పఠనీయం

అక్షర స్పర్శతో కదిలిన ‘్భవ తరంగాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావతరంగాలు
రచన - బుడితి రామినాయుడు, వెల:రూ.50/-,
ప్రతులకు:బుడితి రామినాయుడు, ఎంఐజి 152, ఎపిహెచ్‌బి కాలనీ, బాబా మెట్ట, విజయనగరం-535 002, ఫోన్:9490139503, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవోదయ బుక్ హౌస్ అన్ని బ్రాంచీలలో.
==============================================================
తాను చూసిన ప్రపంచాన్ని తనదైన శైలితో అక్షరీకరించడం అనుభవ నేపథ్యంలోంచి తొంగిచూస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. అక్షరానుబంధమే కవిత్వంలో పెనవేసుకుంటుంది. అలా పుట్టుకొచ్చిందే ఈ ‘్భవ తరంగాలు’ కవితా సంపుటి.
దీని కవి బుడిత రామినాయుడు. ఇందులో 33 గేయ, పద్య కవితా శీర్షికలు ఉన్నాయి. స్వతహాగా నటుడు, రచయిత, కవి. అనేక నాటకాలు రాసిన సుదీర్ఘ అనుభవముంది. ఇతను రాసిన ‘కోయపిల్ల’ సాంఘిక నాటకం ఆధారంగా భరణీ పిక్చర్సువారు ‘ప్రేమ’ పేరుతో తెలుగులో, ‘కాదల్’ పేరుతో తమిళంలోనూ చలనచిత్రాలను నిర్మించారు. గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకంలో ‘గిరీశం’ ప్రదర్శనలతో నిష్ణాతులైన మహానటుల ప్రశంసలను పొందారు. వ్యాసాలు, పద్యాలు రాయడంలో మంచి దిట్ట. గేయ శైలిలో వచన రచన కొనసాగుతుంది.
‘కొండ’ కవితలో..
‘‘వాన నీ మీద కురిస్తే / నీటిని దానం చేస్తావు / మా పొలాలకు’’ అంటారు ఒక చోట బుడితి రామినాయుడు. ఇలా చెప్పడంలో అభ్యుదయ దృక్పథం ఆశావాద స్పృహతో ప్రతిబింబిస్తుంది. సహజంగా జరిగే ఒక ప్రకృతి సిద్ధ దృశ్యాన్ని కవిత్వమయం చేస్తుంది. కొండమీద కురిసే వానను పొలాలకు దానం చేసే నీరుగా చెప్పడం ఇందులో ప్రత్యేకత. ఇది సాధారణ అనుబంధానే్న అనుభూతిగా మార్చి కొండకి, వానకి, నీటికి పెనవేసుకున్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది.
‘సమతా సూత్రం’ కవితలో-
‘‘కళ్ళజోడు ఖరీదు / కాళ్ళ జోడు ఖరీదు /కవల పిల్లలై పెరిగాయి’’ అంటారు కవి. దేహానికి ధరించే రెండు వస్తువులను తీసుకొని కవల పిల్లలతో పోల్చి చెప్పడం ఒకరకమైన అభివ్యక్తీకరణలోని సామాజిక కోణ నిర్మాణాన్ని బొమ్మ కట్టించడమే అవుతుంది. లోతుగా ఆలోచిస్తే.. ఏకత్వాన్ని పోలిన సమతా సూత్రం ఉట్టిపడుతుంది. ఈ ప్రయోజన ఫలితమే ఈ కవితను సున్నితంగా పాఠకులకు దగ్గర చేస్తుంది.
‘అమాయకుడు’ శీర్షికలో..
