ప్రార్థన

విజయము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి.’ -ఎఫెసి 6:10
మహాశక్తి గల ప్రభువే మన బలము. క్రీస్తే మన బలము. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుత్థాన శక్తియే మనకు బలము. క్రీస్తు బలము మనలో ఉంటేనే గర్జించు సింహము లాంటి సాతానును ఎదిరించగలము. మరణపు ముల్లు పాపము. పాపమును సిలువకు కొట్టివేసి మరణపు ముల్లు నుండి విడుదల ఇచ్చిన బలవంతుడైన క్రీస్తుకు జై. క్రీస్తును కలిగి జీవించటమే మన విజయము. ఆయన విజయమే మన విజయము. ఇకను జీవించునది నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్న పౌలు మాటలు మనము కూడా చెప్పాలి. క్రీస్తు మనలో జీవించి ఉంటే విజయము మనతో ఉన్నట్టే. ఎప్పుడైతే లోకము వైపు తిరిగి లోకాశలకు లోనౌతామో అపజయమే. క్రీస్తు వాక్యము మనలో ఉన్నంతసేపు ఆయన మాటల ప్రకారము నడిచినంతసేపు మనము విజయులమే.
మన విజయాన్ని మోసపు మాటలతో సాతానుడు దొంగిలిస్తాడు. అపవాదితో మనకు ముచ్చట్లు వద్దేవద్దు. మన మీద అపవాదులు చెప్పే అపవాది సహవాసము మనకెందుకు? ఏదో ఒక పాపము చేయించి మనకు ప్రభువు ఇచ్చిన విజయాన్ని తోసివేయడానికి తద్వారా దేవునికి దూరము చేయటానికి సాతానుడు ఇచ్చే రాయితీలు అన్నిఇన్ని కాదు. జాగ్రత్త!
అందుకే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ఎప్పుడూ ధరించే ఉండాలి. ఏలయనగా మనము పోరాడవలసినది శరీరులతో కాదు. శత్రువుతో పోరాడాలి. నీ శక్తి యుక్తి అంతా శత్రువుపైన చూపాలి. సాతాను మొట్టమొదటి తంత్రము -మోసము. మనకూ మనకూ మధ్య గొడవలు పెట్టుట. దేవుని బిడ్డలు ఎక్కువమంది ఈ విషయములో మోసపోతున్నారు. తోటివారితో గొడవలు, కొట్లాటలు, ఇంటివారితో, ఇరుగు పొరుగు వారితో గొడవలు, కోర్టు కేసులు. ఇక జీవితమంతా ఈ పోరాటంతోనే తెల్లవారుతుంది.
వాడు అబద్ధాలకు జనకుడు గనుక ఏదో ఒక అబద్ధముతో చిక్కులు పెడతాడు. బలహీనపరుస్తాడు. తికమకపెడతాడు. నిరుత్సాహ పరుస్తాడు. వాడు ఒక మంచి స్నేహితుడిలా వ్యవహరించి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి ఆదిలో హవ్వను మోసము చేసినట్లు ఇప్పుడు అనేకులను దేవునికి అవిధేయులుగా చేస్తున్నాడు. మన ప్రధాన శత్రువై యుండి మనలను మోసపరచి దేవునికి విరోధిగా చేసి, వాడి పనులకు వాడుకుంటాడు. అపవాది తంత్రము ఎలా ఉంటుందంటే దేవుని పనే చేయిస్తాడు గాని వాడు చెప్పినట్లు చేయమంటాడు. ఈ విషయం దయచేసి అర్థము చేసుకోవాలి. దేవుని పని దేవుడు చెప్పినట్లు చేయాలి. మన ఇష్టమొచ్చినట్లు కాదు. నాకు పాటలు వచ్చు పాడుతాను. నాట్యం వచ్చు చేస్తాను. మాటలు వచ్చు ప్రసంగిస్తాను. ఆ మిషన్ (ౄజఒఒజ్యశ) లో పనిచేస్తా ఈ మిషన్‌లో పనిచేస్తా కాదు. ముందు దేవునికి ఒఖఇౄజఒఒజ్యశ గా ఉండటం నేర్చుకోవాలి. ప్రభువు ఏ పని చేస్తే ఆ పనే చేయాలి. కానీ నీ యిష్టమొచ్చిన పని చేస్తే అది ప్రభువు మెచ్చడు సుమా.
ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? లక్షలు లక్షలు చందాలివ్వలేదా? మంచి మంచి ఆలయాలు కట్టించలేదా? దానధర్మాలు చేయలేదా? వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు కట్టించలేదా? ఇంకా ఏవేవో చేయలేదా అని అందురు. అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదుననెను. ఇవన్ని వారు చేయలేదని కాదు, చేశారు కానీ క్రమంగా కాదు అక్రమంగా చేశారు. అనాదికాల సంకల్పములో దేవునికి ఒక క్రమము ఉంది. అలానే చేయాలి. కానీ మన ఇష్టమొచ్చినట్లు చేస్తే ఆయన గుర్తించడు. ఈ లోకములో మనుషుల గుర్తింపు కాదు, మనుషుల మెప్పుకోలు కాదు మనకు కావలసింది. దేవునికి మహిమ రావాలి. దేవుని గుర్తింపు ఉండాలి. అంటే ఆయన మాటల ప్రకారము ఆయన ఇష్టంగానే మనము సేవ చేయాలి. అప్పుడే మనకు ఆశీర్వాదము ప్రభువుకు మహిమ.
పాప భాగములను ఎంతో ముఖ్యమైనవిగా అవి లేకపోతే బ్రతుకెందుకు అన్నట్లుగా చూయించుట ద్వారా అనేక మంది త్యీజూక ఔళ్ఘఒఖూళఒ కోసం ఎక్కువ తపన పడుతున్నారు. అసలు సంగతి -క్షణికమైన ఈ భోగాల కోసం పాపాలు చేసి నిత్య జీవము కోల్పోతున్నారు. పెట్టుబడులకు పురికొల్పి దానివల్ల వచ్చే లాభాలే పెద్దగా చేసి చూపిస్తాడు. నష్టాలు ఎంత పెద్దగా ఉన్నా వాటిని చిన్నగా చూపిస్తాడు.
దేవుని కృపను బట్టి మనమంతా యేసయ్య బిడ్డలము. అందుకే ఆయన లోకమంతటిని ప్రేమించాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ స్థితి ఏదైనా, ఎంత పాపివైనా ఎంత బలహీనుడవైనా ఎటువంటి పరిస్థితులైనా సరే చాలిన దేవుడు. మన స్థితిని సరిచేసే దేవుడు. మన పాపాలను తుడిచివేసి మనలను బలపరచగలడు. జ్ఞానమిస్తాడు. ఒంటరివైతే తోడుంటాడు. ధైర్యాన్నిచ్చి కాపాడుతాడు. లోకం నిన్ను వెలివేసి ఉండవచ్చు. పట్టించుకోకపోవచ్చు. బాధ పెడుతుండవచ్చు. కాని ప్రభువు తోడుగా ఉంటాడు. భద్ర పరుస్తాడు. అయితే సాతాను మోసపు మాటలు చెప్పి తండ్రికి వ్యతిరేకంగా అవిధేయులుగా చేస్తాడు. పాపిని గనుక దేవుడు పట్టించుకోవటం లేదంటాడు. అది పచ్చి మోసం. దేవుడు ఎంత పాపినైనా ఎటువంటి పాపినైనా ప్రేమిస్తాడు. నీవు ఏ రాష్టమ్రు వాడివైనా ఏ దేశము వాడివైనా ఏ ఖండమైనా సరే దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు మన చేయి ఎన్నడు విడువడు. దినమెల్ల నీ రాక కొరకు ఎదురుచూస్తూనే ఉంటాడు.
