పఠనీయం

ధర్మపురి క్షేత్ర సమగ్ర దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

. శ్రీ్ధర్మపురి క్షేత్ర చరిత్ర
-డా.సంగనభట్ల నరసయ్య
వెల: రూ.180.. పే: 298
ప్రతులకు: రచయత
జి-3, ప్లాట్ నెం.199; గాయత్రీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్,
శ్రీపురం కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్ - 500036,
9666849180

చరిత్రను ఆధారాలతో సహా గ్రంథస్థం చేయ బూనడం కష్టతరమే. అందునా ప్రాచీన క్షేత్ర సమగ్ర చారిత్రిక నేపథ్యాన్ని సత్యశోధనతో, సంపూర్ణ ఆధారాలతతో, ఆమూలాగ్ర విశే్లషణలతో రూపొందించడం సాహసోపేతమే. దక్షిణ కాశీగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రైమూర్త్య క్షేత్రంగా భాసిల్లుతున్న గోదావరీ తీరస్థ తీర్థ, క్షేత్రమైన ధర్మపురి క్షేత్ర చరిత్రను, చారిత్రిక, సాహిత్యపర అంశాల ప్రాతిపదికన అవిరళ కృషితో, ప్రామాణిక విశిష్ట గ్రంథ రచన గావించారు, క్షేత్రానికే చెందిన కవి పండితులు, సాహితీ వేత్త, విమర్శకులు, చారిత్రక పరిశోధకులు, బహుముఖ ప్రజ్ఞులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య. దత్తాత్రేయ మహర్షి సంచాలకులుగా, విదర్భరాజు విశాలునికి చెప్పిన క్షేత్ర మహాత్మ్యం ఆధారంగా 3వేల ఏళ్ళ చరిత్ర కలిగినదని భావించ బడే సకల దేవతామయమైన ధర్మపురి ప్రాచీనత్వాన్ని, ప్రాధాన్యతను పౌరాణిక, చారిత్రక నేపధ్యాన్ని, ప్రాచీన రాజవంశాల ఏలుబడులలో ఉన్న స్థితులను, చేయబడిన అగ్నిష్టోమ చయన వాజపేయాది యజ్ఞయాగాదులను, స్థల పురాణాలు, సాహిత్య గ్రంథాలు, శాసనాలు, నిర్మాణాలు, దాన పత్రాల సాక్ష్యాధారాలతో సహా నరసయ్య పేర్కొన్న వివరాలు అనితర సాధ్యాలుగా చరిత్రలో నిలిచి పోనున్నాయి. విజయ నగర సామ్రాజ్య స్థాపనా సమయంలో ధర్మపురికి చెందిన చతుర్వేద ఘనాపాఠీలను శ్రీవిద్యారణ్య స్వామి ఆహ్వానించి, పాల్గొనేలా చేసినట్లు, శృంగేరీ పీఠాధీశ్వరులు కాక ముందు ధర్మపురిలో విద్యారణ్యులు వేదాధ్యయనం చేసినట్లు, పుష్టిమత స్థాపకులైన వల్లభాచార్యుల మేనమామ ఇల్లు ధర్మపురిలోనే ఉన్నట్లు, ఆయనకు క్షేత్రంతో అనుబంధం ఉన్నట్లు, పోతన భాగవత రచనకు ధర్మపురి గోదావరిలోనే ప్రేరణ కలిగినట్లు, కొంగ్రొత్త విషయాలను సంవత్సరాలతో సహా నరసయ్య నిరూపించడం విశేషం. ధర్మపురి ప్రాచ్య డిగ్రీ కళాశాల ఉపన్యాసకునిగా, ప్రాచార్యునిగా, రాజమండ్రిలో యుజిసి రిఫ్రెషర్ కోర్సుకు శిక్షకునిగా, శాసన లేఖన శాస్త్రాల ప్రయోగశాల ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగార, పరిశోధనా సంస్థ, హైదరాబాద్‌లో శిక్షకునిగా, తెలుగు విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం, ఉస్మానియా యూనివర్సిటీ, హంపీ, కర్నాటక విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పాఠ్యాంశాల రచయితగా, సాహిత్యంలో పలు ప్రాజెక్టులు నిర్వహించిన విశేషానుభవాన్ని జోడించి పలు చారిత్రక, సాహిత్య ఆధారాలను గ్రంథస్తం చేశారాయన. ధర్మపురి క్షేత్ర నామం, ఆధ్యాత్మిక నేపథ్యం, పూజావిధానాలు, సంస్కృతీ చరిత్ర, అర్చకులు, ప్రాచీన చరిత్ర ఆధారాలు, మరుగున పడిన చరిత్ర, పూర్వ గ్రామ స్థలం, విగ్రహాలు శిల్పాలు, గోదావరి నది, నదిలోని వివిధ గుండాలు, బ్రహ్మపుష్కరిణి, వరాహ తీర్థం, విమలాసరోవరం, భద్రానది, అక్కపెల్లి చెరువు, విలసిల్లిన మతాలు, సాంస్కృతిక వైభవం, విద్యాలయాలు, కళా సంస్థలు, సత్రాలు, గడీ, స్వాతంత్య్ర సమర చరిత్ర, క్షేత్రంలో పండువలు, దేవాలయాలలో అంగరంగ వైభోగాలు, ధర్మపురి భాషా చరిత్ర, మధ్య యుగాలలో విశిష్టత, నూతన నిర్మాణాలలో కరిగిన ప్రాచీనత్వం, పర్యాటక క్షేత్రంగా ధర్మపురి వివరాలు తదితర అంశాలను క్రోడీకరిస్తూ గ్రంథరచన గావించారు. ఈ గ్రంథం ధర్మపురి క్షేత్ర సమగ్ర చారిత్రక, సాహిత్య సవివర సమాచారం అందిస్తూ, భావి తరాలకు స్ఫూర్తిదాయకం కానున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

--రామకిష్టయ్య