కృష్ణ

15లోగా ఓటర్ల జాబితా సవరణ పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రిటర్నింగ్ అధికారులకు జెసి చంద్రుడు ఆదేశం
విజయవాడ, నవంబర్ 27: 2016 ఎలక్ట్రోల్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 15లోగా నూరుశాతం పరిష్కరించి డిసెంబర్ 31 నాటికి వెబ్‌సైట్‌లో నమోదు ప్రక్రియను పూర్తిచెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్వర్‌లాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో డూప్లికేట్ ఓటర్లను ఎన్నికల జాబితా నుండి తొలగించాలని ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వారిని గుర్తించడం జరిగిందన్నారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఈ విషయమై తక్షణ చర్యను తీసుకోవాల్సి వుందని ఒకే వ్యక్తి రెండు, మూడుచోట్ల ఓటు కలిగి వున్నారని, అటువంటి వారిని తక్షణం తొలగించాలని స్పష్టంగా ఆదేశించారు. జిల్లాలోని ఓటు హక్కుకు సంబంధించి అపిలేట్ అధికారికి సమర్పించిన దరఖాస్తులను జిల్లా ఎన్నికల అధికారి వెంటనే పరిష్కరించి డిసెంబర్ 1 నాటికి దరఖాస్తు పెండింగ్‌లో వుండకుండా తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రత్యేక ఎలక్ట్రోల్ డివిజన్ సమ్మరీ 2016 సంబంధించి అన్ని దరఖాస్తులను డిసెంబర్ 15 నాటికి పూర్తిచెయ్యాలని, దరఖాస్తులు కొరకు నవంబర్ 16తో గుడువు ముగిసిందని ఆయన తెలిపారు. దరఖాస్తులను ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకల్లా ఎలక్షన్ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు పూర్తిచెయ్యాలని, వాటి పరిష్కారానికై చొరవ చూపాలని అధికారులకు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 11వ తేదీ 2016 నాటికి ప్రచురించాల్సి వున్నందున క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన డేటా బేస్, ఫోటోల అనుసంధానం తదితర పనులను డిసెంబర్ 31 నాటికల్లా పూర్తిచేయాలని ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో ఆన్‌లైన్ ద్వారా, వ్యక్తిగతంగానూ ఫారం 6 ద్వారా 14,066 దరఖాస్తులు రాగా 3,072 పరిష్కరించామని, 399 తిరస్కరించబడ్డాయని తెలిపారు. ఫారం 7కు సంబంధించి 1445కు గాను 154 ఆమోదించి 49 తిరస్కరించామని, ఫారం 8కు సంబంధించి 5,513కు గాను 1236 ఆమోదించి 783 తిరస్కరించామని, ఫారం 8ఎకు చెందిన 871 దరఖాస్తులకు గాను 83 ఆమోదించి 111 తిరస్కరించామన్నారు.
జిల్లాలో 14 లక్షల 13వేల 981 మంది పురుషులు, 14 లక్షల 42వేల 930 మంది మహిళలు, 218 మంది ఇతరులు సర్వీసు ఓటర్లు 879 ఓట్లు వున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో లక్షా 72వేల 825 మంది డూప్లికేటు ఓటర్లను గుర్తించామన్నారు. అత్యధికంగా మైలవరంలో 13వేల 580 మంది, గన్నవరం 13వేల 277, పెనమలూరులో 12వేల 492 మంది వున్నట్లు తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మొత్తం డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఇఆర్‌వోలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అపిలేట్ అధికారికి దరఖాస్తు చేసుకున్న 157 దరఖాస్తులను పరిష్కరించి డిసెంబర్ ఒకటికి నివేదిక పంపుతామని తెలిపారు. జిల్లాలోని 3వేల 563 పోలింగ్ బూతు స్థాయి అధికారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించామని బందరు నియోజకవర్గం పరిధిలో 40కు పైగా బిఎల్‌వోల బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చెయ్యాల్సిందన్నారు. బిఎల్‌వోల గౌరవ వేతనం, ప్రోత్సాహక నగదు, పర్యవేక్షకుల ప్రోత్సాహక నగదు, పెండింగ్ వివరాలను ఇప్పటికే ఎన్నికల ప్రధాన అధికారికి సమర్పించమాని ఆయన తెలిపారు. జిల్లాలోని ఈవిఎంల గోడౌన్ నిర్మాణాలపై ద్రువపత్రాన్ని సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు.