కృష్ణ

నేటికీ నీటిలోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తగ్గని వర్షాలు - ఆందోళనలో రైతాంగం
* జిల్లాలో 7.4మి.మిల సరాసరి వర్షపాతం
మచిలీపట్నం, నవంబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన అధిక వర్షాలు డెల్టా రైతులను నట్టేట ముంచాయి. అధిక వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన ఖరీఫ్ పంట కళ్ళ ముందే నీటిపాలవ్వడాన్ని చూసిన రైతులు తట్టుకోలేకపోతున్నారు. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా నీట నానుతున్న పంటను చూడటం తప్పితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. గుర్రపు డెక్క, తూడుతో ఇరిగేషన్ కాలువలు నిండిపోవటంతో పంట పొలాల్లోకి చేరిన వర్షపునీరు బయటకు వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. కాలువలు ఎగదన్నుతుండటంతో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. గత సోమవారం నుండి కురుస్తున్న వర్షాలు నేటికీ తగ్గుముఖం పట్టలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నీట మునిగిన పంట కుళ్ళిపోయే ప్రమాదం లేకపోలేదు. గత నాలుగు రోజులుగా పంట నీట నానడంతో మొలకలు వచ్చాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా పాలు పోసుకునే దశలో ఉన్న వరి పంట నీటనానుతుండటంతో మురిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతుందని కన్నీటిపర్యంతమవుతున్నారు. నీరులేక అల్లాడుతున్న తమను వరుణుడు కరుణించాడనుకున్న తరుణంలో ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట పడిపోయి నీటనానుతుందని ఆవేదన చెందుతున్నారు. మొన్నటి వరకు సాగునీరు అందక మేము పడిన పాట్లు దేవుడికే తెలుసని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.30వేలు వరకు ఖర్చు చేశామని దీనంగా చెబుతున్నారు. పడిపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం జిల్లాలో 7.4 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కృత్తివెన్నులో 40.6 మిమీలు, అత్యల్పంగా విజయవాడ అర్బన్, రూరల్, ముసునూరులలో 2.0 మి.మీల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామలో 4.2, పెనమలూరులో 3.6, తోట్లవల్లూరులో 7.4, కంకిపాడులో 6.6, గన్నవరంలో 3.4, ఉంగుటూరులో 4.2, ఉయ్యూరులో 9.6, పమిడిముక్కల 6.8, మొవ్వలో 14.4, ఘంటసాలలో 9.2, చల్లపల్లిలో 13.4, మోపిదేవిలో 16.4, అవనిగడ్డలో 22.4, నాగాయలంకలో 21.4, కోడూరులో 12.0, మచిలీపట్నంలో 23.2, గూడూరులో 27.6, పామర్రులో 16.6, పెదపారుపూడిలో 5.6, నందివాడలో 2.4, గుడివాడలో 11.4, గుడ్లవల్లేరులో 11.6, పెడనలో 23.2, బంటుమిల్లిలో 22.4, ముదినేపల్లిలో 8.2, మండవల్లిలో 7.2, కైకలూరులో 4.6, కలిదిండిలో 6.4మి.మిల చొప్పున వర్షపాతం నమోదైంది. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, చందర్లపాడు, కంచికచర్ల, వీరుళ్ళపాడు, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, ఎ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, బాపులపాడు మండలాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు.

యుద్ధప్రాతిపదికన వర్షం నీరు తొలగింపు
మచిలీపట్నం , నవంబర్ 20: పట్టణంలో నిలిచిపోయిన వర్షం నీటిని యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పట్టణంలోని పలు కాలనీలు నీటి ముంపులో ఉన్నాయి. ముఖ్యంగా 7వ వార్డు, 9వ వార్డులలోని పరాసుపేట, బ్రహ్మపురం, ఎన్‌జిఓ కాలనీ, పాండురంగ హైస్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ప్రాంతాలలో వర్షం నీరు ఎక్కువగా ఉండటంతో ఆ నీటిని మళ్ళించేందుకు శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ బాబాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రొక్లెయిన్ సహాయంతో డ్రెయిన్‌ను తవ్వించారు. అలాగే డ్రెయిన్‌లో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్కను తొలగించి కాలనీ వాసుల ఇబ్బందులను తొలగించారు.

కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
మచిలీపట్నం , నవంబర్ 20: పెంచిన వేతన సవరణ జివోను అమలు చేయాలని, గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్‌సిహెచ్ శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా పెంచిన వేతన సవరణ జివోను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ నెల నుండి జివోను అమలు చేస్తామన్న ప్రభుత్వం నేటికీ అమలు చేయకపోవడం గర్హనీయమన్నారు. అంతేకాకుండా బడ్జెట్ లేదన్న కారణంగా గత మూడు నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు ఇవ్వడం లేదని, ఫలితంగా ఆయా కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. అంతేకాకుండా గత ఆరు నెలల నుండి అంగన్‌వాడీ కేంద్రం అద్దెలు, పాల బిల్లులు, పప్పు దినుసుల బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు విక్టోరియా, ఎస్ విజయలక్ష్మి, వాణి, జయలక్ష్మి, నాగవాణి తదితరులు పాల్గొన్నారు.