నమ్మండి! ఇది నిజం!!

పీతలొస్తున్నాయ్ జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలో హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ ఐలాండ్‌లో ఎర్ర పీతలు లక్షల కొద్దీ ఉన్నాయి. ఇవన్నీ ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని పీతలు అరుదుగా ఆరెంజ్, పర్పుల్ రంగుల్లో కూడా ఉంటాయి.
ఆ రకం పీతలు ప్రపంచంలో మరెక్కడా లేవు. కేవలం ఆ దీవిలో మాత్రమే 43 కోట్ల 70 లక్షల పెద్ద ఎర్ర పీతలు నివసిస్తున్నాయని అంచనా వేశారు. చాలా పెద్దగా, దాదాపు నాలుగున్నర అడుగుల చుట్టుకొలతలో ఉండే ఇవి తరచు తమ పై షెల్స్‌ని వదిలేస్తూంటాయి. తిరిగి ఆ పెద్ద శరీరం మీద కొత్త షెల్స్ పెరుగుతాయి. ఇవి అడవిలో రాలిన ఆకులు, పువ్వులు, పళ్లు, గింజలని తింటాయి. ఐతే వీటికి తాజా ఆకులు ఇష్టం. ఇవి మాంసాహారులు కూడా. చచ్చిన తోటి పీతలని, పక్షులని కూడా తింటాయి. ఇవి తప్ప అడవిలో మరే జంతువూ లేకపోవడంతో వీటికి ఆహారపు కొరత లేదు. సగటున ప్రతీ చదరపు మీటరుకి ఓ బొరియ చొప్పున తవ్వుకుని వాటిల్లో నివసిస్తాయి. ప్రతీ బొరియలో ఒకటే పీత నివసిస్తుంది. ఒంటరిగా జీవించే ఇవి తమ బొరియలోకి ఇంకో పీత రావడానికి ఇష్టపడవు. పుట్టిన నాలుగైదేళ్లకి ఇవి సంతానాన్ని కనే స్థితికి చేరుకుంటాయి. ఆడ పీతలు జత కట్టిన మూడు రోజులకి వాటి శరీరాల్లో గుడ్లు తయారవుతాయి.
ఆడ పీతలు ఏటా నవంబర్ నెలలో గుడ్లు పెట్టటానికి చంద్రుడు క్షీణించే రోజు సముద్రపు ఒడ్డుకి చేరుకుంటాయి. పోటు రాగానే ఉదయానికల్లా సముద్రపు నీటిలో గుడ్లని వదిలేస్తాయి. ఇలా ఐదారు రాత్రులు అవి సముద్రంలో అలలు వచ్చినప్పుడు గుడ్లని నీళ్లల్లో వదులుతాయి. ఓ ఆడ పీత లక్ష దాకా గుడ్లని పెడుతుంది. క్రిస్మస్ ఐలాండ్‌లో తల్లి పీతలు లక్షలకొద్దీ కలిసి సముద్రపు ఒడ్డుకి వచ్చి నీళ్లల్లోకి గుడ్లని వదిలి తిరిగి ఆ ద్వీపం మధ్యలోని అడవికి చేరుకుంటాయి. ఏటా నవంబర్ - డిసెంబర్ నెలలో 18 రోజులపాటు జరిగే ఈ ప్రయాణాలు చూడడానికి ఓ ఎర్ర నది ప్రవహిస్తోందా అనిపిస్తుంది. వాటికి చంద్రుడు క్షీణించే రోజు, సముద్రంలో నీరు పొంగే రోజు ముందుగా ఎలా తెలుస్తుందో అనూహ్యం. సరిగ్గా ఆ రోజుకి లక్షల కొద్దీ పీతలు అక్కడికి చేరుకోవటం అద్భుతం.
ఆ సమయంలో రోడ్లన్నీ పీతలతో నిండిపోతాయి. కార్లు డ్రైవ్ చేసే వాళ్లు అప్రమత్తంగా లేకపోతే అవి టైర్ల కింద పడి వాటి రక్తమాంసాలకి టైర్లు జారిపోయి కార్లకి ప్రమాదం కలిగే అవకాశం ఉంటాయి. ముందుగా మగ పీతలు వెళ్తాయి. ఓ రోజు తర్వాత ఆడ పీతలు వాటిని అనుసరిస్తాయి. ఆ సమయంలో రోడ్లని తాత్కాలికంగా మూసేస్తూంటారు. 2013లో సగటున 5 కోట్ల పీతలు రోడ్లని దాటాయని అంచనా. సాధ్యమైన చోట్ల అవి రోడ్డెక్కకుండా ప్లాస్టిక్ ఫెన్స్‌లని, గోడలని నిర్మిస్తూంటారు. కొన్నిచోట్ల రోడ్డు కింద నించి శాశ్వతంగా సొరంగాలని కూడా నిర్మించారు. కొన్ని రోడ్లకి కొన్ని క్రాబ్ వంతెనలని అమర్చుతారు. ఇదంతా గొప్ప పర్యాటక ఆకర్షణగా మారింది.
చేపలు, షార్క్ చేపలు క్రిస్మస్ ఐలాండ్‌కి వచ్చి చాలా గుడ్లని తింటాయి. వాటి బారిన పడని గుడ్లు పిల్లలుగా మారాక అవి మళ్లీ ఒడ్డుకి చేరుకుంటాయి. సుమారు తొమ్మిది రోజులు పిల్లలన్నీ కలిసి అడవిలోకి వలస వస్తాయి. ఆ తర్వాత అడవి నేలలో మాయమై అవి మళ్లీ మూడేళ్ల దాకా కనపడవు.
ఆ సమయంలో క్రిస్మస్ ఐలాండ్‌కి అనేక మంది పర్యాటకులు వీటిని చూడటానికి వస్తూంటారు. కార్లు అధికంగా ప్రయాణించే రోడ్లకి అటు ఇటు క్రాబ్ గ్రిడ్ అంటే అండర్‌గ్రౌండ్ పాసేజెస్‌ని పార్క్ రేంజర్లు నిర్మిస్తున్నారు. కారు డ్రైవర్లు కూడా పీతలు చావకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
వీటిని అంతం చేయడానికి ఆఫ్రికా నించి క్రిస్మస్ ఐలాండ్‌కి ‘ఎల్లో క్రేజీ ఏంట్’ అనే చీమలని తీసుకొచ్చి వదిలారు. అవి కోటిన్నర నించి రెండు కోట్ల పీతలని చంపాయని అంచనా. ఇవి వలస వెళ్లి సముద్రపు నీళ్లలోనే గుడ్లని ఎందుకు వదులుతాయో శాస్తజ్ఞ్రులు ఇంతదాకా కనిపెట్టలేక పోయారు. ప్రపంచంలో మరే చోట పీతలు గుడ్లని పెట్టటానికి ఇలా సముద్రంలోకి ప్రయాణించవు. ప్రపంచంలో వలస వెళ్లే పది జీవుల్లో ఇది ప్రధానమైనది.

పద్మజ