తెలంగాణ

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కోస్తా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.ఆవర్తనం మరింత బలపడి ఈనెల 21నాటికి అల్పపీడనం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో జీడిమెట్ల, బాలానగర్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, తార్నాక, నాచారంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. లిబర్టీ, నాంపల్లి, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌లో వాన కురిసింది. వర్షం కారణంగా హైదరాబాద్‌లో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.