రంగారెడ్డి

పంటలు వేసే ముందు భూసార పరీక్షలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 2: పంటలు వేసుకునే ముందు రైతులు భాసార పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, తద్వారా భూసారాన్ని బట్టి విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన ఏర్పడుతుందని వ్యవసాయశాఖ అధికారిణి కవిత సూచించారు. సోమవారం మండల పరిధిలోని కొంగరకలాన్, మంగళ్‌పల్లి గ్రామాల్లో మన తెలంగాణ-మన వ్యవసాయం పేరిట రైతు అవగాహణ సదస్సును నిర్వహించారు. వ్యవసాయాధికారులు, శాస్తవ్రేత్తల సూచనలు తప్పకుండా పాటించాలని అన్నారు. మన ప్రాంతం పత్తి పంటకు అనుకూలం కానప్పటికి, పత్తి పంటను వేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పత్తి పంట సాగును తగ్గించుకొని ఇతర పంటల సాగుకు అధిక ప్రాథాన్యత ఇవ్వాలని సూచించారు. కరవు పరిస్థితుల దృష్ట్యా బిందు సేధ్యం, తుంపర్ల సేధ్యానికి ప్రాధాన్యతనిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు. ఉద్యానవనశాఖ అధికారిని కనకలక్ష్మి మాట్లాడుతూ నగరానికి ఇబ్రహీంపట్నం అతిసమీపంలో ఉన్నందున కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలను అధికంగా పండించినట్లయితే నేరుగా విక్రయించి అధికంగా లాభాలు గడించేందుకు అస్కారం ఉంటుందని అన్నారు.
రైతులు కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ప్రాథాన్యతనివ్వాలని సూచించారు. పశుసంవర్థకశాఖ అధికారి సురేష్‌బాబు మాట్లాడుతూ 50 శాతం రాయితీపై దాణాను సరఫరా చేస్తున్నామని, దీనిని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొంగరకలాన్, మంగళ్‌పల్లి గ్రామాల సర్పంచ్‌లు బంగారిగల్ల శేఖర్, కిల్‌కత్తి అశోక్‌గౌడ్, వ్యవసాయ అధికారులు వరప్రసాద్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, రఘు, కోటేశ్వరరావు, మత్స్యశాఖ అధికారి చంద్రయ్య పాల్గొన్నారు.