ప్రార్థన

ఆలోచన కర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యేసు ప్రభువు ఆశ్చర్యకరుడే కాదు ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చే ఆలోచనకర్త. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడను గ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతియని అతనికి పేరు పెట్టబడెను’ - యెషయా 9:6
ఈ లోకములో మనము ఎలా ఉండాలో ఏమి చేయాలో ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఉండాలో ఏమి చూడాలో ఏమి చూడకూడదో పిల్లలను ఎలా జాగ్రత్తగా పెంచాలో ఎలా కాపాడాలో ఎటువంటి సలహాలు ఇవ్వాలో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ఆర్థిక విషయాల్లో ఏమి చేయాలో ఎలా చేయాలో వివాహ విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో పనులలో ఎలా ఉండాలో దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలా కాపాడుకో వాడాలో కుటుంబం పట్ల బాధ్యత సంఘం పట్ల సమాజం పట్ల ఎటువంటి బాధ్యత వహించాలో మన జననము నుండి మరణము వరకు అన్ని విషయాలలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చే దేవుడు మన దేవుడు. పెద్దలను తోటివారిని ఎలా గౌరవించాలో తేటగా తెలియజేశాడు.
బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు యేసు ప్రభువు నందే గుప్తమై యున్నవి. మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నా ఎంత చిక్కుల్లో ఉన్నా ఎంత గడ్డు సమస్య అయినా ఏమి చేయాలో ఎలా చేయాలో ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితులలో అనారోగ్య పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు పిల్లల తొందర ఆఫీసు వత్తిడి తోటివారితో ఇబ్బందులు లాంటి అన్ని విషయాలలో కూడా సరియైన ఆలోచన ఇచ్చే దేవుడు. విశ్వాసముతో ఆయన సలహా కోరితే చక్కని ఆలోచన ఇచ్చి మనలను నడిపించే ప్రభువు.
ఈ లోక జ్ఞానము ఎంత ఉన్నా ప్రభువు జ్ఞానము ఆలోచన లేకపోతే ఉపయోగం ఉండదు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి యున్నాడు. ప్రభువు బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. జ్ఞాన కార్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ప్రభువే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును.
ప్రతి విషయములో ముందు ప్రార్థన ద్వారా ప్రభువు సలహాను తీసుకోవాలి. అది ఎటువంటి పనియైనా చిన్న విషయమైనా పెద్దవైనా సరియైన సలహా ఇచ్చే దేవుడు. సర్వజ్ఞానియైన దేవుని ఆలోచన మనకు ఎంతో ఉపయోగపడుతోంది. జరుగబోయే విషయాలు తెలిసిన దేవుడు గనుక సరియైన సలహా దొరుకుతుంది. మనకైతే ఇప్పటి సంగతులే తెలుసు గాని ప్రభువుకు జరుగబోయే విషయాలు కూడా తెలుసు. మన ఆలోచనల కంటె ప్రభువు ఆలోచనలు భూమి కంటె ఆకాశము ఎంత ఉన్నతమో అంత ఎత్తుగా ఉన్నవి.
ప్రభువు మన గురించి ఆలోచించుచున్నాడు గనుక మన గురించి ప్రభువుకు కలిగిన ఉద్దేశాలు ఎంతో సమాధానము కలుగజేసేవి. నిరీక్షణ కలుగజేసేటువంటివి. యేసు ప్రభువు పేతురును అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ప్రభువు వారిని పిలిచి నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేయుదును అని చెప్పగా వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించిరి. అయితే ప్రభువు ఆలోచన మేరకు వారు వెంటనే వెంబడించటం ఎంతో ఆశీర్వాదము. ఒక్కొక్కసారి ప్రభువు మనలను కూడా పిలిచినప్పుడు చాలా ఆలోచిస్తాం. ఎవరెవరి సలహాలో అడుగుతాం. ఎంతో సమయాన్ని తీసుకొంటాం. ఎంతో అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకొని చివరకు వస్తాము. కాని దేవుని సలహాను వెంటనే అంగీకరించటం ఆశీర్వాదము. మంచి ఉద్యోగం వదిలి సేవకు రమ్మంటే ప్రభువు సలహాకన్నా ఉద్యోగమే ఎక్కువగా భావించి, పదవీ విరమణ తరువాత వెళ్లవచ్చునులే అనుకుంటారు. అప్పటికే అమూల్యమైన సమయము దాటిపోతుంది. ప్రభువును వెంబడించటం ద్వారా చేపలు పట్టి వాటిని చంపే జాలరులు ఆత్మీయంగా చనిపోయిన మనుషులను పట్టి బ్రతికించేవారయ్యారు. ప్రభువు సలహాను పాటిస్తే మనకు ఆశీర్వాదము మన ద్వారా అనేకులు బ్రతికించబడతారు.
