రంగారెడ్డి

ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 12: తెలంగాణ యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న మూడు వేల అధ్యాపక పోస్టులను మొదటి వందరోజుల్లో భర్తీ చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పసుల మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఏబీవీపీ ఎన్నికల నినాదం గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతి బడ్జెట్‌లో తెలంగాణ వరకు మూడు వేల కోట్లు కేటాయించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగా లు భర్తీ చేస్తూ కాబోయే ముఖ్యమంత్రి సంతకం చేయాలని, కేజీ టు పీజీ ప్రైవే ట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీని అరికడుతూ గరిష్ట ఫీజులు నిర్ధారించి నియంత్రణ చట్టం తేవాలని, నాలుగు స్కాలర్‌షిప్‌లను 12 వేల రూపాయలకు పెంచాలని, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని, నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు, పేపర్ లీకేజీలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాం డ్ చేశారు. నగర కార్యదర్శి శాఖం సతీష్, సంయుక్త కార్యదర్శి సాకేత్, దీపిక, చందన, అనుష పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం
వికారాబాద్, నవంబర్ 12: వికారాబాద్ ఆధ్యాత్మిక సేవామండలి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని రవి పంతులు నివాసంలో రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
శివలింగానికి ప్రత్యేక అభిషేకం, అర్చన పూలు, మారేడు దళంతో చేశారు. లింగాష్టకం, హనుమాఛాలీసా, ఓం నమశ్శివాయ స్మరణతో భజనలు చేశారు.
పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ప్రత్యేక హారతి, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీవైస్‌చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, ఆధ్యాత్మిక సేవా మండలి ప్రతినిధి టీ.రాజు, భోగేష్ పంతులు, మ్యాడం వెంకట్, రమేష్, యాస్కి రవీందర్, మల్లికార్జున్, కజ్జం రాంచంద్రయ్య, కౌకుంట్ల విజయ్‌కుమార్, ముట్పూరి సత్యం, ప్యాట శంకర్ పాల్గొన్నారు.