రంగారెడ్డి

రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులు టిక్కెట్‌ల కోసం పైరవీలు, పాదయాత్రలు
జీడిమెట్ల, డిసెంబర్ 21: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్‌లు ఇంకా వెలువడలేదు. కార్పొరేటర్ టిక్కెట్ కోసం పోటీ పడే ఆశావహులు ఎప్పుడెప్పుడు రిజర్వేషన్లు ఖరారవుతాయాని ఎదురు చూస్తున్నారు. ఈనెల 9 నుండి రెండ్రోజుల్లో రిజర్వేషన్లు వెలువడతాయని ఎదురుచూస్తున్న ఆశావహులకు ఉత్కంఠ తప్పడం లేదు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే పోటాపోటీగా బస్తీలలో పాదయాత్రలు చేస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ వైపు రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడకముందే పార్టీ టిక్కెట్‌ల కోసం పైరవీలు మొదలయ్యాయి. కార్పొరేటర్ రేసులో ఉన్న ఆశావహులు టిక్కెట్‌ను కేటాయించాలని ప్రదాన నేతల వద్దకు చక్కర్లు కొడుతున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో ఎనిమిది డివిజన్‌లు ఉన్నాయి. ఎనిమిది డివిజన్‌లలోనూ టిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ పార్టీల నాయకులు బస్తీలలో పర్యటించి ప్రజల వద్దకు వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు నేరుగా పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎనిమిది డివిజన్‌లలోనూ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ కార్యక్రమాలను చేపడుతూ ప్రజల వద్దకు వెళ్లాలని ముఖ్య నేతలు పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్ నేతలు గ్రేటర్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుతో పాటు నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి కొలను హన్మంతరెడ్డిని పిలిపించుకుని పాదయాత్రలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఎనిమిది డివిజన్‌లలోనూ టిఆర్‌ఎస్ పార్టీ నుండి టిక్కెట్‌ను ఆశించే నేతలు బస్తీల్లో పోటాపోటీగా పాదయాత్రలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు దగ్గరవుతూనే పార్టీలో మంత్రులు, ప్రధాన నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పార్టీ టిక్కెట్‌ను ఇప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు టిక్కెట్‌ల కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు ఎప్పుడెప్పుడు రిజర్వేషన్లు వెలువడతాయాని ఎదురుచూస్తున్నారు.