పఠనీయం

‘హరికథా భిక్షువు’ సాంబారాధ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరికథా భిక్షువు
జీవన దర్శనం
-ఎం.ఎస్.సూర్యనారాయణ
వెల: రూ.200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో

నెల్లూరులో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరిగాయి. అనంతరం చిలువ పందిళ్లు విప్పుతున్నారు. ఇంతలో సాంబయ్యగారు ఊంఛ వృత్తికి బయలుదేరారు. ఒక ఇంటి ముందు నిలబడ్డారు. అప్పుడు గృహిణి ఎసరు బియ్యంతో వడివడిగా వచ్చి భిక్ష వేసింది. అంతా నివ్వెరపోయి ‘ఇదేమిటమ్మా? తడిబియ్యం జోలెలో పోశావు?’ అని ప్రశ్నించారు. ‘ఏం చేయను స్వామీ నా వద్ద ఈ పూటకు ఉన్నది ఇదే. ఆలస్యమైతే స్వామి పక్క ఇంటికి వెళ్లిపోతారని...’ అని ఆమె కన్నీళ్లతో జవాబు చెప్పింది.
సాంబయ్యగారు మరి కొంచెం ముందుకు సాగారు. ఓ రిక్షావాడు ఎదురువచ్చి జోలెలో తన రోజు కూలీ ధనం సమర్పించాడు. ‘ఇంతకన్నా నేనేమి ఇవ్వగలను? మా చెవులకు విందు నిచ్చారు. మళ్లీ ఎప్పటికో ఏడాదికి కదా’ అంటూ కంట తడిపెట్టుకున్నాడు.
ఇవి నిజంగా జరిగిన సంఘటనలే.
ఆ సాంబయ్యగారి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, ‘బాల’ గంధర్వునికి తండ్రిగారు!!
ఇప్పుడొక స్వానుభవం చెప్పాలి.
అది 1950వ సం. ఒంగోలు తూర్పుపాలెంలోని శివాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేను హైస్కూలు విద్యార్థిని. సాంబమూర్తిగారు మహాకవి కాళిదాసు హరికథ చెప్పారు. పరవశుడినైనాను. ‘ఈయన మనకు దగ్గర బంధువు’ అని మా తాతగారు జ్వాలయారాధ్యులు సాంబమూర్తిని పరిచయం చేశారు. అప్పటికి బాలు ఇంకా తెరంగేట్రం చేసి ఉండడు.
నిన్న నా చేతికి హరికథా భిక్షువు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి జీవన దర్శనం పుస్తకం వచ్చింది. ఆద్యంతం చదివాను. 1950 నాటి కాళిదాసు హరికథ గుర్తుకు వచ్చింది. పుత్రాదిత్యేత్ పరాజయం అనే సామెత గుర్తుకు వచ్చింది. ఎ గ్రేట్ సన్ ఆఫ్ ఎ గ్రేట్ ఫాదర్. అందరు కొడుకులూ ఇలా పిత్రూణం తీర్చుకుంటున్నారా?
ఈ గ్రంథం శివశ్రీ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంగారి ప్రేరణతో వచ్చింది. ఎం.ఎస్. సూర్యనారాయణ గారు రూపొందించారు. సాంబమూర్తి అయ్యవారు 1906లో జన్మించి 1987లో శివైక్యం చెందారు.
శ్రీపతి పండితుడు మల్లికార్జున పండితుడు మంచెన పండితుడు ఈ ముగ్గురినీ పండితత్రయం అంటారు. ఇందులో శ్రీపతి పండితారాధ్యుల వంశం వారే సాంబమూర్తి అయ్యవారు. వీరి తాత వీరేశలింగం అయ్యవారు. తండ్రి లింగమూర్తి అయ్యవారు. వీరి సంతానం గిరిజన, విజయలక్ష్మి, లింగమూర్తి, బాలసుబ్రహ్మణ్యం, జగదీశ్‌బాబు, శైలజ, పార్వతి, వసంతగారు. మొదటి భార్య సుబ్బమ్మ. నెల్లూరులోని కోనీటంపేటలో శ్రీమతి శకుంతలమ్మగారు జన్మించారు. అక్కడి విఘ్నేశ్వరస్వామి దేవాలయంలో వీరికి వివాహమయింది.
