పఠనీయం

రచయితల ప్రూఫ్ ఫొటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంతర్వాహిని’ (సాహిత్యకారుల మనోగతాలు);
రచయిత: దాస్యం సేనాధిపతి; పుటలు: 146, వెల: రూ.100/-; ప్రచురణ: శ్రీ గీతా ప్రచురణలు, కరీంనగర్; ప్రతులకు: శ్రీ దాస్యం సేనాధిపతి, ఎం.ఐ.జి.-2,90, హౌసింగ్ బోర్డు కాలనీ, కరీంనగర్- 505001
==================================================================
రచన చేసేవాడు రచయిత. రచయితలతో ‘సహానుభూతి’ కలవాడు స ‘రస’ రచయిత. రచయితల పుస్తకాలను, మస్తకాలను పట్టుకున్నవాడు సహృదయ రచయిత. రచయితలను చరిత్ర పుటలకెక్కించేవాడు చారిత్రక (అవసర) రచయిత. ఇలాంటి గుణీనత ఉన్న ఆధునిక రచయిత శ్రీ దాస్యం సేనాధిపతి.
వీరు ఇటీవల రచించిన సాహిత్య చారిత్రక ప్రయోజనకర పుస్తకం ‘అంతర్వాహిని’. ఇది చాలా బాగుంది. అట్టహాసం (కవర్‌పేజీ) నిసర్గ సుందరం. అంతస్సారం సహృదయ సుహృదయతా సుందరం. ఈ పుస్తకంలో ఆచార్య ఎం.చెన్నప్ప, డాక్టర్ కపిలవాయి లింగమూర్తి, ఐతా చంద్రయ్య, ఆచార్య రావికంటి వసునందన్, ముడిపల్లి భద్రయ్య, డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ, డాక్టర్ జె.చెన్నయ్య, భండారు విజయ, డాక్టర్ దేవరాజు మహారాజు మొదలైన యాభై ముగ్గురు రచయితల, కవుల, పండితుల ఔద్యోగిక, సాహిత్య వివరాలే కాకుండా, సాహిత్య లక్షణము, ప్రయోజనము, కర్తవ్యాల గుఱించి వారి వారి దృక్పధాలు, చిరునామాలు గూడా పేర్కొనటం సేనాధిపతిగారు సాహిత్య లోకానికి చేసిన సమకాలీన సమర్చన; మఱపురాని, మాసిపోని మహోపకారం. ఇలాంటి పుస్తకం రాయటానికి పడాల్సిన శ్రమ వర్ణనాతీతం.
ఈ పుస్తకం ‘సాహిత్య ఆత్మ’ తెలుసుకోవటానికి, దాన్ని గుఱించిన రచయితల భిన్నభిన్న అభిప్రాయాలు తెలుసుకొని పాఠకుడు చివరికి సారాంశప్రాయంగా ఒక స్థూల అభిప్రాయ నిశ్చయానికి రావటానికి మంచి మార్గదర్శిని అవుతుంది.
ప్రప్రథమ ఆలంకారికుడైన భరతుడు చెప్పిన ‘రోసవైసః’ అనే సిద్ధాంతానికి ప్రాముఖ్యం ఇచ్చారు. డాక్టర్ నందినీ సిధారెడ్డి (2వ పుట). రసాలంకాల ధ్వనులకు మూడింటికీ సమ ప్రాధాన్యం ఇచ్చారు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి (17వ పుట). జగన్నాథ పండితుడు జెండా పట్టిన రమ్యోక్తి (చమత్కార) వాదాన్ని సమర్ధించారు డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ (78వ పుట). బాలగంగాధర తిలక్ ఉద్పీపింపజేసిన అనుభూతి వాదానికి (-ఖూళ -్యళఆక యూ ఉ్ప్యష్ఘఆజ్పళ -్యళఆక కి) హారతి పట్టారు డాక్టర్ జె.చెన్నయ్య (86వ పుట). తక్కువ ఉపమానాలతో ఆచితూచి కవిత్వీకరించటం కాళిదాసు గొప్పదనం’ అంటూ శ్రీమతి భండారు విజయ పరోక్షంగా భామహుడి అలంకార వాదానికి, క్షేమేంద్రుడి ఔచితీవాదానికి అగ్రాసనం ఇచ్చారు. (111వ పుట).
