రంగారెడ్డి

జిల్లాకు 1696 బ్యాలెట్ యూనిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 12: జిల్లాకు 1696 బ్యాలెట్ యూనిట్లు, 1308 కంప్యూటర్ యూనిట్లు, 1348 వీవీప్యాట్‌లు వచ్చాయని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకు కేటాయించిన ఈవీఎం, వీవీప్యాట్, సీయూల ర్యాండమైజేషన్‌పై వివిధ రాజకీయ పక్ష నాయకులతో అవగాహన, నియోజకవర్గాల వారీగా కేటాయింపు సమావేశం నిర్వహించారు.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ర్యాండమైజేషన్ (అన్నింటిని ఒక దగ్గర చేర్చి) అందరి సమక్షంలో వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల వారీగా కేటాయించారు. కలెక్టర్ జలీల్ మాట్లాడుతూ అభ్యర్థి వ్యయానికి సంబంధించిన వస్తువుల రేట్లు (వాహనం, టెంట్, జెండాలు..) నిర్ణయించిన ధరల ఆధారంగా పరిగణలోకి తీసుకోబడునని తెలిపారు. కేంద్ర వ్యయ పరిశీలకుడు సరోజ్‌కుమార్, తాండూరుఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుమాధవ్, పరిగి అధికారి విశ్వనాథం పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌తో పేద కుటుంబాల్లో వెలుగులు
జీడిమెట్ల, నవంబర్ 12: నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎండీ జహంగీర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించాలని కోరుతూ రంగారెడ్డి నగర్ డివిజన్ గురుమూర్తినగర్‌లో ఎంఐఎం కార్యకర్తలతో కలిసి ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంచుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జహంగీర్ అభ్యర్థించారు. జహంగీర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు జయరామ్, జిలాని, మతిన్, హర్షత్, క్రాంతి యాదవ్, సమీర్, ఓంకార్ రెడ్డి, ఇమ్రాన్ ఖాన్, ఎండీ సాజిద్ ఖాన్, ఇర్ఫాన్, బాబా, అంజద్ పాల్గొన్నారు.
కొంపల్లిలో..
గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించాలని కోరుతూ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు సన్న కవిత ముమ్మర ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు వసంత, ప్రభాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ రవి యాదవ్, వార్డు సభ్యులు వేణు, వినోద్, సువర్ణ, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ విజయానికి కార్యకర్తలు శ్రమించాలి: కేఎం ప్రతాప్
టీఆర్‌ఎస్ విజయానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని రాష్ట్ర తెరాస నేత కేఎం ప్రతాప్ అన్నారు. కుత్బుల్లాపూర్‌లో జీడిమెట్ల డివిజన్ బూత్ లెవల్ కోఆర్డినేటర్స్ సమావేశంలో ప్రతాప్ మాట్లాడుతూ బూత్ స్థాయి నాయకులు, కార్తకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ చైతన్య పర్చాలని చెప్పారు. కేపీ విశాల్, జహంగీర్, నాగశేఖర్ గౌడ్, శ్యామ్, కనకయ్య, సుధాకర్ గౌడ్, మధుసూదన్ రాజు, శ్రీ్ధర్ యాదవ్, నక్కా ప్రకాష్, శశిధర్, మల్లేశ్, రమేశ్, కృష్ణ రెడ్డి, అజయ్, మంజుల పాల్గొన్నారు.