రంగారెడ్డి

జోరుగా నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: రంగారెడ్డి జిల్లాలో శనివారం 60 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని ఇబ్రహీమ్‌పట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి నాలుగు, ఎల్‌బీ నగర్‌లో 9, మహేశ్వరంలో 3, రాజేంద్రనగర్‌లో 14, శేరిలింగం పల్లిలో 11, చేవెళ్లలో 4, కల్వకుర్తిలో 9, షాద్‌నగర్‌లో 6 మంది నామినేషన్లు వేయగా మొత్తం జిల్లా వ్యాప్తంగా 60 నామినేషన్లు దాఖలయ్యాయి.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం ఆరుగురు నామినేషన్లను దాఖలు చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే స్థానానికి గాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కొలను హన్మంతరెడ్డి, ప్రజా స్వరాజ్ పార్టీ నుంచి బత్తుల సిద్దేశ్వర్లు, ఆల్ ఇండియా జై హింద్ పార్టీ నుంచి దశరథ రామిరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నుంచి కేఆర్.రాజేంద్ర పిల్లై, స్వతంత్ర అభ్యర్థులుగా ముడిమేల రాముగౌడ్, కడియాల వసంత రాఘవలు సర్కిల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి విక్టర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. 12వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కుత్బుల్లాపూర్ స్థానానికి మొత్తం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. మరో రెండు రోజుల్లో ఎవరెవరు నామినేషన్లను వేస్తారో చూడాల్సిందే.
షాద్‌నగర్: రాష్ట్ర సభకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో భాగంగా ఆరవ రోజు ఆరు నామినేషన్లు దాఖలైనట్లు షాద్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ తెలిపారు. శనివారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ మాట్లాడుతూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్ పీ.శంకర్‌రావు, మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి తరుపున కాంగ్రెస్ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు వివరించారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి వీర్లపల్లి శంకర్, స్వతంత్ర అభ్యర్థిగా ఏ.అంజయ్య, బహుజన లెఫ్ట్ పార్టీ నుండి మన్నారం నాగరాజు, ఇండిపెండెంట్‌గా కేతూరి రాఘవేందర్ ఒక్కొక్క సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. మొత్తం ఆరు నామినేషన్లు వచ్చినట్లు వివరించారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పరిశీలించి తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 19వ తేది నామినేషన్లకు చివరి రోజు కావడంతో పూర్తి స్థాయిలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ తెలిపారు.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో శనివారం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్‌లో ఆరు నామినేషన్లు దాఖలవగా, తాండూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బైండ్ల విజయ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి, కొడంగల్‌లో బీఎల్‌పీ అభ్యర్థి కే.వెంకటేశ్వర్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి శ్రీనివాస్, పరిగిలో స్వతంత్ర అభ్యర్థులు ముకుంద్ నాగేశ్వర్, జీ.మల్లేశం గౌడ్, బీఎంపీ నుండి పత్లావత్ గత్య నాయక్, బీఎల్‌పీ అభ్యర్థి మాదార వెంకటయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు.
చేవెళ్ల: చేవెళ్లలో నాలుగు నామినేషన్లు దఖాలైన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంత్ రెడ్డి తెలిపారు. శనివారం టీఅర్‌ఎస్ అభ్యర్థిగా కాలే యాదయ్య, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా పామెన భీంభరత్, సదాలక్ష్మీ, జయ్‌స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా నర్సింలు నామిపేషన్లు వేసినట్లు వివరించారు.
రాజేంద్రనగర్: నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ఉండడంతో శనివారం సుమారు తొమ్మిది నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. సోమవారం చివరి రోజు, ఆదివారం సెలవు, శనివారం మంచిరోజు కావడంతో దాదాపు అందరూ తమ నామినేషన్లను శనివారం దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం శాసన సభ స్థానానికి శనివారం మరో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. మహాకూటమి భాగస్వామ్య పక్షం టీడీపీ నుండి సామ రంగారెడ్డి, కాంగ్రెస్ తరుపున డీసీసీ అధ్యక్షులు క్యామ మల్లేశ్, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్రం పాపిరెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీ.బాలచందర్ నామినేషన్లు దాఖలు చేశారు. మహాకూటమి నుండి టీడీపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డికి ఇప్పటికే టికెట్ ఖరారయిన విషయం తెలిసిందే. అనుచరులు నామినేషన్‌ను దాఖలు చేశారు. నామినేషన్లకు మరో రెండు రోజుల గడువు ఉన్నప్పటికి శనివారంతో మొత్తం 15 నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమరేందర్ తెలిపారు.
