రంగారెడ్డి

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 17: ఉప్పల్ పట్టణంలో 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఐడీఏ లక్ష్మినారాయణ కాలనీ, దేవేందర్‌నగర్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ రాజు తెలిపారు.
అసౌకర్యానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
పేదలకు దుస్తుల పంపిణీ
ఉప్పల్, డిసెంబర్ 17: బోడుప్పల్ పట్టణంలోని సరస్వతి కాలనీలో రాపోలు సందీప్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాపోలు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సందీప్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ట్రస్టు చైర్మన్ రాపోలు సువర్ణ రాములు, కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, బొమ్మక్ రమేశ్‌లతో కలిసి పేదలకు ఉచితంగా బట్టలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా అనాథాశ్రమంలో చిన్నారులకు ఉచిత భోజనం, పండ్లు పంపిణీ, బియ్యం సరఫరా చేస్తున్నట్లు రాపోలు రాములు పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే సందీప్ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని సత్యనారాయణ పేర్కొన్నారు.
మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్‌వీ నేతల సంబరాలు
నేరేడ్‌మెట్, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించడంతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని టీఆర్‌ఎస్‌వీ మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ రామాచర్ల నర్సిములు పేర్కొన్నారు. సోమవారం కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. నర్సిములు మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని ప్రజలు తమ ఓటుతో తేల్చి చెప్పారని అన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ, ఎంపీ ఎన్నికలలో అన్ని సీట్లు తెరాసకే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్ధసారధి, మధుయాదవ్, సాయికిరణ్, రాజేష్, రాజశేఖర్, సాగర్, సామ్రాట్ పాల్గొన్నారు.
ఆర్టీసీ పరిరక్షణ అందరి బాధ్యత
* డీజీఎం జగన్ పిలుపు
ఉప్పల్, డిసెంబర్ 17: ఆర్టీసీ పరిరక్షణ అందరి బాధ్యత అని సంస్థ కుషాయిగూడ డివిజనల్ మేనేజర్ జగన్ పిలుపునిచ్చారు. సోమవారం చెంగిచర్ల చౌరస్తాలోని బస్టాప్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రయాణీకులతో కొద్దిసేపు మాట్లాడి బస్సులు సరిపోతున్నాయా, సమయానికి వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సంస్థ ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేటు వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను కోరారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెంగిచర్ల డీఎం మల్లయ్య పాల్గొన్నారు.
కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మేడ్చల్, డిసెంబర్ 17: మేడ్చల్ మండల టీఆర్‌ఎస్‌కేవీ అనుబంధ (టీఏటీయూ) సంఘం ఆధ్వర్యంలో సోమవారం కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో పట్టణ ప్రధాన కూడళి అంబేద్కర్ విగ్రహాం వద్ద ఆటోవాలలు కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేటీఆర్ జిందాబాద్, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వర్ధిలాల్లంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డైనమిక్ నేత కేటీఆర్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్రానికి దేశానికి వనె్న తేవాలని వారు అకాంక్షించారు. కార్యక్రమంలో విజయ్ రావు, దేశ్‌మంత్ రావు, ఇస్మాయిల్, షఫీఖ్, వసంత్, బాబురావు, నరేశ్ పాల్గొన్నారు.
అంజయ్య యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి
కొత్తూరు, డిసెంబర్ 17: షాద్‌నగర్ శాసనసభ్యుడు అంజయ్య యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని కొత్తూరు ఎంపీటీసీ బీ.దేవేందర్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు ఏనుగు జనార్థన్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. షాద్‌నగర్ నుంచి రెండుసార్లు గెలుపొందిన అంజయ్య యాదవ్‌కు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి అవుతుందని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు మండలాల అభివృద్ధికి అంజయ్య యాదవ్ ఎంతో కృషి చేశారని, మున్ముందు మరింత అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. షాద్‌నగర్ చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధిని అంజయ్య యాదవ్ చేశారని అన్నారు.
