పఠనీయం

ఆలోచింపజేసే అక్షర న్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర న్యాసం;
సాహిత్య వ్యాస సంపుటి, వెల: రూ.250/-
ప్రతులకు: జి.సుమిత్ర, సైబర్ మేడోస్, మసీదు బండ- కొండాపూర్, హైదరాబాదు-84.
==========================================================
లోగడ తెలుగు విశ్వవిద్యాలయంలో విజ్ఞాన సర్వస్వ సంచాలకులుగా బాధ్యతలు నిర్వహించిన ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి ఆయా సందర్భాలలో రచించిన వ్యాసాలు సదస్సులలో చేసిన ప్రసంగాలు ఒక సంకలనంగా తీసికొని వచ్చారు. దాని పేరే అక్షర న్యాసము. ఇందులో అనేక పార్శ్వాలలో వివిధ విషయాలను చర్చించిన ఆధునిక వ్యాసాలున్నాయి. రచయితకు బాగా పరిచయంఉన్న కవి పండితులపై వారి కవిత్వం వ్యక్తిత్వం విశే్లషిస్తూ రూపొందించిన రచనలున్నాయి.
అలాంటి వారిలో ఆచార్య సి.నారాయణరెడ్డి. పుల్లా దుర్గయ్య, దాశరథి కృష్ణమాచార్య, దువ్వూరు రామిరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, ముకురాల రామారెడ్డి, ఉత్పల సత్యనారాయణాచార్య వంటి ఎందరో ఆధునికులపై విశే్లషణాత్మక వ్యాసాలున్నాయి. అలాగే అన్నమయ్యపైన, అనుభూతి కవిత్వంపైన కూడా విశే్లషణ ఉంది. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రేడియో నాటికలపై ఒక పరిశీలన ఉంది. బుద్ధిమంతుడు చలనచిత్రంలో అక్కినేని వ్యాసం ఈ సాహిత్య సంపుటిలో చేర్చటం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. విజ్ఞాన సర్వస్వాలపై ఒక అనుశీలన ఉంది. తెలుగులో జీవిత చరిత్రలను మరో వ్యాసంలో ప్రస్తావించారు.
ముఖ్యంగా చెన్నకేశవరెడ్డి ఛందస్సులో విద్వాంసుడు. ఈ విషయం తెలుగు గజళ్లు అనే వ్యాసంలో మనం గమనింపవచ్చు. ఉర్దూ గజల్ ఛందస్సు మూలాలను ఇందులో కరతలామలకంగా విశే్లషించారు. త్యాగరాజు కృతులలో ఛందో విశే్లషణ చెన్నకేశవరెడ్డి పాండిత్యానికి ప్రతీక.
దువ్వూరి రామిరెడ్డిగారి కృషీవలుడు-గంగుల శాయిరెడ్డిగారి కాపుబిడ్డ ఈ రెండింటి తులనాత్మక పరిశీలన మరో వ్యాసంలో ఉంది. ప్రముఖ సంస్కృత పండితుడు రవ్వాశ్రీహరి లోగడ అన్నమయ్య తన పద కవితలో రకరకాల నవ్వులను వర్ణించారో ఒక గ్రంథంలో ఎత్తిచూపారు.
ఈ గ్రంథాన్ని పరామర్శిస్తూ చెన్నకేశవరెడ్డి ఒక సమీక్షా వ్యాసం వ్రాసి ఆ శ్రీహరిపైనా ఈ శ్రీహరిపైనా తనకుగల ప్రేమను చాటుకున్నారు. యాభై ఏళ్ల తెలుగుకవిత్వం వస్తురూప వైచిత్రి వ్యాసం మరీ సంగ్రహంగా ఉంది. ఆధునిక యుగంలో వచ్చిన ఉద్యమాలను ఈ వ్యాసంలో సంక్షిప్తంగా పరిచయం చేశారు. జాతీయ వాదోద్యమ ప్రవక్తలలో ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి పేరుతోబాటు వలిగొండ శివప్రసాద్ కూడా ఉన్నట్లు వ్రాశారు. ఈ వలిగొండ ఎవరో తెలియదు. బహుశా ముదిగొండ అని ఉండాలేమో (56వ పుట) ఈ పుస్తకాన్ని రచయిత తన మిత్రుడైన అమ్మంగి వేణుగోపాల్‌కు అంకితం చేశారు. చెన్నకేశవరెడ్డి పరిశోధనా ప్రతిభకు ఈ అక్షరన్యాసం అద్దంపడుతున్నది.

- జొన్నాభట్ల నరసింహప్రసాద్