రంగారెడ్డి

ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పని సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, మే 1: భూగర్బ జలాల పెంపునకు ఇంకుడు గుంతలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని వివేకానందనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాధవరం రామారావు అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో ఏర్పాటు చేయనున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి నిలవలను పెంచవచ్చన్నారు. ప్రతి ఒక ఇంటి యజమాని తప్పనిసరిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరారు. ఇంకుడు గుంతల ద్వారా భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తదన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చందు, క్రాంతి, హరి, సంతోష్, రాం, వికాస్, దుర్గాప్రసాద్, చంద్రకాంత్, శ్రీను పాల్గొన్నారు.

నేరాల అదుపునకు అధికారులతో సమీక్ష
గచ్చిబౌలి, మే 1: నేరాలు అదుపు చేయడంతోపాటు నేరగాళ్ల నయాపంథాను ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై సైబరాబాద్ పోలీసు కమిషనర్ అధికారులతో సమీక్షించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో సమీక్షా సమావేశం డిసిపిలనుంచి సిఐ పైస్థాయి అధికారులతో నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు, ప్రాపర్టీ క్రైమ్‌ని 32 శాతానికి తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతం అవలంబిస్తున్న పెట్రోలింగ్ విధానంలో ఏమైనా మార్పులు చేయాలనే విషయంపై సమాలోచన చేసారు. పెండింగ్‌లో వున్న నాన్‌బెయిలబుల్ వారెంట్‌కు సంబంధించిన నేరగాళ్ల వివరాలు సేకరించి వారిపై కనే్నసి వుంచాలని సూచించారు. 2016లో ప్రజల సహకారంతో ఏర్పాటు చేయాలనుకున్న కమ్యూనిటీ సిసి టివి ప్రాజెక్టును వేగవంతం చేయాలని అన్నారు. 10వేల సిసి కెమెరాలు కమిషనరేట్ పరిధిలో లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందులో ప్రభుత్వం 2వేలు ఇచ్చేందుకు సిద్ధంగా వుందని సిపి గుర్తుచేసారు. ప్రజల భాగస్వామ్యం తీసుకుని కమ్యూనిటీ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. శాంతి భద్రతలు, నేరాలు, విఐపిల బందోబస్తులపై కూలంకషంగా చర్చించారు. సిటీ పోలీసు యాక్టును పకడ్బందీగా అమలుచేస్తూ మహిళలను వేధించి న్యూసెన్స్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని, అలాంటివారిపై పెట్టీ కేసులు నమోదు చేయాలని సిపి సూచించారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ఎస్‌హెచ్, ఎస్‌ఐలు ప్రజలతో కలిసి పనిచేయాలని ఆయా సెక్టార్లపై పూర్తిస్థాయి అవగాహన సంబంధిత అధికారికి వుండాలని సిపి సూచించారు. సూచనలివ్వడంతోపాటు అధికారులనుంచి సలహాలు తీసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ సిపి శశిధర్‌రెడ్డి, డిసిపిలు ఎ.ఆర్.శ్రీనివాస్, అవినాష్‌మొహంతి, నవీన్‌కుమార్, అడిషనల్ డిసిపిలు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

చెట్టుకు కట్టేసి, ఉరిబిగించి దారుణ హత్య
పోచారం గ్రామంలో
కలకలం
ఇబ్రహీంపట్నం, మే 1: చెట్టుకు కట్టేసి, ఆపై ఉరి బిగించి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక సిఐ జగదీశ్వర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పోచారం గ్రామానికి చెందిన కాసుల శంకరయ్య కుమారుడు కాసుల యాదయ్య (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం మానుకొని లారీ డ్రైవర్‌గా పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో శనివారం రాత్రి లారీపై వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళాడు. అయితే ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలంలో తాళ్ళతో చెట్టుకు శవమై తేలాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాసుల యాదయ్యను చెట్టుకు తాళ్ళతో కట్టేసి, ఉరిబిగించి అతికిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీంతో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సమీప బంధువు, తెలిసిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు సిఐ జగదీశ్వర్, ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
కార్మిక శక్తితోనే దేశాభివృద్ధి

