రంగారెడ్డి

సమస్యలను పరిష్కారానికి ఐక్య ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, : ఆర్టీసీ కార్మికులకు ఎంప్లారుూస్ యూనియన్ నిరంతరం అండగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఐక్యంగా ఉద్యమించాలని యూనియన్ జోనల్ వర్క్‌షాపు అధ్యక్షుడు ఎస్.బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఉప్పల్ వర్క్‌షాప్ ఆవరణలో నిర్వహించిన కార్మికుల బహిరంగ సభ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీ.మురళీధర్ అధ్యక్షతన జరిగింది. గత గుర్తింపు పొందిన టీఎంయూకు చెందిన వర్క్‌షాప్ టైర్ సెక్షన్‌లో పని చేస్తున్న 80 మంది రాజీనామా చేసి ఎంప్లారుూస్ యూనియన్‌లో చేరారు. పేస్కేల్ చేయడంలో టీఎంయూ వైఫల్యం చెంది ఆర్టీసీలోని అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు ఉన్నా సమ్మెకు వెల్లకుండా కార్మికులకు మంచి వేతన సవరణ చేయలేక కేవలం 16శాతం ఐఆర్‌కే ప్రభుత్వం, యాజమాన్యంతో లొంగిపోయి కార్మిక ద్రోహం చేసినందుకు నిరసనగా ఎంప్లారుూస్ యూనియన్‌లో చేరినట్లు ప్రకటించారు. వీరికి యూనియన్ జెండాలతో సత్కరించి ఆహ్వానించారు. ఆర్టీసీ కార్మికులకు ఎంప్లారుూస్ నిరంతరం అండగా నిలిచి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషి చేస్తుందని పేర్కొన్నారు. సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల ఆదరణ పొందుతున్న ఎంప్లారుూస్ యూనియన్ వచ్చే కార్మిక సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీ, వేతన సవరణ, సర్వీస్ కండిషన్స్, అలవెన్సులు ఇప్పించడానికి ఐక్య ఉద్యమాలతో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. యూనియన్ వర్క్‌షాప్ యూనిట్ అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్, కార్యదర్శి ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి కే.రాజి రెడ్డి, యూనియన్ నాయకులు ప్రసాద్ రెడ్డి, సంపత్ కుమార్, అశోక్, కపిల్, రాజు, బషీర్, రాజేష్, కేశవులు, మధు, దుర్గాప్రసాద్, వినోద్, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.