పఠనీయం

వర్తమాన విద్యావ్యవస్థకి సజీవ దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రారండి.. మనవూరి బడికి(గేయం)
రచన:చింతా అప్పలనాయుడు, వెల:రూ.10/-, ప్రతులకు:చింతా అప్పలనాయుడు, చినగుడబ గ్రామం, గరుగుబిల్లి మండలం, విజయనగరం జిల్లా, ఫోన్:9441713185
=====================================================================
అక్షరం వెలుగులో కొలువుతీరిన జీవితాలు చాలా ఉంటాయి. విద్యార్థి దశలోని సృజనాత్మకు పదునుపెట్టి భవిష్యత్తుకు బంగారుబాటలు పరిచే వికాస పరిణామాలు ఎన్నో తారసపడతాయి. అలాంటి సందర్భాల్లో సర్కారు బడులకు ప్రత్యామ్నాయంగా వెలసిన కార్పొరేట్ విద్యా సంస్థలు లెక్కకు మించి పోటీపడుతున్నాయి. వీటికి ధీటుగా పోటీతత్వాన్ని ఎదుర్కొని నిలదొక్కుకోగల ఆర్థిక స్థితికి, ప్రభుత్వ పాఠశాల మనుగడకీ ఊతమిస్తూ ప్రబోధగీతాన్ని ప్రేరణగా మలిచే గేయంగా మలచడంలో కవి, కథకుడూ అయిన చింతా అప్పలనాయుడు పాత్ర బహుముఖ ప్రశంసనీయమైనది.
ఇటీవలే ఈ రచయిత గేయ రూపంలో రచించిన ‘రారండి.. మనవూరి బడికి’’ పలువురి మన్ననలు పొందుతూ వచ్చింది. గతంలో స్నేహ కళాసాహితి ప్రచురించిన దుక్కి, నకజనకరినాం..నాం. బడిపాటలు ఈ కోవకి చెందినవే. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడుగా, ప్రవృత్తిరీత్యా సాహిత్యకారుడిగా తనదైన ముద్రను వేసుకొని ముందుకు సాగిపోతున్నాడు చింతా అప్పలనాయుడు.
‘కాసుల కళ్ళతో/కానె్వంట్లు చూస్తాయి / తోవంట కాస్తాయి/ దారిమళ్లిస్తాయి’ అంటూ వర్తమాన ప్రవేటు విద్యా సంస్థల తీరుతెన్నులను ఎద్దేవా చేస్తూ, సామాజిక వాస్తవికతను తేటతెల్లం చేస్తాయి. ఆర్థిక సంపాదనే ప్రధాన లక్ష్యంగా, సామాన్య ప్రజానీక రక్తమాంసాలను పీల్చి పిప్పిచేస్తూ, విద్యను వ్యాపారమయం చేస్తున్న రీతిని కళ్ళకు కట్టిస్తాడు కవి చింతా. ఈ గేయాన్ని చదువుతున్నంతసేపూ భవిష్యత్తుపై గొప్ప భరోసాని కలిగించి, పాఠకుల్ని చైతన్యవంతం చేసి కర్తవ్యోన్ముఖులుగా మలుస్తుంది.
‘తూనీగ రెక్కలకు / బరువుల్ని కడతాయి / కేజీల లెక్కల కబురులే చెబుతాయి / వేష భాషల మీద /మోజు పుట్టిస్తాయి / ఫీజుల ముక్కులతో /పీక్కుతింటాయి’ అనే ఒక సామాజిక విషాద వాస్తవికతను అక్షరీకరించడంలో కవి సఫలీకృతుడవుతాడు. బాల్యానికి పుస్తకాల బరువుతో సంకెళ్ళు వేయడంలోనూ, మాతృభాషకి సవాలు విసురుతూ ఆంగ్ల భాషా వ్యామోహాన్ని ఎరగా పరిచి వల విసరడంలోనూ, తాహతుకు మించిన ఫీజులను ముక్కుపిండి వసూలు చేయడంలోనూ.. ఉన్న స్వలాభాపేక్ష గుట్టును రట్టుచేసి బహిరంగ సమస్యగా వ్యక్తపరుస్తాడు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా నవనాగరికతా ఛాయలను విద్యార్థుల తల్లిదండ్రులపై పరోక్షంగా రుద్దడం వెనుక.. దాగిన అంతర్లీన కుట్రలను ఎండగడుతూ, సున్నితంగా విషయాన్ని తేటతెల్లపరుస్తాడు కవి. ఈ ఆలోచనకు బీజప్రాయమైన ఉదాహరణలతో పాటు, పీకల్లోతుగా వేళ్ళూనుకుపోయి మూలాల రహస్యాలు కార్పొరేట్ సంస్కృతిలో సర్వసాధారణమైపోయాయి.
