రంగారెడ్డి

ఏసీబీకి చిక్కిన ఎంవీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 22: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఐదువేల రూపాయల లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు షాద్‌నగర్ ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తి చిక్కాడు. గురువారం సాయంత్రం షాద్‌నగర్ ఎంవీఐ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ పట్టణానికి చెందిన తిరుమల డ్రైవింగ్ స్కూల్‌కు చెందిన విజేందర్‌రెడ్డి ఒక డ్రైవింగ్ లైసన్స్ రెన్యూవల్ చేయాలంటూ ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తిని గత నెల రోజులుగా కోరుతున్నాడని, లైసన్స్ రెన్యూవల్ చేయకుండా అతన్ని ఇబ్బందులకు గురి చేసి లంచం అడిగాడు. దీంతో విసిగిన విజేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన ఎసీబీ అధికారులు విజేందర్‌రెడ్డి ఐదు వేల రూపాయలను ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తికి ఇవ్వబోయాడు. అతను డబ్బులను తన డ్రైవర్ బాలయ్యకు ఇవ్వాలంటూ పురమాయించగా ఇచ్చాడు. ఇదే సమయంలో ఎసీబీ అధికారులు పట్టుకొని ప్రశ్నించి ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తి, డ్రైవర్ బాలయ్యను అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. మహబూబ్‌నగర్ ఎసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ, రంగారెడ్డి జిల్లా ఏసీబీ సీఐ లక్ష్మీ, రఘునాథ్, కమల్‌కుమార్, లింగస్వామి ఉన్నారు. అవినీతి ఏ శాఖలో ఉన్నా... ప్రజలు సహించరాదని, అక్రమాలకు పాల్పడితే వారి గురించి ఏసీబీకి సమాచారం అందించాలని రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కోరారు.