బాల్యం నుండి సంగీతంచేత ఆకర్షింపబడిన సాంబమూర్తి అయ్యవారు ఆదిభట్ల నారాయణదాసుగారి హరికథా సంప్రదాయాన్ని అంది పుచ్చుకున్నారు. హరికథను సమాహార కళ అంటారు. ఇందులో సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి కళలన్నీ కలిసి ఓ తప్రోతంగా పరీమళిస్తాయి. ఆ తరంలో కురంగేశ్వరరావు, పెద్దింటి సూర్యనారాయణ భాగవతార్, ములుకుట్ల సదాశివశాస్ర్తీ వంటి ప్రముఖులు హరికథను ఒక ధర్మప్రచార ప్రక్రియగా మార్చారు. ఆ యుగంలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారు ధృవతారగా వెలిగారు. సాంబమూర్తి గారికి ఆరాధ్య సంప్రదాయ పరంపరగా వచ్చిన శిష్య సంచారం ఉండేది. అందు నిమిత్తం వారు వివిధ ప్రాంతాలు సంచరించారు. ఎన్నో సన్మానాలు, పాదపూజలు అందుకున్నారు. రాజోలు రంగప్పలు ఇచ్చే విరాళాలలోగాక ఊంఛ వృత్తిలో వచ్చే ధనంతో శ్రీ త్యాగరాజ స్వామి ఉత్సవాలు నిర్వహించారు. సాంబమూర్తి అయ్యవారు యనమండ్ర వెంకటేశ్వర శాస్ర్తీగారు కృష్ణార్జునులని పేరు పొందారు. నెల్లొరులో ఒకనాడు సాంబమూర్తిగారు ఇలా ప్రకటించారు. ‘అనాధ బ్రాహ్మణ కుటుంబీకుల శవసంస్కారాలకు ఉచితంగా సహాయం చేస్తాము’ - ఇట్లు సాంబమూర్తి అని నెల్లూరు ‘గోడపత్రిక’ మీద అవాసిన వార్త చదివి అంతా ఆనందపడ్డారు. శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారు కాళాదిసుతోబాటు భారత భాగవత రామాయణ కథా సంబంధులు చెప్పేవారు. వీరి జీవిత విశేషాలు ప్రొ.తూమాటి ద్రోణప్పగారు తమ హరికథా సర్వస్వంలో కొన్ని పొందుపరిచారు. అయ్యవారిది కౌశిక గోత్రం. ఆపస్తంబసూత్రం. ప్రాథమిక విద్య శ్రీకాళహస్తిలో జరిగింది. గురువు వారణాసి సుబ్రహ్మణ్య శాస్ర్తీ. నెల్లూరు హరికథా గాన వాద్య పరిషత్తులో సభ్యులైనారు.
సాంబమూర్తిగారు చెప్పిన కొన్ని హరికథలు - నందనార్ సత్య హరిశ్చంద్ర ధృవ విజయం, సుమతి శశిరేఖ సుభద్ర, దక్షయజ్ఞం, అయ్యప్ప, రాఘవేంద్ర స్వామి, రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం, శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం, కుచేల, గయోపాఖ్యానం, ఛత్రపతి శివాజీ, చిత్రనళీయం, మీరాబాయి, పార్వతీ కల్యాణం, చింతామణి, తుకారాం, ఉష, ఇత్యాదులు. ఈ జాబితాలో పౌరాణిక చారిత్రకాలు కూడా ఉండటం గమనార్హం.
చాలా అందంగా ఖరీదైన పేపర్‌పై ముద్రింపబడిన ఈ సచిత్ర గ్రంథం ఒక పరిశోధనా సర్వస్వంగా రూపొందించిన రచయిత ప్రశంసాపాత్రులు. గ్రంథం చివర శైవ సిద్ధాంతానికి సంబంధించిన ఒక వ్యాసం ఉంది. దానిని పునర్ముద్రణలో సవరించుకోవాలి. ఎందుకంటే బసవన్నకు శ్రీపతి పండితులకూ ఎట్టి సంబంధమూ లేదు. పైగా సాంబమూర్తిగారు శ్రౌత శైవుడే కాని వీరశైవుడు కాదు. భవిష్యత్తులో తెలుగులోని హరికథకులపైన గాని, సాంబమూర్తి గారి జీవితం మీద గాని విపుల పరిశోధన చేసే వారికి ఈ గ్రంథం ఆకరంగా (సోర్స్ మెటీరియల్) ఉపయోగపడుతుంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్