విశాఖపట్నం

తెలుగుదేశం పార్టీవి నీచ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాల్‌మనీ చర్చను పక్కదారి పట్టించే ఎత్తుగడ
* అంబేద్కర్ పేరునూ వాడుకుంటున్నారు
* వైకాపా నిరసన ప్రదర్శన
విశాఖపట్నం, డిసెంబర్ 18: కాల్‌మనీపై అంసెంబ్లీలో చర్చను తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. కాల్‌మనీపై చర్చకు వైకాపా డిమాండ్ చేస్తే రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ జయంతి ప్రస్తావన తీసుకురావడం ద్వారా తన కుటిల రాజకీయానికి తెరతీసిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తీరుకు నిరసనగా వైకాపా ఆధ్వర్యంలో ఎల్‌ఐసి భవనం అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ప్రభుత్వ అప్రజాస్వామిక, అవినీతి వ్యవహారాలను నిరసించాలన్నారు. అప్పుల పేరిట సామాన్య ప్రజానీకాన్ని సెక్స్ రాకెట్‌లోకి దించుతున్న ముఠాపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. విజయవాడ కాల్‌మనీ మాఫియా అంశం వెలుగుచూడటంతో నివ్వెరపోయిన తెలుగుదేశం ప్రభుత్వం తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునే కుట్రకు తెరతీసిందన్నారు. ఈ కుంభకోణం, సెక్స్ రాకెట్‌లో పాలకపక్ష పెద్దల హస్తం ఉందని, వారి పేర్లు బయటకు వస్తే ప్రభుత్వం పరువుపోతుందని భావించిన చంద్రబాబు అసెంబ్లీలో అసలు చర్చే జరగకుండా చూసేలా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కుంభకోణంలో నిందితులకు శిక్ష పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మామను వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కుట్రలు కొత్తకాదని విమర్శించారు. చంద్రబాబు మాయలు, మోసాలకే చికాగో యూనివర్శిటీ ప్రశంసలందించిందేమోనని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఆచర సాధ్యం కాని వాగ్దానాలు చేసి రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులను మోసగించిన చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెప్పే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ వర్గీకరణ పేరిట ఎస్సీల్లో చిచ్చు రేపిన చంద్రబాబు తన తీరు మార్చుకోవాలన్నారు. తన పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు, అక్రమాలు వెలుగులోకి రాకుండా, అసెంబ్లీ వేదికగా చర్చ జరగకుండా చూసుకునేందుకే అంబేద్కర్ జయంతి కార్యక్రమం అంశాన్ని వాడుకున్నారని, దళితులపై చంద్రబాబుకు ఏవిధంగానూ దయ లేదన్నారు. ముందుగా వైకాపా నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైకాపా అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, పార్టీ నాయకులు జాన్ వెస్లీ, కోలా గురువులు, పసుపలేటి ఉషాకిరణ్, బద్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.