ప్రార్థన

ఆశ్చర్యకరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును’ -యెషయా 9:6
ఆయన మన యెడల చూపిన ప్రేమ ఆశ్చర్యము - మన తలిదండ్రులు అన్నదమ్ములు అన్నచెల్లెళ్లు రక్తసంబంధులు స్నేహితులు కూడ ఇంతగా ప్రేమించలేరు. మనము పాపములో ఉన్నా, బలహీనముగా ఉన్నా వ్యతిరేకముగా ఉన్నా, శత్రువులముగా ఉన్నా, అవిధేయులముగా ఉన్నా తూలనాడినా దుర్భాషలాడినా కొట్టినా తిట్టినా అపహసించినా అవమానపరచినా బాధించినా దౌర్జన్యము చేసినా అన్యాయపు తీర్పు ఇచ్చినా నలుగగొట్టినా సిలువను మోయించినా సీలలతో కొట్టినా ముళ్లకిరీటము పెట్టినా నిరాకరించినా చివరకు చంపినా మారని ప్రేమ - ఆశ్చర్యకరమైన ప్రేమ - అద్భుతమైన ప్రేమ - ఆరని ప్రేమ - మారని ప్రేమ. ఈ ప్రేమకు నేను దాసుడను. ఇంత నిష్కళంకమైన నిస్వార్థమైన ప్రేమను ఎలా కాదనగలము. ఈ ప్రేమను పొందుకోవటమే నిజమైన క్రిస్మస్!
మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను - అనే ప్రవచనాన్ని ప్రభువు పుట్టుకకు 700 సం.ల ముందే యెషయా ప్రవక్త వ్రాశాడు. ప్రభువు వలన రక్షణ - బంధకాల నుండి విడుదల - శాంతి సమాధానములు వెలుగును గలిలయలో కలిగినట్లు తెలియుచున్నది. ఆ కుమారుని స్వీకరించిన మనకు చీకటి తొలగిపోయి శాంతి సమాధానము సంతోషము.. బంధకాల నుండి విడుదల కలిగి రక్షింపబడగలము అని బైబిల్ గ్రంథము సెలవిస్తోంది. దైవత్వము మానవత్వము రెండూ క్రీస్తు నందు కనబడుచున్నవి. సామాన్య మానవునిగా ఈ లోకములో జన్మించాడు. ఆయన జననానికి కూడా ఈ లోకము స్థలము ఇవ్వలేకపోయింది. మానవాళిని రక్షించడానికి పాప విముక్తుని చేయటానికి ప్రాణమే ఇవ్వటానికి వచ్చిన ప్రభువు జననానికి ఇంత స్థలము ఇవ్వలేని లోకాన్ని ప్రేమించి చిన్న పశువుల పాకలో స్థలము చూసుకొని జన్మించడం ఆశ్చర్యము కలిగిస్తుంది. ఎటువంటిదో ఈ ప్రేమ ఎంతగా తగ్గింపు కలిగి ఉన్నదో చూడండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు.. దహించు అగ్ని అయిన దేవుడు తగ్గించుకొని వచ్చిన ఈ ప్రేమను కాదనగలమా?! కాదని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవటమా? చేర్చుకొని ఆశీర్వాదములు పొందుకోవటమా - మన ఇష్టం.
ఈ ప్రేమ రాజు -ప్రజలను - పీడించి, వేధించి అధికారం చెలాయించి చాకిరీ చేయించి బానిసలుగా చేసి అధిక భారము వేసే స్వార్థపరుడు కాడు. కాని ప్రేమించి పెద్ద చేసి ఆదరించి కాపాడి రక్షించి భద్రపరచే అధికారి. ప్రేమాధికారి. ప్రేమరాజు.. ఈయన రాజ్యం ప్రేమ రాజ్యం. నీతి న్యాయములు జరిగించే వివేకము కలిగిన రాజు. బలవంతుడు. తప్పు లేనివాడు. పాపమెరుగని పరిశుద్ధ రాజు. సర్వాధికారంతో ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మింపవచ్చిన రాజు.