ఇలా చెబుతూనే..
‘చిట్టి పాపల్లార / బుజ్జి బాలల్లార / పలక బలపం పట్టి /రారండి బడికి / మన ఊరి బడికి’ అంటూ సమాజసిద్ధ శైలిలో, ప్రాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుత కదలికలతో, ఆటపాటలతో అనుభవించాల్సిన బాల్యంలోని ప్రాథమిక విద్యను, దాని అవసరాన్ని నొక్కి చెబుతాడు.
ఇంకో చోట..
‘వద్దమ్మ వద్దు / ఆ కానె్వంటులొద్దు /మన వూరిలో బడి / మనకెంతో ముద్దు’ అని హెచ్చరించి సముదాయించడంలోని ఒద్దికత, ఔన్నత్యం, స్పష్టత, దిశానిర్దేశనం మాతృభాషను బతికించడానికే. పరదేశీ భాషా గాలులు తీవ్రతరం అయ్యేకొద్దీ.. తెలుగుతనానికి దూరమవుతున్న తెలుగువాసులను ఒకే గొడుగు నీడ కిందకి తెచ్చే ప్రయత్నంలో భాగమే.
భవిష్యత్తు రోజుల్లో ఆంగ్ల భాష అవసరమే కాని.. అది మాతృభాషకి కంటగింపుగా మారి, ఉనికికే ముప్పు తెస్తున్నపుడు అస్తిత్వ వేదన ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటి లోచూపుతో భావితరాలను చైతన్యవంతం చేస్తూ, ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా.. ప్రభుత్వ బడులను ఉన్నతీకరించడానికి, విప్లవాత్మక మార్పులతో కొత్తపుంతలతో శ్రీకారం చుట్టడానికి, మాతృభాషలోని విద్యాబోధన ఆవశ్యకతను చాటి చెప్పడానికి.. ఈ చిట్టిగేయం ఒక మార్గదర్శి, దిక్సూచి. ఎరుకపరిచే తెలుగింట విద్యా వారధి.
ఇలా విభిన్న కోణాల్లో తనదైన శైలిలో ఈ గేయ రచన చేస్తాడు అప్పలనాయుడు. ఈ కృషి వర్తమానతరానికి ఎంతో ఉపయుక్తకరమైనది. మొత్తంగా చదివి చూసినపుడు, ఇంకొన్ని పేజీలను రాసి పెంచివుంటే నిడివిలో మరింత సమాచారాన్ని లోతుగా అందించినట్టయ్యేది. అరచేతిలో ఇమిడిపోయే ఈ చిట్టిగేయ పుస్తకం ఇచ్చే స్ఫూర్తి తక్కువేమీ కాదు. చర్చకు పెడితే ఎన్నో చిట్టిపొట్టి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇందులో. వర్తమాన స్థితిగతులకు అద్దం పట్టించిన ఈ గేయాన్ని అందరూ ఆదరించి అక్కున చేర్చుకోవాల్సిన సందర్భం ఇపుడు ఆసన్నమైంది. ఈ ప్రయత్నంలో భాగంగా అంతా అప్పలనాయుడు అందించిన విలువైన సందేశాన్ని సమిష్టిగా స్వాగతించాల్సిందే.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910