‘‘నిత్యావసర వస్తువులకు /నీళ్ళ ధార వదిలేసి / ఆశ వదులుకోలేక / ఆలోచన చేశాను’’ అనడంలో ఒక పరిష్కార మార్గాన్ని ప్రత్యామ్నాయ దృష్టితో అనే్వషించే పనిలో పడతారు ఈ కవి. ఇలా చెబుతున్నపుడు ఈ వ్యవస్థ ఆర్థిక తీరుతెన్నులను కాచి ఒడబోసి తనలోకి ఆవాహన చేసుకుంటారు కవి. చైతన్యపూరితమైన దిశానిర్దేశాన్ని మార్గదర్శకం చెయ్యడానికి ఇదొక ప్రతీక. సందేశాత్మక భావం అంతర్లీనంగా కొట్టిమిట్టాడుతూ సరికొత్త ఉద్భోదానికి దారితీస్తున్నట్లు అనిపిస్తుంది.
‘రైతు బిడ్డకు తల్లి మేలుకొలుపు’ పద్య కవితలో విరుపుని చమత్కార ధ్వనితో ఉట్టిపడేలా చేస్తారు కవి.
‘సూటిగ గొటేరు పాటలు /నాటగనే లేద చెవుల నాతనయుడబల్ /వాటముగ గోడి పుంజులు /గూటి నడుమ గూయునట్టి కూతలు వినవో’ అని అంటున్నపుడు పల్లె సౌందర్యపు తొలి వేకువ మేలుకొలుపు కూత కోడిపుంజుల రూపంలో లోకానికి సాక్షాత్కరిస్తుంది.
కోటేరు పాటలు సైతం నాగేటి చాలు రైతు నీడలో దేశానికి వెనె్నముకగా నిలిచే దృశ్య ప్రతిబింబానికి నిలువుటద్దంగా మారుతుంది. ఈ స్థితిని కళ్ళకి కట్టించే సందర్భాన్ని కవి ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
‘సాగరము’ శీర్షికలో ఇంకోచోట ఇలా చెబుతారు.
‘నీ గాలి సోకినంతనే / రోగాలే తొలగునంట రూఢిగా / సాగరమా నేనేమని / నీ గరిమను పొగడనేర్తు నేరుపు మీరన్’ అంటూ విడమర్చి చెబుతున్నపుడు.. సముద్రపు గాలి స్పర్శకు రోగాలు సైతం మటుమాయమయ్యే ఖచ్చితత్వాన్ని, ఈ భూమిపై ప్రశంసలకు పాత్రమయ్యే సందర్భాన్ని ఈకవిత దృశ్యమానం చేస్తుంది. ఇది ఒకవాస్తవంగానే కాక, పరోపకార దృష్టితో సామాజిక శ్రేయస్సుకు పాటుపడే లోకహిత సందేశంగా కూడా తోస్తుంది. కాబట్టే తనదైన ప్రత్యేకతను ఇది నిలబెట్టుకుంది.
ఇలా బహుముఖ సామాజిక సంస్కరణ కోణాలను తడమడంలో ఈ కవి రచనాశైలి అందెవేసిన చెయ్యి. ‘క్రిస్టియానారొశెట్టి’ జానీ ఆంగ్ల కవితకు, ‘బఢే ఛలో బఢే చలో’ హిందీ గేయానికి అనువాదాలు కూడా ఇందులో వున్నాయి. మబ్బుల కిరీటం, చెరువుల అద్దాలు, మనోవ్రణాలు, పెనువజ్రాల కాఠిన్యం, గడ్డిపరుపు వంటి ప్రతీకల విరుపులు పద్యభాషకు గేయ సొగసునద్దాయి. ఆది- ఆంత్య ప్రాసలపై మమకార బంధం కవిని పాత తరానికి ప్రతినిధిగా నిలబెడతాయి. ఇలా అవిశ్రాంత కృషితో అలుపెరుగని యోధుడిగా ముందుకు సాగిపోతున్న బుడిత రామినాయుడు అడుగుల చప్పుడు ఈ అక్షర లోకానికి మరిన్ని వెలుగుల్ని పంచాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910