రంగారెడ్డి

మళ్లీ గెలిచిన మాధవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 11: కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ భారీ విజయాన్ని సాధించింది. మహాకూటమి (టీడీపీ) ఎమ్మెల్యే అభ్యర్థి సుహాసినిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు 41,059 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి సుహాసిని గెలుపొందుతుందనే నమ్మకాన్ని టీఆర్‌ఎస్ పటాపంచలు చేసింది. ఒక్కసారిగా ఊహించని రీతిలో ప్రజలు తీర్పునివ్వడం అందరిని కలవరానికి గురిచేసింది. భారీ మెజారిటీతో గెలుపొందిన మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గం అభివృద్ధే గెలుపుకు మలుపు అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ గెలుపుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు ఉన్న నమ్మకమే తనను గెలిపించిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ముచేయకుండా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు.

కంటోనె్మంట్ విజేత సాయన్న
అల్వాల్, డిసెంబర్ 11: కంటోనె్మంట్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జి. సాయన్న తిరుగులేని విజయాన్ని సాధించారు. మంగళవారం జరిగిన ఓట్ల కౌంటింగ్‌లో మొదటి రౌండ్ నుండి అధిక్యం కనపర్చారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ 14 రౌండ్‌లో ఎక్కడ దరిదాపులో నిలువలేక పోయారు. సాయన్న 37237 ఓట్ల మెజారిటీతో గెలిచి కంటోనె్మంట్‌లో జండా ఎగురవేశారు. సీనియర్ నాయకుడైన జంపన ప్రతాప్ తెరాసని వీడి సర్వే సత్యనారాయణతో చేతులు కలిపి సర్వే గెలుపు భారం తనపైన వేసుకుని రాత్రింబవళ్ళు పనిచేశారు. ప్రతి క్షణం సాయన్నను వెంటాడుతూ కార్యకర్తలను మభ్య పెట్టి సర్వే వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా టిఆర్‌యస్‌లో ఉన్న కంటోనె్మంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ బానుక నర్మద, ఆమే భర్త భానుక మల్లిఖార్జున్, బాణాల శ్రీనివాస్ రెడ్డి, కంటోనె్మంట్ బోర్డు మాజీ సభ్యులు మధుకర్ ఆయన వైపు తిప్పుకున్నారు వారితోపాటు బిజెపి టికెట్ కోసం ప్రయత్నించిన జయప్రకాష్‌ను సైతం తనవైపు తిప్పుకున్నారు. ప్రజల మధ్య ఉండటం అందరినీ సౌమ్యంగా పలరించటం ఆయన నైజం ఆయనను తిరుగులేని నాయకునిగా నిలబెట్టింది. 2018లో ఐదవసారి గెలిచి తన సత్తా చాటుకున్నారు. సాయన్నకు 65093 ఓట్లు రాగా, సర్వే సత్యనారాయణకు 27856 ఓట్లు వచ్చాయి. సాయన్నకు 37237 ఓట్ల మెజారిటీ దక్కింది. బిజెపి నుండి పోటీ చేసిన నారాయణ్ శ్రీ గణేష్ కు 15302 ఓట్లు వచ్చాయి. మొత్తం 19 మంది పోటీ చెయ్యగా బియస్‌పి, బిఎల్‌ఎఫ్ లాంటి పార్టీలు వందల సంఖ్యలోనే ఓట్లు సాధించారు. నియోజక వర్గంలో 239781 ఓట్లుకాగ, 116384 ఓట్లు పోలైనాయి.