అక్షరాలోచన

రేపటి జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకాల ఇంద్రధనస్సును
వేలాడదీశాను
రంగురంగును విడదీసి
అనుభవాల్ని అద్దుతున్నాను

సర్కారు దవాఖానా నిర్లక్ష్యానికి
వరండాలో అమ్మ ప్రసవం
నాటి నా పుట్టుక విషాదం
నేటి నా జ్ఞాపకం!

ఎంతెంత దూరం
బారబార దూరమంటూ
బడిలో రెండు బారల దూరంలో
నా అంటరానితనం
దూరంగా కూర్చున్న జ్ఞాపకం!

చినిగిన నిక్కరు స్థానంలో
సరికొత్త ప్యాంటు నిలిచి
బడికి బయల్దేరిన నన్ను జూసి
అమ్మ కళ్లకు వెలుగుకు
సూర్యుడు సిగ్గుపడ్డ జ్ఞాపకం!

పరీక్ష హాల్లో నన్ను కాపీకొట్టి
పట్టుబడ్డాక
నేను కాపీ కొట్టానని
నన్ను డీబార్ చేయించిన
ధనమదాందుడి యుక్తి జ్ఞాపకం!

పచ్చికట్టెల పొయ్యి ఊది ఊది
ఊదెడు గొట్టం కార్చిన కన్నీళ్లు
కష్టాల్ని రుూది రుూది
అమ్మకార్చిన కన్నీళ్లు
పొంతను నింపిన జ్ఞాపకం!

మళ్లీ జన్మలోను
నినే్న మనువాడతానంటూ
నా వొళ్ళో అర్ధాంగి
అర్ధాంతర మరణం జ్ఞాపకం!

రేపు నేను మరణించాక
అంటరానితనం వెంటబడి
ఊరి దారి అనుమతించక
ఊరి బైట
దారులు కాని దారుల వెంట తిరుగుతూ
నా శవ ప్రస్థానం
నా రేపటి జ్ఞాపకం కాకూడదు!
****

మేల్కొన్న మాట

-మాదిరాజు రంగారావు
గాలి కొత్త మాట అందిస్తుంది
మేల్కొన్న మాట వెలుగులో
కొత్త జగం చూపుతుంది
మనిషి బూది కావడమో మట్టిలో కలవడమో
ఎప్పటికైనా ఉన్నదే జరుగుతూ పోతుంది
బూది నుండి మట్టి నుండి పైకి లేస్తుంది
యశో విభవం! ఎద కంటికి సుందరంగా
చిన్నదో పెద్దదో సామాన్యమో అపూర్వమో
పవిత్రమైన బ్రతుక్కి ప్రజ మెచ్చే కానుక!
ఈర్ష్యను అసూయను చెరగుతూ వడపోస్తూ
తరం నుండి తరానికి సందేశం అందిస్తుంది
ఎంతటి చండ గ్రీష్మ తాపమయినా
అక్కడికి చేరగనే చల్లబడుతుంది సవినమ్రంగా
ఎంతటి శీత పదవన లహరి అయినా
అక్కడికి రాగానే వెచ్చబడుతుంది ఉత్సాహంగా
గాలి కొత్త మాట వినిపిస్తుంది
ప్రతిఫలించే సమాజ నవ నిర్మాణంలో
కొత్త తరం హృదయం స్వనిస్తుంది
బూది నుండి మట్టి నుండి మొక్క మొలిచి
కంటి ముందు పూవు ఫలంపై కోరిక సహజం
పూవుతో ఫలంతో సమాజ బహుమానం
శ్రమ జీవన గుణ ప్రజతోనే!
స్వేచ్ఛకు చిహ్నం గాలి! అంతటా ఒకటే
పులి అయినా మనిషి అయినా! జీవన యత్నం ఒకటే.

****

విలయం
-కొమురవెల్లి అంజయ్య

విజ్ఞానం విశ్వవ్యాప్తం
అరచేతిలో సర్వజ్ఞానం
స్వార్థం శిఖరంపై అహం జెండా పాతినవాళ్లం
అన్నీ తెలిసిన అరసున్నాలం
ఉద్యోగ హరిణి వేటకే చదువులు
విలువలకు సంపూర్ణ తిలోదకాలు
రాబడులకే పెట్టుబడులు
చక్రవడ్డీల రాట్నం తిప్పే చేష్టలు
పచ్చదనం పంట విరగకాస్తే
తనువుపై చెట్ల చల్లని చూపు
అమృతంలా దాచుకోవాల్సినవి దోచుకుంటున్నాం
పదికాలాలు నిలుపుకోవాల్సినవి నలిపేస్తున్నాం
గుండు కొట్టించి వెంట్రుకల్లా
చెట్ల నమ్ముకుంటున్నాం
మండుటెండల్ని పుష్కలంగా పండిస్తున్నాం.
* * *
గుట్టలు వౌనుల్లా తపస్సమాధిలో
గంపెడు వర్షం కురిసినా దాచుకోని దానస్థితిలో
ఆశల ఆకలి పర్వతాల పాదపీడనలో
కొండలు బండలవుతాయి
గుట్టలు మట్టమవుతాయి
ఊటలు బంగారు బాతులు
చెలిమలు వాగుల సిగలో గంగలు
కన్నతల్లుల్లా చెరువులు
కడుపులో డ్రిల్లింగ్ బోర్ల జలాల వేట
కాలుష్య విసర్జనతో కాలువల సయ్యాట
కట్టలకు ఆ ‘పరేషాన్’ కోతలు
శిఖంలో ఆక్రమణ వాతలు
* * *
గనులేవైనా బంగారు వనాలు
తోడుకుంటే రసాలూరు ఫలరాజాలు
రూపాల్ని పెకిలించే ఓపెన్ బ్లాస్ట్‌లు
విధ్వంసానికి పరాకాష్టలు
* * *
ముందు చూపు కొండెక్కినపుడు
మూతి మీద మీసాలు మెలేసి ఏం లాభం?
ప్రకృతిని అంగడి బొమ్మగా మార్చి
పచ్చని పైర గాలులను హరించి
లయబద్దతను బద్దలు చేసి
తిన్నింటి వాసాలకు ముప్పుతెచ్చి
గుండెల్ని గుల్లగా మార్చి
పరితపిస్తే ఏం లాభం?
బాధలు తట్టుకోలేక చిన్నారై భూమి
పొర్లిపొర్లి ఏడ్చింది
ప్రకంపనలు, ప్రళయాలు
కళ్లు తెరవనితనాన్ని ఎంతకని లేపుతాం?

-అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946