మనలను పడగొట్టటానికి సాతాను ఇంకా ఎన్నో వ్యూహాలు పన్నుతూనే ఉంటాడు. అనవసరమైన విషయాలలో బిజీగా ఉంచుతాడు. బిజీ అంటే కొన్నిసార్లు ఱళజశ ఖశజూళూ ఒ్ఘఆఖూశ క్యరీ కావఛ్చు. లేనిపోని పనులు కల్పించి బిజీగా ఉంచుతాడు. ఉన్నదాని కంటె ఎక్కువ ఖర్చు పెట్టించి అప్పుల పాలు చేస్తాడు. ఈ అప్పులో చాలామంది ఉండవచ్చు. జాగ్రత్త. ఉన్నదానితో తృప్తిగా ఉండటం ఆశీర్వాదము. లేకుంటే అప్పులు వాటిని తీర్చటానికి మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడలేని వారెందరో. ఎక్కువ సమయం పనిలో నిమగ్నం చేసి కుటుంబంతో సంతోషంగా ఉండనివ్వడు. తల్లిదండ్రులు భార్యాబిడ్డలు రక్త సంబంధులు కలిసి సంతోషంగా నవ్వుకొని ఎన్నాళ్లయిందో కదా. టీవీలు కంప్యూటర్లతో ప్రేరేపించి దేవుని మాటల మీద ధ్యాస లేకుండా చేస్తాడు. కాఫీ టేబుల్ మీద ఏవేవో పుస్తకాలు నింపి బైబిల్ చదవకుండా చేస్తాడు. త్వరగా గొప్పవారవటానికి స్కీమ్స్ చూపించి వాటి వెంట పడేటట్లు చేస్తాడు. అందమైన మోడల్స్ ఫొటోలు చూపించి బాహ్య సౌందర్యం వైపు చూపు మళ్లిస్తాడు. జాగ్రత్త. అందం మోసకరము సౌందర్యం వ్యర్థము. వాటి వెనుక పడొద్దని బైబిల్ చెప్తోంది. భార్యాభర్తలు కలుసుకొనే సమయం లేనంత పనులు కల్పించి ఇతరుల ఆకర్షణలో పడేటట్లు చేస్తాడు. మంచి మంచి పనులు చేయిస్తూ దేవుని సన్నిధిని, వాక్య ధ్యానాన్ని ప్రార్థనా సమయాన్ని లేకుండా చేసి చివరకు దేవునికి దూరపరుస్తాడు. ఈ విషయములో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మంచి పనులలో తలమునకలై దేవునికి దూరం అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయము -్యష్ఘఒఆజశ్ఘఆజ్యశ. ఇది చాలా చాలా మోసకరమైంది. దేవుని పనిని చేయవద్దని సాతాను చెప్పడుగాని, రేపు చేయవచ్చులే, వచ్చే వారం నుండి చేద్దాం. వచ్చే నెల నుండి చేద్దాం. లేక రిటైర్మెంట్ తర్వాత చేద్దాములే అన్నట్టు వాయిదా వేయిస్తాడు. మరణానికి వాయిదా లేదు. జాగ్రత్త.
పైన విషయాన్ని చూస్తుంటే సాతాను ఎంత మోసగాడంటే అసలు యుద్ధానికి రానివ్వకుండా మోసాలతో బైటబైటనే ఉంచుతోంది. సర్వాంగ కవచము ధరించుకొని సాతాను మోసంలో పడి ఎక్కడో ఒకచోట కూర్చుంటే ఉపయోగము లేదు. నిలువబడాలి. వాక్య ఖడ్గమును చేతబట్టుకోవాలి. శత్రువుతో యుద్ధం చేయాలి. సొంత వారితో కాదని జ్ఞాపకము చేసుకోవాలి. ఆత్మఖడ్గము ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సైనికుడు మెలకువగా లేకపోతే శత్రువు మీద పడి చంపేస్తాడు. ప్రార్థనలేని జీవితము ఓడిపోయిన జీవితమే.
యేసుక్రీస్తు ప్రాణమిచ్చి తెచ్చిన గెలుపును చులకనగా పోగొట్టుకొనకూడదు. క్రీస్తునందున్న వారందరు విజయులే. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనము నందు కూర్చుండి యున్న ప్రకారము జయించు వానిని నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండనిత్తును. -ప్రకటన 3:21.
ఆకాశమంత సింహాసనములో నీకూ నాకూ మనందరికీ చోటు ఉంది. ప్రభువు జయించి ఇచ్చిన విజయాన్ని పట్టుకొని ఉందాము. ఓడిపోయిన సాతానును ఎదిరిద్దాం.
అపవాదిని (సాతానుని) ఎదిరించి దేవునికి లోబడి విజయపథములో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256