి.
రాజుగారు. ‘్ఛ’‘లెంజ్ ను స్వీకరించి శీర్షికకు అనుగుథంగా కథలను సృష్టించారు. కాల్పానిక జగత్తు లోంచి కథలు పుడతాయని అందరికీ తెలిసిన సంగతే. ఇక్కడ రాజు గారు వాస్తవాధారిత కథలు సృష్టించారు. వరుసలో కథ ‘దళిత గోదారి’ ఏటా యానాంలో నిర్వహించే కవితోత్సవ ల మీద రిపోర్టులాగా ఉంటుంది. ఉఠి ‘రిపోర్టు’ అయితే కథలో ‘కిక్కు’ ఉండదు.
కనుక మాజేటి సుబ్రహ్మణ్యం అనే పాత్రను సృష్టించి ఆ పాత్రతో కవుల్ని నిలదీస్తారు. ‘మా కట్టలు కన్నీళ్లు మీకు అపడ్డాయా అయ్యల్లారా.. మా ఆకు (విస్తరి) విందుకు ఎడం (దూరం) అయ్యింది బాబయ్యా అనిప్రశ్నింప చేసి పాఠకులను నిశే్చష్టులను చేస్తారు. సజీవ సాహిత్యాన్ని మలచమని అన్యాపదేశ సూచనలా అనిపిస్తుంది. సత్తిబాబు, మాలక్ష్మి భార్యాభర్తలు. సముద్రం, గోదారీ కలిసే చోట చేపలు పట్టటం సత్తిబాబు వృత్తి. సత్తిబాబు ‘సాలూ మూలం’ లేని మంటలు ఆమెకు భరించ శక్యం కాదు. వాళ్ల పెనుగులాటకు మా లక్ష్మి తాళి ‘పుటుక్కు’మంటుంది. గోదాట్లో పడిదనుకొని ఇద్దరూ వెదుకుతారు. పరస్పర కోపతాపాలు గోదాట్లో కరిగిపోయి ఒకరికొకరు దగ్గరవుతారు. ఆళిదొరుకుతుంది. ఇద్దరూ ‘పకపక నవ్వు’ కుంటారు. గోదావరి సముద్రాల సంగమ స్థలం భార్యాభర్తల సంగమ స్థలమై కోపతాపాలు వాళ్ల సంగమంలో కరిగిపోతాయి. తాళి జారి ఎక్కడోపడిపోయిన ‘టెన్షన్’ వారిద్దరే కాదు పాఠకులకూ కలుగుతుంది. తాళి కాస్త దొరికాక, ఆ జంటతో పాటు పాఠకులూ తేలికపడుతారు. ఆనందంగా నవ్వుకుంటారు. గోదారి మయాన కథలో
ఆకలికి అన్నంపెట్టిన వాడు ఎవడైనా, ఏమతస్థుడైనా మాననీయుడే! కాటన్ దొర గోదావరికి ఆనకట్ట కట్టితే కోనసీమ వాసులు కృతజ్ఞతా పూర్వకంగా తమ గుండెల్లోనే ఆయనకు గుడికడతారు. పసుపులేటి సూర్యకాంతం అనే మాతృమూర్తి కాటన్ దొర మీది ప్రేమతో కొడుక్కు ఆయన పేరుపెట్టుకుంటుంది. దొర మీది గౌరవ భావంతో కొడుకును ఒక్క దెబ్బకూడా వేయదట. ఇంతేకాదు, ఆమె తన ముంగిట్లో కాటర్ దొర విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంది. మే పదిహేనున (దొర పుట్టిన రోజు) పిండివంటలు చేసి పండుగ జరుపుకుంటుంది. గోదాట్లో గోదారి కథలో అంతే కాదు, గోదావరీ స్నాన సమ యాన ‘‘ఆంగ్లదేశమా కాటనుం తం భగీరథం’ అని సంకల్పం చెప్పిస్తాడు రచయిత.
స్థాలీపులాక న్యాయంగా పై రెండు కథల్ని ఉదాహరించటం జరిగింది కాని ఈ సంకలనం లోని 14 కథలు గోదావరి తీరప్రాంతాన్ని అక్కడి ప్రజల్ని , జీవనాన్ని తాత్త్వికతను విశే్లషిస్తాయి.
ప్రముఖ కథకులు వ్యాసకర్త శ్రీరమణ మరియు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గార్ల ముందుమాటలు ఈ కథాసంకలనానికి స్థాయి , నాణ్యత రమ్యతను రంగూ రుచిని పెంచాయి. గోదారిలోనే కాదు ఈ కథల్లోనూ ‘తడి’ని పసికట్టారు శ్రీరమణగారు. జీవవంతమైన కథలుగా పేర్కొన్నారు ఇంద్రగంటిగారు. పుస్తకం సైజు , తల్లావఝల శివాజీ గారి అర్థవంతమైన ఘఇఒఆ్ఘషఆ ఆ చిత్రాలు సంకలానికో ప్రత్యేకతను తెచ్చి పెట్టాయి.
ప్రశస్త కథారచయిత శ్రీ చాసో కథారచనను కూజష జశ -్యఒళ అన్నారు. రాజుగారి రచనలకు చాసో గారి నిర్వచనం సరిగ్గా సరిపోతుంది.

-కూర చిదంబరం 8639338675