రంగారెడ్డి

దళితులను మోసగించిన కేసీఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఏప్రిల్ 24: తెలంగాణను కేసీఆర్ కుటుంబం పీక్కుతింటుందని మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాలాపూర్ మండల కాంగ్రెస్ అధ్వర్యంలో మీర్‌పేట్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో సబితారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తనకు అధికారం, పదవులు అక్కరలేదని, తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు.
కానీ, నేడు కేసీఆర్ కుటుంబం తెలంగాణను పీక్కుతింటున్నారని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా, మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశారని అన్నారు. పేదలకు మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో పనిచేసిన రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించారని అన్నారు. అవినీతి చేశారని దళిత మంత్రి రాజయ్యను బర్తరఫ్ చేశావు.. మంత్రి కేటీఆర్ మూడు శాతం కమిషన్ తీసుకోమన్నారని సిరిసిల్ల చైర్‌పర్సన్ చెప్పినట్లు చెబితే, కేటీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేసీఆర్‌ను నిలదీశారు. బడంగ్‌పేట్, మీర్‌పేట్, జిల్లెలగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీలకు దాదాపు రూ.13 కోట్ల వరకు ఎస్సీ, ఎస్టీ నిధులు రావాల్సి ఉందని అన్నారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులు రూ.74 వేల కోట్లు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు మాత్రం రూ.34 వేల కోట్లు అని చచెప్పారు. మిగిలిన నిధులు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు మళ్లించినట్లు పేర్కొన్నారు. దళితులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసగించిన కేసీఆర్‌ను, కాళోజీ చెప్పినట్లు పాతర వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీర్‌పేట్ మున్సిపాలిటీ కమిషనర్ వసంతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బడంగ్‌పేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ యాతం శ్రీశైలం యాదవ్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు నిమ్మల నరేందర్ గౌడ్, మాజీ ఎంపీపీ, టీపీసీసీ మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, మాజీ సర్పంచ్, టీపీసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత, మహిళ బీ-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మీనా నాగేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ ప్రభాకర్ రెడ్డి బడంగ్‌పేట్, మీర్‌పేట్, జల్‌పల్లి, జిల్లెలగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు సూర్ణగంటి అర్జున్, పల్లె జంగయ్యగౌడ్, సూరెడ్డి కృష్ణారెడ్డి, బండి నాగేష్ యాదవ్, కౌన్సిలర్ రామిడి రాంరెడ్డి, కౌన్సిలర్లు పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, మీర్‌పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి గోపాల్ రెడ్డి, గుర్రం సాయి కిరణ్ రెడ్డి, హన్మంతు రెడ్డి, కోఆప్షన్ మెంబర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, కర్రె బల్వంత్, గుర్రం వెంకట్ రెడ్డి, యెల్చల సుదర్శన్ రెడ్డి, మీర్‌పేట్, జిల్లెలగూడ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పంతంగి మాధవి, బాలమణి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సంజీవ పాల్గొన్నారు.
గతంలో పనిచేసిన కార్యదర్శులపై డీపీఓ విచారణ
ఘట్‌కేసర్, ఏప్రిల్ 24: ఘట్‌కేసర్ పంచాయతీలో గతంలో పనిచేసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన కార్యదర్శులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రస్తుత సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ చేసిన ఫిర్యాదుపై జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ మంగళవారం విచారణ జరిపారు. నాలుగున్నర సంవత్సరాలుగా 12 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేశారని వారి హయంలో ఇచ్చిన గృహనిర్మాణ అనుమతులు, ఇతర అభివృద్ధి పనులు, అక్రమ నిర్మాణాలపై వారు తీసుకున్న చర్యలపై విచారణ జరుపాలని సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు యిచ్చిన ఫిర్యాదుపై స్పందించిన డీపీఓ సురేష్ మోహన్, ట్రెయినీ డీపీఓ జగదీశ్వర్, మండల పరిషత్ విస్తరణాధికారి సునందతో కలిసి విచారణ జరిపారు. పాత రికార్డులు, సంబంధిత ధ్రువ పత్రాలను పరిశీలించారు. సర్పంచ్ యాదగిరి యాదవ్‌పై వచ్చిన ఫిర్యాదులను సైతం పరిగణలోకి తీసుకుని రికార్డులను పరిశీలించారు. గతంలో పనిచేసిన కార్యదర్శులలో శ్రావన్‌కుమార్, జమిల్ అహ్మద్ మాత్రమే హాజరైనట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీపీఓ సురేష్ మోహన్ తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, ఎంపీటీసీ నర్సింగ్ రావు, పంచాయతీ సభ్యులు చంద్రశేఖర్ గుప్త, సుధాకర్ రావు, సాయికుమార్ పాల్గొన్నారు.