రంగారెడ్డి

దివ్యాంగుల ఓటు శాతం పెంచేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 20: దివ్యాంగుల ఓటు శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ర్యాంపులు, వీల్‌చైర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఓటింగ్ కేంద్రం నుంచి దివ్యాంగులను ఇంటి వద్ద దింపేందుకు ప్రత్యేక వాహనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల ఓటు శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అన్ని వౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలో ఆర్ధోపెడిక్ 543మంది, చెవిటి, మూగ 250మంది, అంధులు 308, ఇతరులు 1097మంది ఉన్నట్లు ఎన్నికల అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి.

23 నుంచి శ్రీమైసిగండి మైసమ్మ జాతర
ఆమనగల్లు, నవంబర్ 20: ఉమ్మడి మహబూబ్‌నగర్ రంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ది గాంచిన భక్తులు కోరిన కోరికలు తీర్చె శ్రీమైసిగండి మైసమ్మ అమ్మవారి జాతర ఈ నెల 23 నుంచి 27వ తేది వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహన అధికారి స్నేహలత ఫౌండర్ ట్రస్టీ శీరోళి పంతు నాయక్ తెలిపారు. జాతర కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల ఎర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.25న బోనాలు అర్చనలు విశేష పూ జలు 26న రథోత్సవం, 27న మహాలింగార్చన పుష్పర్చన అలంకరణ అన్నదాన కార్యక్రమంతో జాతర ముగుస్తుందని వివరించారు.
బీజేపీ ప్రచారం
ఆమనగల్లు, నవంబర్ 20: పేదింటి బిడ్డను ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాడిని ఒసారి అవకాశం ఇవ్వండి కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ అభ్యర్థి ఆచారి అన్నారు. మంగళవారం మాడ్గుల మండలంలోని అందుగుల, అంతంపేట, కూభ్యతాండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తాండూరులో కారు జోరుకు కళ్లెం
తాండూరు, నవంబర్ 20: ముం దస్తు ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీల కంటే ముందుగానే తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నెలన్నర రోజులుగా ప్రచారంలో ముందున్నారు. కాగా వారం రోజుల క్రితం కాంగ్రెస్ టిక్కెట్ ఖరారయిన పైలెట్ రోహిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి పటేల్ రవిశంకర్ పోటాపోటీగా తమ ఎన్నికల ప్రచా రం జోరు పెంచారు. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ, చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ పట్టణ, నియోజకవర్గంలోని గ్రామాలలో యువతకు గాలం వేస్తూ తమ వైపు తిప్పుకోవటంలో ఆ పార్టీ నాయకులు, అభ్యర్ధి పటేల్ రవిశంకర్ సఫలీకృతులవుతున్నారు. టీఆర్‌ఎస్‌లోకి పెరుగుతున్న ఇతర పార్టీల కార్యకర్తల వలసలు వట్టి బూటకమని, పార్టీకి చెందిన కొందరు నాయకులు ముఖ్యంగా ఓ వర్గానికి చెందినవారు బోగస్ వలసలను ప్రేరేపిస్తూ అభ్యర్థి మహేందర్ రెడ్డికి కుచ్చు టోపీ పెడుతున్నారనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ కిలాడీలను నమ్ముతున్న మహేందర్ రెడ్డి ఎన్నికల్లో ఓటమిపాలు కావటం తథ్యమనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.

చిన్నారిపై ఉపాధ్యాయిని పైశాచికం
మేడ్చల్, నవంబర్ 20: తమ గారాల పట్టిని ఉపాధ్యాయిని పైశాచికంగా చిత్రహింసలు పెట్టిందని ఆగ్రహంతో పాఠశాల ఎదుట చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చిన్నారిపట్ల శాడిస్ట్ మాదిరిగా వ్యవహరించిన ఉపాధ్యాయినిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ విద్యార్థిని బంధువులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలి