పఠనీయం

కద(థ)న రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు గంటల వార్తలు
విదేశీ కథలు
అనువాదం: కొల్లూరి సోమశేఖర్,
వెల: రూ.120/-,
కాపీలకు అన్ని పుస్తక కేంద్రాలు,
ఇ-బుక్
kinege.com
*
అనువాధ సాహిత్యం మన గదిలోంచి, వీధిలోకి తెరిచిన కిటికీ లాంటిది. గదిలోని వాతావరణం కంటే భిన్నంగా, విస్తృతంగా, విశాలంగా కనిపిస్తుంది. తెరిచిన కిటికీలోంచి క్రొత్త వెలుగు, భిన్నమైన పరిమళం, గాలి మనల్ని పలకరిస్తుంది. గది నాలుగు గోడల మధ్య ఊపిరులు పోసుకున్న వెలుగు, చీకట్ల అవతల వున్న మరో లోకానికి పాఠకుడికి వీసా పాస్‌పోర్టుల ప్రమేయం లేకుండా పరిచయం చేస్తుంది.
అయితే, కిటికీని ఎప్పుడు తెరిచినా, అతి దగ్గరి నేపాలు వేపు తెరిచినా, సుదూరపు కెనడా వేపు తెరిచినా, గది లోపలకూ, కిటికీ బయటకూ ఒక స్వామ్యం, కామన్ థ్రెడ్ కన్పిస్తుంది; అదే జీవితం! మనిషిని మనిషితో కలిపే ప్రేమ; మనిషిని మనిషిని వేరు చేసే పగ, ద్వేషం, యుద్ధం, మారణహోమం. వీటన్నింటిమధ్య పూసల్లో దారంలా కనిపించేది జీవితం.
అందుకే, ఏ భాష అయినా తన గదిలోని కిటికీని తెరచి ఉంచాలి. బయటి గాలుల్ని ఆ గాలులు మోసుకువవచ్చే పరిమళాల్ని స్వేచ్ఛగా ప్రసరించనీయాలి. అప్పుడే మనకు ‘అవతలి’ జీవితాలు అర్థం అవుతాయి. అవగాహన పెరుగుతుంది. మేధ విస్తరిస్తుంది.
రచయిత కొల్లూరి సోమశంకర్‌గారు ఇరవై ఏళ్ళుగా కథలు రాస్తున్నారు. ప్రపంచ కథలన్నీ అంతర్జాలం ద్వారా చదువుతున్నారు. నచ్చిన, మెచ్చిన కథల్ని తెలుగులోకి అనువదిస్త్తున్నారు. తెలుగు ఆలోచనల్ని హిందీ, ఇంగ్లీషు వంటి ఇతర భాషల్లోకి కూడా అనువదిస్తున్నారు. వీరు ఇంతవరకు మూడు అనువాద కథల సంపుటాల్ని వెలుగులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. నాల్గవ సంపుటం ‘ఏడు గంటల వార్తలు’. ఇందులో 14 విదేశీ కథలున్నాయి. అతి దగ్గరి నేపాల్ దేశం నుండి, అతి దూరపు కెనడా వరకు ఈ కథలు మనల్ని తీసుకువెళ్తాయి. చిన్న, ఆభరణాల వ్యాపారం వర్సెస్ వృద్ధాప్యం (విచారగ్రస్తుడు కెనడా కథ) అమెరికా దేశంలో ఆనాడు ఉండిన బానిసత్వం, మతగురువుల కాపట్యం, సైనికాధికారి కర్కశత్వంలో మానవత్వం (మానవత్వం- అమెరికా కథ) మూఢ నమ్మకాలు (వానదొంగ -పోర్చుగీసు కథ) లాంటి మానవ జీవిత సంక్లిష్టాలను ఈ కథలు వివరిస్తాయి. అయితే, ఈ కథల్ని ప్రపంచ కథల తీరుతెన్నులను వివరించే రిప్రజెంటేటివ్ కథలు అని భావించాల్సి వస్తే, ఒక శోచనీయమైన, దుఃఖభాజనమైన, చేదు అనుభూతులను మిగిల్చే విషయం పాఠకుడిని కలవరపెడుతుంది. అది -బాంబులు, ఆత్మాహుతి దళాల ఘాతుకాలు, యుద్ధాలు, అవి తెచ్చే గుట్టల్లాంటి క్షతగాత్రులు, మనిషి మరణానికీ, జీవితానికీ తేడా లేని పోరాటాలు, పరస్పర హింస- మనం ఇంకా ఆదిమానవుల యుగంలోనే ఉన్నామని విచారం కలుగుతుంది. సింహభాగం కథలు ఇదే విషయాల్ని భిన్న కోణాల్లో ఆవిష్కరించటం చదివి పాఠకుడి గుండె బరువెక్కుతుంది. ఒక రొట్టె ముక్క కోసం, కాసిని అరటిపళ్లకోసం కొన్ని గంటలు లైన్లో నిలుచుని, చివరకు (అమ్మ) వంతు రాక ముందే ‘అరటిపళ్ళు ఇకలేవు’ అన్న మాట వినాల్సి వస్తే, రెండువేల ఏళ్ళు గడిచినా, మన ‘అభివృద్ధి’ ఒక అంగుళంమేర కూడా ముందుకు పోలేదని తెలిస్తే, బాధపడని పాఠకుడు బహుశా ఉండడు. మనం సాధిస్తోన్నది అభివృద్ధియా, వినాశనమా అని బాధపడతాము.
ఇందులోని కథలు లోగడ ప్రముఖ పత్రికలలో 1994 నుండి ప్రచురించబడినవి. రచయిత వాటిని ఇపుడు సంకలనంగా తీసుకువచ్చారు. మూల కథ ఎంత గొప్పదైనా, అనువాదం సరిగ్గా అమరకపోతే మూల కథకుడి ‘ఆత్మ’ను పాఠకుడు సరిగా పట్టుకోలేకపోతాడు. భాషా, ప్రావీణ్యం పరిణతి అనుభవం కలిగిన సోమశేఖర్ లాంటి రచయితలు ఈ ప్రతిబంధకాన్ని అధిగమించారు. పర్షియన్ రచయిత హుస్సేన్ మోర్తెజామిన్ అబ్కెనార్ రాసిన ‘చీకటి’ కధ చదువుతూంటే, ‘మనమే ఆ హింస గురవుతున్నామా’ అన్నంతగా కడుపులో దేవుతుంది. గాంధీగారు జాతిపితే కాదు, ప్రపంచ పిత అని ‘గాంధీ అభిమాని’ (ఫ్రెంచి కథ) చదివాక భారతీయ పాఠకుడికి ఆనందం కలుగుతుంది. ఒక్క వాక్యంలో ఈ సంకలనం గురించి చెప్పాలంటే - ‘‘కాలక్షేపానికో, సరదాకోసమో, ఉల్లాసానికో... ఓ గంట గడుపుదాం’’ అనుకునే వారికి ఈ సంకలనం నచ్చదు.

. -కూర చిదంబరం