మెహిదీపట్నం: నాంపల్లి నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం సందడిగా నెలకొంది. నామినేషన్ల పర్వం దగ్గర పడటంతో ఒక్క శనివారం రోజున పోటా పోటీగా ఏడుగురు నామినేషన్లును దాఖలు చేశారు. శనివారం ఉదయం బీజేపీ అభ్యర్ధిగా దేవర కరుణాకర్ రెండు సెట్ల నామినేషన్లు అందజేశారని రిటర్నింగ్ అధికారిని అనురాధ తెలిపారు. ఎంఐఎం పార్టీకి చెందిన జాఫర్ హుసెన్ మూడు సెట్ల, టీఆర్‌ఎస్‌కు చెందిన ఎం.అనంద్‌గౌడ్ రెండుసెట్లను, ఎంఎంఎస్‌పీ పార్టీ నుంచి మహ్మాద్ అబ్దుల్ ఖాదీర్, కాంగ్రెస్ నుంచి బీ.మనోహార్, ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా గోపాల్ సాయిబాబా, మహ్మాద్ ఇమ్రాన్ నామినేషన్లు శనివారం ఏడుగురు అభ్యర్ధులు 11సెట్లను అందజేశారని రీటర్నింగ్ అధికారిని అనురాధ పేర్కొన్నారు. నామినేషన్లు చివరి రోజున సోమవారం అధిక సంఖ్యలో వస్తాయని తెలిపారు. నామినేషన్లు పర్వంతో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. బీజేపీ పార్టీనుంచి దేవర కరుణాకర్ నామినేషన్ వేసే సమయంలో మాజీ మంత్రి దత్తాత్రేయ కూడా ఉన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ: కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి శనివారం నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని టీడీపీ తరఫున నామినేషన్‌ను వేశారు. కూకట్‌పల్లి రిటర్నింగ్ అధికారి మమతకు సినీహీరో బాలకృష్ణతో కలిసి సుహాసిని నామినేషన్ పత్రాన్ని అందజేశారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి పన్నాల హరీష్ చంద్రారెడ్డి, బీజేపీ నుంచి మాధవరం కాంతారావు, మాధవరం మమత, న్యూ ఇండియా పార్టీ నుంచి పెద్ది అనిల్‌కుమార్, శివసేన నుంచి కృష్ణ మోహన్, తెలంగాణ ప్రజల పార్టీ నుంచి బానోతతు లింగ్యా నాయక్ నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థులుగా ఎం.ప్రభాకర్ ముదిరాజ్, కట్ట మోహనవీర బ్రహ్మానంద కుమార్, చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.
ఉప్పల్: నామినేషన్ల పర్వంలో భాగంగా శనివారం ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే.కృష్ణ కిషోర్‌కు అందజేశారు. బీజేపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్.ప్రభాకర్ ఉదయం రామంతాపూర్ ఇందిరానగర్‌లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం ఆచరించి స్వామి పరిపూర్ణానంద, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎడ్ల పరమేశ్, నేషలిస్టు కాంగ్రెస్ నుంచి బీ.విజయ్ కుమార్, యూసీసీఆర్‌ఐ (ఎంఎల్) నుంచి కాసుల నర్సింహ గౌడ్, ప్రేమ్ జనతా దల్ పార్టీ నుంచి నిరంజన్ పోలే, రైతు రాజ్యం పార్టీ నుంచి వీఆర్ శ్రీనివాస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ నుంచి వాకిటి రఘునందన్ రెడ్డి, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ముత్తిలింగం, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి కృష్ణ, స్వంత్ర అభ్యిర్థులుగా ఎం.జగదీష్, సీలోజు శివ కుమార్, ఎరుకల నవీన్ గౌడ్, మహేందర్ కుమార్, భారత సుదర్శన్ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను అందజేశారు.