రంగారెడ్డి

ప్రకాష్‌గౌడ్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 11: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందిన ప్రకాష్‌గౌడ్‌కు సుదీర్ఘకాలం అనుబంధం ఉందని చెప్పవచ్చు. రాజేంద్రనగర్ సర్కిల్ టీడీపీ అధ్యక్షునిగా ప్రకాష్ గౌడ్ మొదట బాధ్యతలను నిర్వహించారు.
నియోజకవర్గంలో మొదట టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ, ఎం ఐ ఎంల మధ్య పోటాపోటీ ఎన్నిక ఉంటుందని భావించినప్పటికీ ఎన్నిక వన్‌సైడ్ కావడం గమనార్హం. ప్రజలు ప్రకాష్‌గౌడ్ నాయకత్వంపై నమ్మకంతో ఓటు వేసి ప్రకాష్‌గౌడ్ నాయకత్వాన్ని బలపరిచారు. టీఆర్‌ఎస్ కనుచూపు మేరలో ఏ పార్టీ కనిపించలేదు.
మొదటి రౌండ్ నుంచి సత్తా చాటిన ప్రకాష్‌గౌడ్
రాజేంద్రనగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మొదటి రౌండ్ ఆయా పార్టీల నాయకులు గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు. కౌంటింగ్ మొదలైన మొదటి రౌండ్ నుంచి టీ ఆర్ ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపిన మైనార్టీలు
నియోజకవర్గంలో ఉన్న మైనార్టీలు ఎంఐఎం వైపు మొగ్గు చూపుతారని ఊహించినప్పటికీ ఊహకందని విధంగా మైనార్టీలు టీఆర్‌ఎస్ నాయకత్వంపై మొగ్గు చూపారు. ఓట్ల లెక్కింపులో మైనార్టీలు ఎక్కువగా టీఆర్‌ఎస్ బలపరిచినట్లు ఓటింగ్ సరళి తెలుపుతుంది.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు మహాకూటమి టీడీపీ అభ్యర్థి గణేష్‌గుప్త ప్రకాష్‌గౌడ్‌కు పోటీనిచ్చారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మజ్లీస్ పోటీనిస్తుందని భావించినప్పటికీ టీఆర్‌ఎస్‌కు మహాకూటమి పోటీనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
విజేత కౌసర్
మెహిదీపట్నం, డిసెంబర్ 11: కార్వాన్ నియోజకవర్గంలో భారీ మెజారీటితో మళ్లీ మజ్లీస్ అభ్యర్థి గెలుపొందారు. నియోజకవర్గంలో కౌటింగ్ ప్రశాంతమైన వాతావారణంలో కొనసాగింది. కార్వాన్ నియోజకవర్గం మజ్లీస్‌కు కంచుకోటగా మారింది. మళ్లీ ఐదవసారిగా 49,692 ఓట్లు భారీ మెజార్టీతో కౌసర్ మొహినుద్దిన్ గెలుపొందారు. టీఆర్‌ఎస్ జీవన్‌సింగ్‌కు 23,630 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ బిన్ మహ్మాద్ అలీ హజారేకు 10,817 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి 35,709 ఓట్లు రాగా, ఎంఐఎం అభ్యర్థి కౌసర్ మోహినుద్దిన్‌కు 85,401 ఓట్లు పోలయ్యాయని ఆర్‌ఓ సూర్యలత తెలిపారు. నోటాకు 887 ఓట్లు పోలైయ్యాయి. చివరికి 49,692 ఓట్లు మెజార్టీతో మజ్లీస్ అభ్యర్థి గెలుపొందారు.
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధేతో ప్రజలు భారీ మెజారీటితో గెలిపించారని ఎంఐఎం అభ్యర్థి కౌసర్ మోహినుద్దిన్ అన్నారు. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విలేఖరులతో మాట్లాడారు. తనను గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.