ఓటర్ల జాబితాను మళ్లీ రూపొందించాలి
మెహిదీపట్నం, డిసెంబర్ 17: పార్లమెంట్, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్ల జాబితాను మళ్లీ రూపొందించాలని రైయిన్ బో గ్రూప్ ఆఫ్ హోటల్స్, స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మహ్మద్ అన్వర్ డిమాండ్ చేశారు. సోమవారం రెయిన్‌బోగ్రూప్ ఇంటర్నేషనల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 22లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఓటర్ల జాబితాను మళ్లీ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో అనేకమంది ఓటు హక్కును వినియోగించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల పేర్లను వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో నమోదు చేశారని గుర్తుచేశారు. మూడు గంటలపాటు ఓటు వేయడానికి లైన్‌లో నిల్చుంటే చివరికి ఓటర్ లిస్టులో పేరు లేక చాలామంది ఓటు వేయలేదని అన్నారు. ఎన్నికల అధికారులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బాసిత్ ఆరోపించారు. ఓటర్ లిస్టులో పేరు లేక ఇబ్బందులు పడ్డామని ఆయన చెప్పారు. వెంటనే ఓటర్ కార్డులు ఇవ్వడానికి ఆదేశాలు జారీచేయాలని డిమాండ్ చేశారు. ఎంఏ ఖుద్దూస్ మహ్మాద్ జాఫర్ ఖాన్, మహ్మాద్ మోసిన్ మూనవర్ అలీ పాల్కొన్నారు.
పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి కృషి
* ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
ఉప్పల్, డిసెంబర్ 17: పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలూ కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఉప్పల్ పారిశ్రామికవాడలో ఇండస్ట్రీయల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌వీ సుధీర్ ఆధ్వర్యంలో బేతి సుభాష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పారిశ్రామిక వాడలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. స్వయం ఉపాధి రంగాల్లో యువతీ, యువకులు రాణించడానికి అవసరమైన సహాయ సహకారం అందిస్తానని తెలిపారు. ఐలా కమిషనర్ సురేష్, పారిశ్రామికవేత్తలు శేషగిరిరావు, ఎల్‌వీ రెడ్డి, మహీపాల్ రెడ్డి, వెంకన్న, డీకే జైన్, కృష్ణ చంద్ర, సత్యనారాయణ, జీ.సురేష్ పాల్గొని ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి అభినందించారు.
రైతులకు అందుబాటులో గడ్డి విత్తనాలు
కొందుర్గు, డిసెంబర్ 17: అన్నదాతలకు అందుబాటులో గడ్డి విత్తనాలు ఉన్నాయని కొందుర్గు పశుసంవర్థక శాఖ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాలకు మొత్తం 10టన్నుల గడ్డి విత్తనాలు వచ్చాయని, పట్టాదారు పాస్‌పుస్తకం కలిగిన ప్రతి రైతుకు ఇస్తామని వివరించారు. ప్రతి రైతుకు 20కిలోల వరకు గడ్డి విత్తనాలు సరఫరా చేస్తామని, ప్రతి ఐదు కిలోల బ్యాగుకు రూ.50చొప్పున రైతులు చెల్లించాలని సూచించారు. గడ్డి విత్తనాలు అవసరం ఉన్న అన్నదాతలు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీలను కొందుర్గు పశుసంవర్థక శాఖ కార్యాలయంలో అందజేయాలని అన్నారు. వెంటనే అన్నదాతలకు గడ్డి విత్తనాలు సరఫరా చేస్తామని, ఈ విషయాన్ని అన్ని గ్రామాల రైతులు గమనించారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పశువులు కలిగిన ప్రతి రైతులు గడ్డి విత్తనాలు నాటుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లేనిపక్షంలో పశుగ్రాసం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, రైతులు ముందు జాగ్రత్త పడాలని సూచించారు.