రంగారెడ్డి

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి మహేందర్‌పై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించిన మంత్రి మహేందర్ రెడ్డిపై ఎన్నికల అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశామని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ-మెయిల్ చేశామని, ఫిర్యాదు ప్రతిని వికారాబాద్ కలెక్టర్‌కు అందజేశామని తెలంగాణ జనసమితి జిల్లా ఇన్‌చార్జి పంజగుల శ్రీశైల్ రెడ్డి వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్లబ్ ఆవరణలో అక్టోబర్ ఒకటో తేదీన కరీంనగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ జనసమితి సాంస్కృతిక ధూంధాం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించరాదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా, తాండూర్‌లో మసీదులో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి మహేందర్ రెడ్డి రేపోమాపో దేవాలయం, మసీదులలో ప్రతిజ్ఞ చేయిస్తారని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కండక్టర్, అనుకూలంగా మాట్లాడిన ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకున్నట్టుగా మంత్రి మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, సామాన్యుడికో న్యాయం, మంత్రికో న్యాయమా అని ప్రశ్నించారు. రాష్టప్రతి పాలనలోనే స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. టీజేఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం రాంచందర్ మాట్లాడుతూ రైతుబంధుతో నిజమైన రైతుకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీజేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు విక్రం, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు జగదీశ్, తాండూరు కోకన్వీనర్ ఫిరోజ్‌ఖాన్, రైతుసంఘం అధ్యక్షుడు మాణిక్ రెడ్డి, కోకన్వీనర్ తలారి నర్సింలు, యూత్ విభాగం కోఆర్డినేటర్ అజయ్ పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన ‘నిమజ్జనం’

పదకొండు రోజుల పాటు విశేషంగా పూజలందుకున్న పార్వతి పుత్రుడి నిమజ్జనం సోమవారం మధ్యాహ్నంతో ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన గణేష్ నిమజ్జనం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కోనసాగింది. బాలపూర్‌తో పాటు వివిధ ప్రాంతాల నుండి కోనసాగిన ఈ శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వరకు సాగింది. ఖైరతాబాద్ మహాగణపతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తి కావడంతో నిమజ్జన వేడుకలు తొందరగా ముగుస్తాయని భావించన్నప్పటికీ సోమవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు కొనసాగింది. జన సందోహం, నిమజ్జనానికి తరలివచ్చిన భక్త జనంతో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, లక్డికాపూల్ తదితర ప్రాంతాలు సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలి వచ్చిన గణనాధులను హుస్సేన్‌సాగర్‌లో అటు ట్యాంక్‌బండ్, ఇటూ ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న 30 ప్రాంతాల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలిన విగ్రహాలు సోమవారం తెల్లావారు జాము వరకు అబిట్స్, ఎల్‌బీ స్టేడియం తదితర ప్రాంతంలో నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్‌పై ఒకేసారి నిమజ్జనానికి తరలి వచ్చిన విగ్రహాల వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచి పోవడంతో ట్యాంక్‌బండ్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు నుంచి నిమజ్జనం కోసం తరలించారు. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ కావడంతో వినాయకులను తరలించే నిర్వాహకులు పలు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం, సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగిన నిమజ్జనంలో దాదాపు 15వేల విగ్రహాల వరకు నిమజ్జనం చేశారు. 30 క్రేన్‌ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్, పోలీసు శాఖలతో పాటు ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జనం ఏర్పాట్లను చేపట్టారు. పాతనగరంలో ఆలస్యంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం అవడంతో సోమవారం నిమజ్జనమైన వినాయకుల్లో అధిక శాతం పాతబస్తీకి చెందినవే ఉన్నాయి. వినాయక సామూహిక నిమజ్జనం పూర్తి ప్రశాంతంగా సాగడానికి ప్రజలు, ఉత్సహ కమిటీల నిర్వహకుల సహకారం ఎంతో ఉపయోగపడిందని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. పోలీసు విభాగానికి చెందిన ప్రతి అధికారి, సిబ్బంది సముష్టిగా కృషి చేయడంతో నిమజ్జనం సాఫీగా సాగింది. నిమజ్జనం కోసం పోలీసులు ఊరేగింపునకు తగ్గట్టుగా ఎప్పటికపుడు పరిస్థితులను బేరీజు వేస్తూ బందోబస్తును ఏర్పాటు చేశారు. జలండలి ఆధ్వర్యంలో నగంరలోని వివిధ ప్రాంతాల్లో 101 వాటర్ క్యాంప్‌లు ఏర్పాటు చేసింది.
ట్యాంక్‌బండ్‌లో పరిశుభ్రత పనులు ప్రారంభం
ఉప్పల్: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం వేడుకలు ముగిసిన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌లో పరిశుభ్రత పనులకు శ్రీకారం చుట్టారు. సోమవారం హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక క్రేన్‌ల సహాయంతో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది గణేశ్ విగ్రహాలతోపాటు పూజా సామాగ్రి, చెత్త, చెదారాన్ని, విగ్రహాలకు ఉపయోగించిన ఇనుప చువ్వలను తొలగించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే వినియోగించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ద్వారా తయారుచేసిన మట్టి గణపతులను జీహెచ్‌ఎంసీ వినాయకచవితి సందర్భంగా నగర ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేసిన ప్రజలు పది రోజుల పాటు ప్రత్యేక మండపాలలో నిత్య పూజలు చేసి నిమజ్జనం చేశారు.
సాగర్ నీళ్లు కలుషితమై చెత్త చెదారంతో పేరుకుపోయి దుర్వాసన వెదజల్లకుండా పరిశుభ్రత పనులను ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ రూ.26.25లక్షలు మంజూరు చేసింది. ఈనెల 29వ తేదీ వరకు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి నార్మల్ వాటర్ వచ్చేంతవరకు క్లీనింగ్ పనులు చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ కమిషనర్ డాక్టర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.