‘‘మనిషి తానేమి చేయగోరుతున్నాడో తెలుసుకునే సాధనం- కళ. మనిషి తానేమి చేయగలడో తెలుసుకునే సాధనం విజ్ఞానశాస్త్రం’’ అన్న డా.దేవరాజు మహరాజుగారి వింగడింపు సూక్షంలోనే గంధీర భావ సంభరితంగా అందగించింది (138వ పుట).
‘సైన్సుకు జ్ఞానం, సాహిత్యానికి అనుభూతి కేంద్ర బిందువులు’ అని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ అన్న మాటలకు మరో రూప విశే్లషణార్థంగా భావిస్తున్నాయి దేవరాజుగారు అన్నమాటలు. ఆధునిక వచన రచనాకర్షణ లక్షణం సరళతా సుందరతా సహితత. అది ఇందులో రచయిత కనబరచిన నిపుణత. రచయిత కూర్చిన పరిచయ వాక్యాలు హుందాగా ఉన్నాయి.
28వ పుటలో శ్రీమతి ల్యాదాల గాయత్రిని గుఱించి రాస్తూ ‘సహస్రవాణి, శతపద్య కంఠీరవ బిరుదులను సొంతం చేసుకున్నారు’ అంటూ సేనాధిపతి ‘్ధ్వనిం’చిన ‘సముచిత’్భవం రమణీయం. ‘సొంతం చేసుకున్నారు’ అనటంలో ‘ఆమె కేవలం తన అద్భుత శక్తి సామర్థ్యాల అర్హతతోనే ఆ బిరుదులు పొందారు. అవి ఎవరో మొహమాటానికి ఇచ్చినవి కావు’’ అనే భావం ఆ రచయిత్రి పట్ల తనకున్న సుదతీ సాహితీ గౌరవాన్ని సముచిత పద సమర్ధంగా చెప్పారు. 63వ పుటలో డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గుఱించి రాస్తూ ‘తాను చిన్నతనంలో పడిన దుర్భర కష్టాలు పేదలకురావద్దని... కాంక్షించే అక్షర ప్రేమికుడు’ అన్న వాక్యం సమార్ద్రహృదయ సంకేతం, సముదాత్త సందేశాత్మకమూను, ‘విశ్వశ్రేయఃకావ్యం’ అన్న కావ్యప్రయోజన సిద్ధాంతవాదుల సూక్తికి సాహిత్య తపస్వి అయినవాడు తాను అంకితం అయిపోవాలి అనటం ‘అక్షర ప్రేమికుడు’ అన్న పదప్రయోగంలోని పరోక్ష ఉదాత్త అంతరార్థం, సందేశమూను సేనాధిపతిగారి అంతరంగంనుంచి. మొత్తంమీద చాలామంది కవులు, రచయితల గ్రూప్ ప్రూఫ్ (మచ్చుఅచ్చు) ఫొటో ఈ పుస్తకం ఒక భావజాల ‘అంతర్వాహిని’గా.
ఈ పుస్తకంలోని కొందఱు రచయితలు అభిప్రాయపడినట్టుగా సాహిత్య ఎకాడమీ లెఫ్టిస్టుల పెత్తనంలోనే అవార్డులిస్తోంది అనేది ఒక చేదు నిజం.
ఇంకా తెలంగాణాకు చెందిన పండిత కవులు, రచయితలు అష్టకాల నరసింహశర్మ, డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య, గన్ను కృష్ణమూర్తి, డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్య, డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్య, డా.వెలుదండ నిత్యానందరావు మొదలైన వారి గుఱించిన వివరాలు కూడా మరో పుస్తక రూపంలో దాస్యం సేనాధిపతిగారు అందిస్తే బాగుంటుంది - సాహిత్య సేవా కర్మయోగిగా శ్రమ తీసుకొని.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290