ప్రభువు ఇచ్చిన సలహాను మిగుల ఆస్తిగల యవ్వనుడు పాటించలేక పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టు చూస్తున్నాం. నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పిన సలహాను నిర్లక్ష్యపెట్టి సర్వాధికారిని, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది.
అబ్రహామును యెహోవా దేవుడు పిలిచి - నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించిన వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పినప్పుడు అబ్రహాము ప్రభువు చెప్పినట్టు చేసి అద్భుతంగా ఆశీర్వదించబడ్డాడు. సమస్తమైన వంశములు ఆయనలో ఆశీర్వదింపబడ్డాయి. ప్రభువు సలహాను పాటిస్తే నీవు నేను కూడా అద్భుత రీతిగా ఆశీర్వదింపబడతాము. అంతేకాదు అనేకులకు ఆశీర్వాదముగా ఉంటాము.
ప్రభువు ఆలోచనలు విని వాటి ప్రకారము చేయువారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును. వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ప్రభువు ఇచ్చే సలహాలు బండ వంటి పునాది వంటిది. జీవితాలను కట్టుటకు ప్రభువు ఆలోచనలను పాటిస్తే ఎంతో నెమ్మదిగా ఉంటుంది. సాత్వికము కలిగి ఉండమన్నాడు. కనికరము హృదయ శుద్ధి కలిగి సమాధానముగా ఉంటూ సత్క్రియలు చేసుకుంటూ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండి నీతి న్యాయము కలిగి సత్యముగా ఉంటూ కోపము మాని మోహపు చూపుతో చూడవద్దు. మీ మాటలు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. శత్రువులను ప్రేమించమని హింసించువారి కొరకు ప్రార్థన చేయుమని, పరిశుద్ధంగా ఉండమని, ధర్మము చేయునప్పుడు ఎవరికీ తెలియకూడదు అది. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనము చేయుచు తోటి వారిని క్షమిస్తూ ధనాశ లేకుండా తీర్పు తీర్చకుండా సహోదరులతో ఐక్యత కలిగి ఉంటూ, దేవునికి అంటుకట్టబడి మంచి ఫలములు ఫలిస్తూ ఎవరినీ హింసించక ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపమని అనేకమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయన మాటలు పాటించిన వారు అనేకమైన మేలులు పొందుకున్నారు. ఆయన రాజ్యాన్ని పొందుకున్నారు.
సీమోను పేతురు చేపలు పట్టుటకు వెళ్లి రాత్రంతా శ్రమ పడినా ఏమీ దొరకలేదు కాని ప్రభువు వారికిచ్చిన చిన్న సలహా మేరకు కుడిప్రక్కన వల వేసి విస్తారమైన చేపలు పడినందున వలను ఒడ్డుకు లాగలేక పోయారు. ప్రభువు సలహా మనకు సమృద్ధిని క్షేమాన్ని కలుగజేస్తుంది. ప్రభువు సృష్టికర్త గనుక ఎక్కడ ఏముందో ఎలా ఉందో సమస్తము ఎరిగినటువంటి వాడు సరియైన ఆలోచన సరియన సమయములో ఇస్తాడు.
ఈ దినాలలో తల్లిదండ్రుల సలహాలే లెక్కచేయటం లేదు. అధికారులను లెక్కచేయటం లేదు. అంతా మాకే తెలుసు అనుకొని సొంత నిర్ణయాలు తీసికొని వివాహ విషయములలో అనేకమైన శోధనలకు గురవుతున్నారు. దేవుని ఆలోచన ప్రకారము చేసినట్లయితే ఆ కాపురం బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటుంది. స్ర్తిలు తమ సొంత పురుషులకు లోబడి ఉండాలని ప్రభువు సలహా. కాని సొంత పురుషులను అస్సలు లెక్కచేయడం లేదు. మీ భార్యలను ప్రేమించమంటే, ఇక భర్తల సంగతి తెలిసిందే. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఉన్నారు. ఇలా ప్రభువిచ్చిన చిన్నచిన్న సలహాలు పాటించకుండా ఎన్నో కుటుంబాలు గలిబిలిగా ఉన్నాయి. ఎన్నో శోధనలు బాధలు ఎదుర్కొంటున్నారు. ప్రభువు ఆలోచనలు పాటించక పోతే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి యుండును. కనుక గాలివానలు వరదలు లాంటి శోధనలు ఇబ్బందులు బాధలు ఎదురైనప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది. దాని పాటు గొప్పదని ప్రభువు సెలవిస్తున్నాడు.
బైబిల్‌లో ప్రభువిచ్చిన ఆలోచనలు, సలహాలు, సూచనలు పాటించి బండపైన కట్టబడిన ఇంటి వలె బుద్ధిమంతుల వలె ఉంటూ ఇప్పటినుండైనా సంతోష సమాధానాలు ఆనందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయము చేసి క్రిస్మస్ బహుమానముగా అనుగ్రహించునుగాక.

-మద్దు పీటర్ 9490651256