రంగారెడ్డి

సిఎంఆర్ ఫార్మసీ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 14: మేడ్చల్ శివారులోని సిఎంఆర్ ఫార్మసీ కళాశాల వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ తొలగింపు విషయమై ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల షోకేసు అద్దాలను ధ్వంసం చేశారు. వివరాల ప్రకారం.. మూడు మాసాల క్రితం భార్గవనాయుడు అనే విద్యార్థి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్‌రావు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో స్పందించిన యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను విధుల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పట్లో విద్యార్థులు ఆందోళనను విరమించారు. కాగా ఇటీవల తిరిగి ప్రిన్సిపాల్ కళాశాలకు రావడంతో జీర్ణించుకోలేని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కళాశాల ఎదుట భార్గవ్‌నాయుడి తల్లిదండ్రులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టిన యాజమాన్యం స్పందించకపొగా వౌనం దాల్చింది. దీంతో విద్యార్థులు నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలోని జెఎన్‌టియు ముందు ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్‌రావును ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందేనని అధికారులకు సైతం విన్నవించారు. స్పందించిన జెఎన్‌టియు అధికారులు సోమవారం సిఎంఆర్ ఫార్మసీ కళాశాలను సందర్శించారు. విద్యార్థి జెఎసి నాయకులతో చర్చలు జరిపారు. జెఎన్‌టియు నిబంధనల ప్రకారం కళాశాల తనిఖీ నిర్వహించినపుడు సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని అందుకే ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్‌రావు ఇటీవల కళాశాలకు రావడం జరిగిందని వివరించారు. ఆరు రోజుల్లో అధికారిక తనిఖీలు పూర్తి కాగానే ఆయనను తొలగిస్తామని అధికారులు, కాలేజీ యాజమాన్యం.. విద్యార్థి జెఎసి నాయకులకు హమీ ఇచ్చారు. నాయకులు విద్యార్థులతో చర్చల సారాంశాన్ని వివరించి ఆందోళను విరమింపజేశారు. మాట తప్పితే ఆందోళను మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థి జెఎసి నాయకలు విద్యార్థులు హెచ్చరించారు. కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.