రంగారెడ్డి

గుండ్లపోచంపల్లిలో 95 శాతం పన్నుల వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 4: మేడ్చల్ మండలంలోని ఆయా గ్రామాలలో అధికారులు పన్నుల వసూలులో దాదాపు లక్ష్యానికి చేరువలో నిలిచారు. ఈనెల 13వ తేదీ వరకు వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. గత యేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో పన్నులను వసూలు చేసినట్లు మండల వీస్తీర్ణ్ధాకారి (ఇఓపిఆర్డీ) జ్యోతిరెడ్డి సోమవారం పేర్కొన్నారు.
మండలంలోని 16 గ్రామాలలో ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం రూ.5.41కోట్ల లక్ష్యం కాగా రూ.4.71కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసినట్లు వివరించారు. ఈనెల 13 వరకు అధికారికంగా గడువు ఉన్నందున వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించినట్లు చెప్పారు. గుండ్లపోచంపల్లిలో 95 శాతం ఆస్తి పన్నును చెల్లించారని, శ్రీరంగవరంలో కేవలం 61 శాతం పన్ను చెల్లించారని వివరించారు. బండమాదారంలో 85 శాతం, డబిల్‌పూర్‌లో 65 శాతం, గిర్మాపూర్‌లో 92 శాతం, గౌడవెళ్లిలో 67 శాతం, కండ్లకోయలో 74 శాతం, మునీరాబాద్‌లో 90 శాతం, నూతన్‌కల్‌లో 78 శాతం, పూడూరులో 86 శాతం, రాయిలపూర్‌లో 67 శాతం, రావల్‌కోల్‌లో 66 శాతం, రాజబొల్లారంలో 87 శాతం, సోమారంలో 81 శాతం, యాడారంలో 83 శాతం, ఎల్లంపేట్‌లో 81 శాతం ఆస్తి పన్నులను వసూలు చేసినట్లు వివరించారు. ఈ పన్నులతో మండలంలో అభివృద్ధికి చేయూతని ఇస్తాయని జ్యోతిరెడ్డి అన్నారు.