తెలంగాణ

ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

31 వరకు రిమాండ్
కరీంనగర్, డిసెంబర్ 26: జిల్లా కేంద్రంలోని కెన్‌క్రెస్ట్ పాఠశాలల అధినేత రామవరం ప్రసాద రావు ఆత్మహత్య కేసుతోపాటు అక్రమ ఫైనాన్స్ దందాకు సంబంధించిన పలు కేసులలో జిల్లా జైలులో ఉన్న ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డిని పోలీసులు పిటి వారంట్లపై శనివారం కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఎదుట హాజరుపరిచారు. కరీంనగర్ నగర శివారు కొత్తయాస్వాడ ప్రాంతానికి చెందిన బండారి రాజవౌళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్‌రెడ్డిపై కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఇందిరానగర్‌కు చెందిన కొత్తపేట రాజయ్య ఫిర్యాదుపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మోహన్‌రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే సుందరగిరి సత్తమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్‌రెడ్డితోపాటు హోంగార్డు శ్రీనివాస్, అకౌంటెంట్ జ్ఞానేశ్వర్, సిఐడి కానిస్టేబుల్ పర్శరాములు, మల్లేశం, పంకజ్‌సింగ్, కల్లెపల్లి జాన్‌లపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రసాదరావు ఆత్మహత్య కేసుతోపాటు ఈ మూడు కేసుల్లో ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డిని పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చగా, ఈ నెల 31వరకు జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశిస్తూ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.