రంగారెడ్డి

వీరేందర్‌ను గెలిపించాలని భార్య దివ్యశ్రీ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 18: భర్త వీరేందర్ గౌడ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ భార్య దివ్యశ్రీ ఆదివారం ఉప్పల్ డివిజన్‌లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. మాల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దివ్యశ్రీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు తిక్క ప్రకాష్, మహిళా ప్రతినిధులు మాచర్ల ప్రతిభ, మంజుల, సత్తమ్మ, విజయలక్ష్మి, లక్ష్మణ్, ప్రమోద్, సాయి, కృష్ణ, వేణు, సత్యనారాయణ వందలాది మందితో డివిజన్‌లోని కుమ్మరి బస్తీ, చాకలిబస్తీ, అన్నపూర్ణకాలనీ, భరత్‌నగర్, శాంతినగర్, గాంధీనగర్, పాతబస్తీలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మామ దేవేందర్ గౌడ్ చేసిన అభివృద్ధి ఇప్పటికీ కళ్ల ముందు కన్పిస్తుందని, మరింత అభివృద్ధి కోసం వీరేందర్ గౌడ్‌ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. చిల్కానగర్ డివిజన్‌లోని మహిళా సమాఖ్య సభ్యులు ధనమ్మ, ప్రశాంతి, చంద్రకళ, సుజాత, ఉమ, ఆండాలు, జనమ్మ వంద మంది డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పబ్బతి శేఖర్ రెడ్డి, కోల రవి ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి వీరేందర్ గౌడ్ సమక్షంలో టీడీపీలో చేరారు.
మహాకుటమిదే విజయం
నాచారం: ఉప్పల్ నియోజకవర్గంలో మహాకుటమే విజయం సాధిస్తుందని ఆభ్యర్థి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. నాచారం డివిజన్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాకుటమి నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మహ్మాద్ జానీలతో ఏన్నికల ప్రచారంపై సమావేశం నిర్వహించారు. మహాకుటమి నాయకులు విలేఖర్లతో మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం హాయంలో జరిగిన ఆభివృద్ధి తప్ప బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఎలాంటి ఆభివృద్ధి చేయలేదని ఆవేద వ్యక్తం చేశారు. ఉప్పల్‌లో ఆభివృద్ధి జరగాలంటే మహాకుటమి ఆభ్యర్ధిని గెలిపించాలని మహాకుటమి నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు సమష్టిగా ఏన్నికల్లో ప్రచారం నిర్వహించి విజయని కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీజీకే ముర్తి, అశోక్ కుమార్ గౌడ్, రాగిరి మెహన్ రెడ్డి, రామకృష్ణ, శ్రీరాం సత్యనారాయణ, రాంబాబు, రాజేష్ కుమార్, ఆశ్రు, రాజేష్, మణికంఠ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియశీలకంగా ఉద్యమం చేసిన ఉద్యమ నాయకుడు మణికఠ టీడీపీలో వీరేందర్ గౌడ్ సమక్షంలో చేరారు. మణికంఠ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియశీలకంగా ఉద్యమం చేసిన నాయకులను టీఆర్‌ఎస్ ఆభ్యర్థి సుభాష్ రెడ్డి తీవ్ర అవమానలకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యాంతమైయారు.