జీడిమెట్ల, మే 1: కార్మిక, శ్రామిక సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. ఆదివారం రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్‌లోని యూరోప్లెక్స్ ట్రాన్స్‌మిషన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జెండాను ఆవిష్కరించారు. జీడిమెట్లలోని ఈస్ట్‌కోస్ట్ పరిశ్రమలో, ఖాజిపల్లిలోని అపెక్స్ లిమిటెడ్‌లో, గుమ్మడిదలలోని ఫ్లెమింగ్ ల్యాబ్స్‌లో, బాలానగర్‌లోని ఎంటిఎఆర్ టెక్నాలజీ తదితర పరిశ్రమలలో టిఆర్‌ఎస్‌కెవి జెండాలను వివేక్ ఎగురవేశారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణలో భాగంగా కార్మిక, శ్రామిక వర్గాలకు అనేక ప్రయోజనాలు అందిస్తున్నారని అన్నారు. కార్మికరంగ లబ్ధిదారులుగా నమోదు చేసుకున్న, చేసుకోని కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పారు. ప్రమాద బీమా రూ.5 లక్షలు ఉచిత ప్రమాద బీమా వర్తింపజేస్తున్నారని తెలిపారు. కార్మికుల పక్షాన నిరంతరం తాను ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంజనేయరెడ్డి, శ్రీకాంత్, విజయ్‌కుమార్, రెడ్డి, ఎవి మోహన్‌రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా: కెఎం ప్రతాప్
కార్మికుల సమస్యలను తాను ముందుండి పరిష్కరిస్తానని రాష్ట్ర టిఆర్‌ఎస్ నేత కెఎం ప్రతాప్ అన్నారు. కుత్బుల్లాపూర్‌లోని హెచ్‌ఎంటి మేచైన్ టూల్స్ పరిశ్రమలో, అన్నపూర్ణ కెన్‌మోర్, స్టార్ట్ కోర్ట్ ఎంటర్‌ప్రైజెస్, నెస్కేస్ ల్యాబ్స్, కార్తికేయ కెమికల్స్, కొపెల్లి ఫార్మా, థర్మల్ సిస్టమ్స్ పరిశ్రమలలో మేడే సందర్భంగా ప్రతాప్ యూనియన్ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానని తెలిపారు. కార్మికులకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కాటయ్యగౌడ్, సత్యనారాయణ, వెంకటస్వామి, ఓంప్రకాశ్, పార్వతి, శాంతారావు, భూపాల్‌రెడ్డి, గాంధీ, వీరస్వామి, ఏడుకొండలు పాల్గొన్నారు.
ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ర్యాలీ..
ప్రపంచ కార్మికుల 130వ మేడే దినోత్సవం సందర్భంగా జీడిమెట్లలో ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షాపూర్‌నగర్ రైతు బజార్ నుండి ఉషోదయ టవర్స్ వరకు కార్మిక ప్రదర్శన జరిగింది. ఐఎఫ్‌టియు పారిశ్రామిక నార్త్ జోన్ అధ్యక్షుడు వి.ప్రవీణ్ మాట్లాడుతూ కార్మికులంతా ఏకమై పోరాడాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ కార్మిక చట్టాలను సవరణ చేస్తూ కార్మిక ద్రోహానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలను ఆపేది లేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సిరెడ్డి, నర్సింహులు, భీమయ్య, భాస్కర్, మల్లయ్య, సహదేవ్, గోపి, తానాజిరావు, పిడిఎస్‌యూ నాయకులు పాల్గొన్నారు. నిజాంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శెనిగల ప్రమీల జెండాను ఎగురవేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఎఐటియుసి ఏసురత్నం, యాదగిరి, బాలకృష్ణ పాల్గొన్నారు.

పాడి పశువుల బీమా
రైతులకు ధీమా
మర్పల్లి, మే 1: ఒకప్పుడు గ్రామాలలో పాడి పశువుల పెంపకంవల్ల పాలు పెరుగు నెయ్యి ఏ ఇంట్లో చూసినా వుండేవి. వ్యవసాయంలో నష్టాలతో రైతులు పాడి పశువుల పెంపకంపట్ల ఆసక్తి చూపకపోవడం, ప్రభుత్వం పశువులకు బీమా కల్పించకపోవడంతో పశువులు అనారోగ్యాల పాలవడం అకస్మాత్తుగా మరణిస్తే బీమా లేక రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. కాని తెలంగాణ ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని పునరుద్ధరించినందున రైతులు పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు.
పశువుల బీమా పథకంలో పశువు (ఆవు/ గేదె) విలువను బట్టి ప్రీమియం చెల్లించే అవకాశం వుంది. ఇందులోనూ సంవత్సరానికి, మూడేళ్లకు ప్రీమియం చెల్లించవచ్చు. గేదె విలువ రూ.10వేలుంటే రైతు వాటా కింద సం.నికి 203, మూడేళ్లకు 456రూ.లు రైతులు చెల్లించాలి. పదివేల నుంచి అరవై వేల విలువగల పశువులకు ఇదే నిష్పత్తిలో బీమా ప్రీమియం చెల్లించవచ్చు.ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పశువుల బీమా పథకంలో రైతులకూ బీమా రక్షణ కల్పించనున్నారు. పశువులకు చెల్లించిన ప్రీమియంకు అదనంగా రైతులు సం.నికి 20రూ.లు, మూడేళ్లకు రూ.50 చెల్లిస్తే లక్ష వరకు ప్రమాద బీమా వర్తిస్తుంది.ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తుంది. రైతులు పశువులకు బీమా ప్రీమియం చెల్లిస్తే ఆ పశువుల చెవులకు పాలసీ నెంబర్‌తో కూడిన ఒక ట్యాగ్‌ను వేసి ఫొటో తీసి ప్రీమియం వివరాలను పశుసంవర్ధక శాఖ అధికారులకిస్తే ఆన్‌లైన్‌లో పొందుపరచి పశువు అనారోగ్యంతో, ప్రమాదవశాత్తు మరణిస్తే దాని ఫొటోను ఆన్‌లైన్‌లో పొందుపరచి బీమా డబ్బులు చెల్లిస్తారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.