రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 16: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల గ్రామం, అంగడి పేట్‌లలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సోమవారం ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను దగ్గరుండి పరిశీలించారు. పాఠశాల హెచ్‌ఎంను పాఠశాల వివరాలను, సమస్యలను తెలుసుకున్నారు. వివేక్, రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు వంట గది, ప్రహారీ గోడ నిర్మాణాలను వెంటనే మంజూరు చేయిస్తామని అన్నారు. పాఠశాలలో విద్యుత్ సమస్యను సైతం పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్‌ఎస్ నేత కేఎం.ప్రతాప్, కార్పొరేటర్‌లు జగన్, విజయశేఖర్ గౌడ్, సత్యనారాయణ, నాయకులు మహేశ్, మదుసూదన్, సురేశ్, మారయ్య పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డినగర్ డివిజన్ పంచశీలకాలనీలో రూ.8 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణపు పనులను ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజుతో కలిసి ప్రారంభించారు. గాంధీనగర్ కమిటీ హాల్‌లో 30 మందికి కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకం మంజూరైన చెక్కులను వివేక్, రాజులు పంపిణీ చేశారు. కార్పొరేటర్‌లు విజయశేఖర్ గౌడ్, సత్యనారాయణ, జగన్, నాయకులు అబ్దుల్ ఖాదర్, రహీమ్, లక్ష్మణ్ గౌడ్, హన్మిరెడ్డి, లావణ్య, వెంకటేశం పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు పూడ్చాలి
తాండూరు, జూలై 16: పట్టణంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు పూడ్చాలని అధికారులను మున్సిపల్ చైర్‌పర్సన్ బీ.సునీతా సంపత్ కోరారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్, ఆర్‌అండ్‌బీ రోడ్ల దుస్థితిని పరిశీలించారు. పట్టణంలోని రోడ్లన్నీ వర్షాలతో దుర్లభంగా మారాయని అన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వాన్నంగా మారి వాహనాలదారులతో పాటు పాదచారులు సైతం సక్రమంగా రాకపోకలు సాగించలేని దుర్భర పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. మున్సిపల్ రోడ్లను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. మున్సిపల్ నిధులు ఖర్చు చేసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లను మెరుగు పరిచామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు, గ్రాంట్లు సక్రమంగా అందటం లేదని వాపోయారు. నిధుల లేమితో మున్సిపల్ రోడ్లను సకాలంలో మరమ్మతు చేపట్టలేదని అంగీకరించారు. పట్టణంలోని రోడ్లను మరమ్మతు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.
రిసోర్స్ పర్సన్‌ల సమస్యల
పరిష్కారానికి కృషి
మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఐకేపీ, మెప్మా విభాగాల్లో సేవలందిస్తున్న వార్డు రిసోర్స్ పర్సన్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ బీ.సునీతా సంపత్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టిన ఆర్పీల శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఆర్పీల సమస్యలు, జీతభత్యాల గురించి మున్సిపల్ ఉన్నతాధికార యంత్రాంగంతో పాటు, ప్రభుత్వానికి విన్నవిస్తామని పేర్కొన్నారు. ఆర్పీలకు ప్రభుత్వం తరపున ఎలాంటి వేతనాలు, జీతభత్యాలు లేవని చెప్పారు. కేవలం మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాల నుంచి ఆయా సంఘాల గ్రూపు మహిళలు అందించే ఇతోదిక సహాయంతో ఆర్పీలు కాలం వెళ్లదీస్తున్నట్లు చైర్‌పర్సన్‌తో పాటు, ఆర్పీలు సుజాత, వనజ, విజయలక్ష్మీ, అన్నపూర్ణ, విశాల, లక్ష్మీ వెల్లడించారు. ఆర్పీల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీలు, ఇతరాత్ర విభాగాలకు చెందినవారికి జీతభత్యాలు అందిస్తూ ఆదుకుంటుందని, తమ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు.