తెలంగాణ

నగరంలో పలుచోట్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీటితో నిండిపోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, జీడమెట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మోఘాలు కమ్ముకొని నగరవ్యాప్తంగా వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు స్వల్ప ఇబ్బందులు ఏర్పడ్డాయి. అమీర్‌పేట ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభిస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని ప్రత్యేక మోటర్ల సహాయంతో తోడి పోస్తున్నారు.