రంగారెడ్డి

కుత్బుల్లాపూర్ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 16: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజు అన్నారు.
సోమవారం కుత్బుల్లాపూర్ పరిధిలోని రంగారెడ్డినగర్ డివిజన్‌లో రూ.1.95 కోట్ల వ్యయంతో రంగారెడ్డినగర్ టెక్నో వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐడీపీఎల్ చౌరస్తా నుంచి రంగారెడ్డినగర్ కమాన్ వరకు రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్, సంజయ్‌గాంధీ నగర్ యూజీడీ, సిమెంట్ రోడ్డు, వెంకట్రామిరెడ్డినగర్‌లో మహిళా భవన నిర్మాణం, నందానగర్‌లో ప్రాథమిక ఉపకేంద్రం నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. వివేక్, రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ సహకారంతో కుత్బుల్లాపూర్‌ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు శాయశక్తులా పాటుపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్, అబ్దుల్ ఖాదర్, రహీమ్, శంకరయ్య, గౌసొద్దీన్, ఫయాజ్, కార్తిక్, రషీద్ పాల్గొన్నారు.
సుభాష్‌నగర్‌లో..
సుభాష్‌నగర్ డివిజన్ రాంరెడ్డినగర్‌లో రూ.161 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు పనులను ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు.
వివేక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వౌలిక వసతులను కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిశ్రీ, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, వరున్, రాజు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
షాదీమ