విశాఖపట్నం

భయం వద్దు ధైర్యంగా ఫిర్యాదు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాల్‌మనీ బాధితులకు తెలుగుదేశం భరోసా
* నగరంలో ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు
విశాఖపట్నం, డిసెంబర్ 18: కాల్‌మనీ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సనపల పాండురంగారావు స్పష్టం చేశారు. కాల్‌మనీ అంశంపై బాధితులకు భరోసానిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడిక్కడ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కాల్‌మనీ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నప్పటికీ బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ అంశాలు తెలుగు మహిళలను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందన్నారు. ధన,మాన,ప్రాణాలను హరించే విధంగా వేళ్లూనుకున్న కాల్‌మనీ వ్యవహారం మహిళలకు తీరని వ్యధను మిగిల్చిందన్నారు. కాల్‌మనీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా దాడులు చేస్తున్నారని, బాధితులు ఎవరైనా ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటికే అక్రమ వడ్డీ వ్యాపారస్తుల నుంచి స్వాదీనం చేసుకున్న ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కుల ఆధారంగా బాధితుల బాకీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సనపల సీతారామాంజనేయులు, మూల అప్పారావు, పేడాడ సత్యనారాయణ, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

నేడు ద్రోణంరాజు జయంతి
* హాజరుకానున్న పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి
విశాఖపట్నం, డిసెంబర్ 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు శనివారం నిర్వహించనున్నారు. పాతబస్టాండ్ సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగే జయంతి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి, కెవిపి రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు ఎం పళ్లం రాజు, కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రులు పి బాలరాజు, వట్టి వసంతకుమార్, కొండ్రు మురళి తదితరులు పాల్గొంటారు. అంతకు ముందు సిరిపురం జంక్షన్ వద్దగల ద్రోణంరాజు విగ్రహానికి శనివారం ఉదయం నివాళులర్పిస్తారు.
ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జయంతి వేడుకల ఏర్పాట్లను పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షించారు. అంతకు ముందు నగర కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు కె వెంగళరావు సారధ్యంలో ఎస్సీ విభాగం సమావేశం నిర్వహించారు. సీనియర్ నేత దివంగత ద్రోణంరాజు జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పులుపునిచ్చారు.