పఠనీయం

భావ - భాషా సముదాత్త సమతౌల్య సుందరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీపద చిత్ర రామాయణము (పద్యకావ్యము) - కిష్కింధాకాండము, సుందర కాండము, యుద్ధకాండము- కవి:విహారి, వెల:రూ.600/-, ప్రతులకు:జె.ఎస్.మూర్తి, 16-11-310/12/ఎ/1/1, గణపతి టెంపుల్ స్ట్రీట్,
మలక్‌పేట, హైదరాబాద్-500 036.
*
‘మఱలనిదేల రామాయణం బన్నచో’ ఎవరి అనుభూతి వారిది; నా భక్తి రచనలు నావిగాన’ అన్నారు తన రచనా క్రియకు ప్రధాన కారణం చెబుతూ విశ్వనాథవారు. తన రామాయణ కల్పవృక్ష కావ్య ‘అవతారిక’లో వాఙ్మయ ప్రపంచంలో కనిపించే వందలకొలది రామాయణ కృత్తి కర్తలతో దాదాపు అందరి అమూల్య అభిరుచి, అభిప్రాయ, ఉద్దేశాలు ఇవే- చాలామంది ఆ మాట స్పష్టంగాను, విడిగాను చెప్పకపోయినా.
అదే ఉదాత్త ధ్యాస, ఆస, తపనలతో ప్రసిద్ధ ప్రౌఢ కవి, వివిధ సాహిత్య ప్రక్రియా మార్గ విఖ్యాత రచయిత శ్రీ విహారి ‘శ్రీపద చిత్ర రామాయణం’ అనే గ్రంథ నామంతో బాలకాండం నుండి యుద్ధకాండం వరకు బృహద్రామాయణ కావ్యాన్ని మహోదాత్త కావ్య శిల్ప కమనీయతాశ్రీగా తీర్చిదిద్దారు. అందులోని కిష్కింధాకాండము, సుందరకాండము, యుద్ధకాండము కలిపి ఒకే పుస్తకంగా ఇటీవల ప్రచురితం అయింది. రసమూ, ధ్వని, వక్రోక్తి, రీతి, అలంకారము, ఔచిత్యము, చమత్కారము (రమ్యోక్తి) అనే ఏడు రకాల కావ్యాత్మలూ ఈ విహారి కృతిలో సారతర సారస్వత వీర విహారం చేశాయి ఆయా సందర్భాలలో.
పంపాతీర వర్ణన- ‘రమ్య వాసంతమునకు వర్ణనములేల? / పొంగుననుభూతి మాటల బొదుగదరమె? / పారవశ్యము కైజారు వంటిదగునె?/ దూసి చూపనయిన నారదోపనైన’- ఇదీ పద్యం. ఇది పద్యం. కిష్కింధాకాండం 5వ పద్యం.
ఇందులో వ్యతిరేకాలంకారం గమనీయం. పోలికతోపాటు భేదం కూడా చూపటం ఈ అలంకార చమత్కారం. అనుభూతి పారవశ్యం మనస్సులో ప్రవేశిస్తుంది. కత్తి తనువులో ప్రవేశిస్తుంది. ప్రవేశించటం అనేది సమాన ధర్మం అనే పోలిక. కానీ అనుభూతి అనేది దూయదు, మనసును కోయదు, లోపల ఇమడదు. కత్తిమాత్రం ఒంట్లోకి దిగుతుంది కర్కశంగా, ఒరలో ఒదిగిపోనూ పోతుంది. ఇది భేదం. ఇదీ ఈ అలంకారపు సోయగం.
త్రిజట, ఇతర రాక్షస స్ర్తిలు వెళ్లిపోయాక సీతమ్మ తల్లి ఎంతో నిస్పృహకు లోనవుతుంది. పరిపరి విధాల పరితపించి చివరకు ఆత్మహత్యకు నిర్ణయించుకుంటుంది. ‘్భవము రామనామమయ భావన’ అనే వాక్య నిర్మాణం బహు విలక్షణంగా వున్నది. ‘్భవము’ అంటూ ప్రథమావిభక్తి పదానే్న వేశారు. కానీ ఇక్కడ భావమునకు రీతి, విధము ఉన్నది, ఉండటం, స్వాభావికగుణం, ప్రకృతి, ఉద్దేశం, ఆలోచన, ఇష్టమైన అనే అర్థాలు తీసుకోవాలి. ఇదొక విశేషమైన అర్థస్ఫోరక వాక్య రచనావిధానం.ఇక ‘నా బ్రతుకు ఒక పుల్లడి చందము’ అంటోంది. నిస్సార భూమి అని అర్థం. తన తల్లేమో సకల జన సంస్థితికి సారాధారమైన భూదేవి. తానేమో నిర్జన స్థానమైన, ఒక నిస్సారమైన నేల (లాంటిది). ఇక్కడ దుర్భర దైన్యస్థితి వర్ణనలోగూడా ఇలా‘విషమాలంకార’ పోషణ, పోహణలను మరచిపోలేదు, విడిచిపెట్టలేదు ఈ అలంకారిక కవి కావ్యాత్మ తెలిసినవాడు కనుక.