ఈయన పుట్టుక ఒక ఆశ్చర్యము. కన్య గర్భాన పుట్టినవాడు. ఆయన మాటలు, చూపులు పనులు ఆశ్చర్యము పుట్టించినవి. ఆయన మాటకు గాలి సముద్రపు పొంగు ఆగిపోయినది. సకల విధములైన వ్యాధులు నయమైనవి. ఆయన యొద్దకు వచ్చిన వారందరూ స్వస్థత నొందారని బైబిల్ సెలవిస్తోంది. అదే విశ్వాసంతో మనం వెళ్లినా స్వస్థత కలుగుతుంది. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. 2000 సం.ల క్రితం భూమి మీద ఆయన చేసిన కార్యాలు ఇప్పుడూ చేయగలడు. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ప్రభువు సెలవిస్తున్నాడు.
గ్రుడ్డివాడు చూపు పొందాడు. కుష్టువ్యాధి నయమైంది. బలహీనులు బలపడ్డారు. కుంటివారు నడిచారు. పక్షవాయువు కలవాడు బాగయ్యాడు. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. మానవునిగా ఉన్నా ఎటువంటి మచ్చ లేని జీవితం జీవించి, నాలో ఏదైనా లోపముందని నిరూపించగలరా అని సవాలు విసిరిన పరిశుద్ధుడు.
దయ్యాలను పారద్రోలాడు. గెరాసీనియుల దెయ్యము పట్టిన వాడొకడు బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గానీ ఇంటిలో ఉండేవాడు కాడు. (దెయ్యాలు మనుషులను ఇంటిలో కుదురుగా ఉండనీయక వీధులపాలు చేస్తాయి) వాడు యేసుని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి - యేసూ సర్వోన్నతుని కుమారుడా నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని కేకలు వేసి బ్రతిమాలుకున్నాడు. వాడిని గొలుసులతోను సంకెళ్లతోను కట్టియుంచినా గానీ వాడు బంధకములను తెంపుకునేవాడు. అటువంటి వాడిని ప్రభువు విడిపించాడు. ప్రభువు మాట ప్రకారము వానిలో ఉన్న దెయ్యాలు వెళ్లిపోయాయి. దయ్యములు వెడలిన మనుష్యుడు ఇంటికి వెళ్లి తనకెట్టి గొప్ప కార్యములు ప్రభువు చేశాడో ఆ పట్టణమందు తెలియజేశాడు. కుటుంబాలను విడిచి దేశ దిమ్మరులుగా తిరిగేవారిని స్వస్థపరచి కుటుంబాలతో తలిదండ్రులతో భార్యాబిడ్డలతో కలిపే వాడు యేసు ప్రభువు.
కానా అను ఊరిలో యేసు ప్రభువుల వారు ఒక వివాహమునకు వెళ్లారు. ఆ విందులో సిద్ధపరచిన ద్రాక్షరసము అయిపోయింది. అయితే ప్రభువు ఆ ఖాళీ బానలను నీటితో నింపించి నీటిని ద్రాక్షరసముగా మార్చి వివాహములో ఎటువంటి కొదువ లేకుండా చేశాడు. ఆ బానలలో నీటిని నింపిన సేవకులను ఆశ్చర్యపరచెను. బానలలో మామూలు నీటిని నింపిన సంగతి ఆ నింపిన సేవకులకు తప్ప ఎవరికినీ తెలియదు. నీటిని ద్రాక్షరసముగా చేసిన ఆశ్చర్యకరుడు. నీటిని రక్తముగా మార్చి ఐగుప్తీయులను అబ్బురపరచిన దేవుడు. బండ నుండి నీటిని తెప్పించాడు. ఎడారిలో నీళ్లు ప్రవహింపజేశాడు. ప్రవహిస్తున్న నీటిని ఆపి యోర్దాను నదిని దాటించాడు. సముద్రమును పాయలుగా చేసి ఎండిన నేలన ఇశ్రాయేలీయులను నడిపించాడు. భీకర తుఫానును మాటతో ఆపినాడు.
పనె్నండేళ్ల నుండి రక్తస్రావము గల స్ర్తి అనేక మంది వైద్యులను కలిసి తన ఆస్థి అంతా ఖర్చు చేసినా నయము కాలేదు కాని యేసు వస్తప్రు చెంగును ముట్టిన వెంటనే స్వస్థత పొందినది. ఎండిన జీవితాలను చిగురింప జేసిన ఆశ్చర్యకరుడు యేసు ప్రభువు. యాజకుడైన జకర్యా తన భార్య అయిన ఎలీసబెతు బహుకాలము గడచిన వృద్ధులు. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేరు. అటువంటి స్థితిలో అంత ముసలి వయస్సులో వారి ప్రార్థనకు జవాబుగా కుమారుని అనుగ్రహించాడు. నూరేళ్ల వయసులో అబ్రహామునకు సంతానమిచ్చిన ఆశ్చర్యకరుడు. అంతేకాదు కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించటం కూడా అద్భుతమే.
మాటతో సృష్టిని చేసిన అద్భుతకరుడు. శూన్యములో భూమిని వ్రేలాడదీయుట అద్భుం. మేఘములలో నీటిని బంధించుట అద్భుతం. గాలిని కంట్రోల్ చేయుట అద్భుతమే. ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదువేల మందికి ఆహారముగా పంచిన అద్భుతము చేసిన ప్రభువు.
మన జీవితాలలో కూడా అద్భుతాలు చేసే దేవుడు. ఆపదల నుండి, శోధనల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి చెడు అలవాట్ల నుండి - బానిసత్వము నుండి, అప్పుల నుండి, తప్పుల నుండి, వ్యాధుల నుండి అది దీర్ఘకాలిక వ్యాధులైనా కుదురనివైనా అద్భుతంగా మానే్ప దేవుడు. ఈ వ్యక్తి మారడు, వీడి గతి ఇంతే అని లోకం అనుకున్నా విశ్వాసముతో ప్రార్థిస్తే గొప్ప మార్పును చూడగలం. కొండలను చదును చేసేవాడు పల్లములను పూడ్చేవాడు, త్రాగుబోతులను జూదగాళ్లను వ్యభిచారులను, గజదొంగలను అబద్ధీకులను మోసగాళ్లను చివరకు నరమాంస భక్షకులను మార్చి గొప్ప సాక్షులుగా నిలువబెట్టుకున్న అద్భుతకారుడు.
ప్రభువు మనలను పుట్టించిన విధము ఒక అద్భుతము. తల్లి గర్భమందు రెండు సూక్ష్మ కణములు కలిసి పిండముగా మారి రూపుదిద్దుకొని అన్ని అవయవాలతో జన్మించటం, ఎముకలు ఎలా నిర్మించబడినవో మన రంగు రూపు ఎలా కలిగినవో అన్నీ ఎరిగిన దేవుడు వాస్తవానికి గర్భములో బిడ్డను మోస్తున్న తల్లికి ఏ మార్పు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు.
చివరకు తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అర్పించి మరణించి తిరిగి లేచిన అద్భుతకరుడు. ఈ అద్భుతకారుని జననమే క్రిస్మస్. ఆయనను హృదయములో చేర్చుకోవటమే అసలు క్రిస్మస్. ఏ వయసులో వారైనా స్ర్తిలైనా పురుషులైనా ఏ జాతివాడైనా ఏ దేశస్థుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా ప్రభువును ఆహ్వానించవచ్చు. ఆయన వచ్చిందే మన కోసం. ఈ సంగతిని తెలుసుకొని ఆశ్చర్యకరుడైన యేసును రక్షకుడని నమ్మి హృదయములో చేర్చుకొని సంతోష సమాధానంతో ఈ క్రిస్మస్ దినాల్లో లోకమంతా సంబరాలతో ఉండాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256