కృష్ణ

రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- మంత్రి రవీంద్ర
మచిలీపట్నం , నవంబర్ 20: అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మండల పరిధిలోని ఎస్‌ఎన్‌గొల్లపాలెం, సీతారామపురం గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. అధిక వర్షాలకు నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అధిక వర్షాలు తమను నిండా ముంచెత్తాయని రైతులు మంత్రి వద్ద వాపోయారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, సర్పంచ్‌లు మట్టా నాంచారయ్య, బెజవాడ లక్ష్మి, ఎంపిటిసి కొల్లూరి నరేష్, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, పార్టీ నాయకులు కుంచే దుర్గాప్రసాద్, తహశీల్దార్ నారదముని, వ్యవసాయ అధికారి కె శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మురుగు నీరు తరలించేందుకు చర్యలు
అవనిగడ్డ, నవంబర్ 20: స్థానిక పంచాయతీ పరిధిలోని సింహాద్రి కాలనీ, యాదవ కాలనీ, మండలిపురంలలో గత ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు మురుగునీటిలోనే మగ్గుతూ ఉండటంతో నీరు తరలించేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం చర్యలు ప్రారంభించారు. పొక్లయిన్‌తో డ్రెయిన్లు తవ్వి నీటిని మళ్ళించారు. సింహాద్రి కాలనీలో 15 కుటుంబాల వారు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుండగా నాలుగు రోజులు పాటు కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం పల్లం కావటంతో మురుగునీరు నిలిచిపోయింది. పాకల్లోకి నీరు చేరడంతో బయటకు రాలేక, ఇంటిలో ఉండలేక తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ ప్రాంతంలో రహదారులు సైతం జలమయం కావడంతో వీరితో పాటు కాలనీ వాసులు బయటకు వెళ్ళేందుకు విద్యార్థులు, మహిళలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదు రోజులుగా మురుగునీటిలో ఉంటున్నా అధికారులు ఎలాంటి పునరావాసం కల్పించడంలేదని ఆరోపించడంతో పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. జడ్‌పిటిసి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తవ్వకం పనులు చేపట్టారు. కొద్దిపాటి వర్షం పడినా ఈ ప్రాంతంలో రహదారులు జలమయం అవుతున్నాయని, సరైన డ్రెయిన్లు లేక పోవడమే దీనికి కారణమని, ఎన్ని సార్లు చెప్పిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పంచాయతీ ఆధ్వర్యంలో తవ్వకం పనులు చేపట్టామన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడవచ్చని అధికారులు చెబుతుండటంతో మరింతగా ప్రజలు బీతిల్లుతున్నారు. ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఉప సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, ఎంపిటిసి గాజుల మురళీకృష్ణ, యాసం చిట్టిబాబు, డేగల రాఘవ తదితరులు తవ్వకం పనులను పర్యవేక్షించారు. దీనికి తోడు ముందుచేత వేసిన పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పంట వాలిపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.