‘చనిపోవటానికి నా వద్ద గరళమూ లేదు, కఱకు కత్తీ లేదు. అయితే ఒక ‘పాశం’న్నది అనుకుంటంది సీత- తన జడనే ఆ పాశంగా - ఉరిగా- చేసుకోవచ్చు అనుకుంటూ. తనకూ రామునకూ మధ్య వున్న ప్రేమపాశం (తాడు) తనను రాముని వద్దకు ఆత్మపరంగా, ‘అధ్యాత్మ’పరంగా లాగేస్తుంది. తాను చనిపోయినా భౌతికంగా అని ఆ అమ్మ పాతివ్రత్య విశ్వాసం. ఇదీ ఇక్కడి భావధ్వని సౌందర్యం- చింతలోంచే అనంత మనశ్శాంతి పొందే ప్రయత్నం, ఆరాటం, ప్రాణేశ్వరార్థ తపన. ఇదొక ఉదాత్త్భావ నిక్షేప కవితా సౌందర్యం. ఇక్కడ ‘పాశము’ అనే పద ప్రయోగం చాలా సాంకేతిక ప్రయోజన సమన్వితారమ్యం.
యుద్ధకాండంలో మేఘనాథ మృతి ఫలిత చింతాక్రాంతతా వర్ణన యొక్క ప్రారంభంలోని మొదటి రెండు పద్యాలలో ‘క్షపాచర నాథుడు రావణుడు’ అనే వాక్యం సమర్థమైన అర్థగౌరవంతో యుక్తియుక్తంగా ఉంది. రావణుడు రాత్రించర ప్రభువు అని అర్థం. ‘క్షపయతి సర్వ చేష్టా- ఇది క్షపా’. సర్వకార్యక్రమాలను క్షయింప (నశింప) జేయునది అని ‘రాత్రి’కి అర్థం. దేవతా క్రతువులను, దేవతల లోక కల్యాణతలను నష్టపరిచేవాళ్లు. మరి అలాంటి పనులను రాత్రి వేళలలోనే చరిస్తూ, చేస్తూ ‘క్షపా’ అనే శబ్దానికి సార్థక సమన్వయార్థం కలిగిస్తూంటారు. అలాంటివాళ్లకు నాయకుడు రావణుడు. ఇది ఇలా ఇక్కడ శబ్ద వ్యుత్పత్త్యినుకూల పద నిర్మాణ శిల్పం. పద్యంలో మటమటలాడు అనే శబ్దం కృష్ణా-గుంటూరు జిల్లాల మాండలికం. మనిషి అసహనాన్ని తెలియజేస్తుంది. కటకట, పటపట, మటమట, విటవిట అనే శబ్దాలు ఆ సమయంలో రావణుని భావ ప్రకటనాస్థితికి, విసుగు కోపాలకు అద్దంపడుతున్నాయి. విటవిట అంటే నిప్పులమీద ఉప్పు కాలే ధ్వని.
‘అటు జను నిటు జను దికమక / నటునిటు గను విమనుడు గడు నలయు వలిగొనున్ / కటువిది - విసమిడి వెడలితె?/ యెటు లిది కుతుక దిగున్! కత యెటు నడచునురా?!’- ఈ పద్యం అప్పటి అసుర రాజు యొక్క అనిశ్చిత స్థితిని అద్భుత, సముచిత శబ్ద విన్యాసంతో చూపించింది. ‘‘పుత్రా మేఘనాథా! నీవు నీ మృతితో నాకు ఇంత విషమిచ్చి వెళ్లిపోయావా? ఎటులిది కుతుక దిగును’’ అని వాపోతున్నాడు రావణుడు. ఇక్కడ ఇట్టి రావణ స్థితిని బట్టి ‘విమనుడు’ అని ప్రయోగించాడు కవి. విమనుడు అంటే అంతర్మథనుడు. అంటే ఆ స్థితిలో ఏమీ చేయాలా అంటూ అంతులేనంత మథనపడిపోతున్నాడు అని భావం. పద్యంలోని లఘువులు పద్యాన్ని ధారాళంగా ముందుకు సాగనీక వెనుకకు లాగటంతో ఆతని మానసికపు గుంజులాట వ్యక్తీకృతం అవుతోంది. ఇదొక ఛందశ్శిల్పం. ఛందోవైశిష్ట్యానికి వస్తే ఈ కావ్యంలో ప్రఖ్యాత జాతి, ఉపజాతి వృత్తాలతోపాటుగా ఆంధ్ర పద్మ వాఙ్మయంలో అపురూపంగా కనిపించే ‘ప్రభాకలిత’, ‘వన మంజరి’, ‘హలముఖి’, ‘కాంతి’, ‘్భతిలకం’, ‘శాలిని’, ‘జలదం’, ‘శే్యని’ వంటి పద్య రూపాలెన్నో ఎన్నుకోవటం ఒక ఛందపుటందం.్భషాపరంగా ప్రౌఢ సంస్కృత సంక్షీర్ణత బిగువు, అచ్చతెలుగు పలుకుల మురువు కలబోసి, భావప్రధానతాపరంగా రసప్రవాహంలో ఓలలాడించే కమ్మని రమణీయ కావ్యం పసందైన ఈ పద చిత్ర రామాయణం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం