రంగారెడ్డి

తొలివిడత పంచాయతీ ‘పోరు’లో విజేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 21: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్, కొత్తూరు, నందిగామ కేశంపేట, కొందుర్గు, జిల్లెడ్ చౌదరిగూడ మండలాల్లో సోమవారం పంచాయతీ ఎన్నికలకు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి మొదలైన ఓట్ల లెక్కింపుతో గెలుపు గుర్రాలు విజయ సంబరాల్లో మునిగిపోయారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపుతో ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపొందిన అభ్యర్థులు విజయ సంబరాల్లో మునిగిపోయారు.
ఫరూనగర్ మండలంలో...
ఫరూఖ్‌నగర్ మండలంలోని చౌడమ్మగుట్ట తండా, దేవునిబండ తండా, దొంతికుంట తండా, గిరాయిగుట్ట తండా, కడియాల కుంట తండా, కుందేల్ కుంట తండా, మెల్లగూడ గ్రామ సర్పంచ్‌గా రవినాయక్, మొండొనిరాయి తండా, పుల్చెర్లకుంట తండా, వెంకమ్మగూడ , భీమారం సర్పంచ్‌గా రామునాయక్, ఉప్పరిగడ్డ, నాగులపల్లి, బూర్గుల సర్పంచ్‌గా అరుణ, గంట్లవెల్లి సర్పంచ్‌గా యాదయ్య, చింతగూడ సర్పంచ్‌గా కల్పన, కమ్మదనం సర్పంచ్‌గా నర్సింహా, రాయికల్ సర్పంచ్‌గా కృష్ణయ్య, రంగంపల్లి, అయ్యవారిపల్లి సర్పంచ్‌గా లక్ష్మీరమేష్, హాజిపల్లి వౌనిక మచ్చేందర్, రాసుమల్లగూడ దొడ్డి మాధవి, కాశిరెడ్డిగూడ, మొగిలిగిద్ద సర్పంచ్‌గా లలితా అంజయ్య, ఎలికట్ట, ఎల్లంపల్లి, అన్నారం సర్పంచ్‌గా రాములుగౌడ్, మధురాపూర్ సర్పంచ్‌గా శివారెడ్డి, చించోడ్, విఠ్యాల జయశ్రీ శేఖర్, రామేశ్వరం సర్పంచ్‌గా సంపత్‌కుమార్, కిషన్‌నగర్, దూసకల్, బుచ్చిగూడ సులోచనారెడ్డి, చిల్కమర్రి, చిన్న చిల్కమర్రి సర్పంచ్‌గా పల్లె శ్రీనివాస్‌రెడ్డి, దేవునిపల్లి సర్పంచ్‌గా చేగూరి రాఘవేందర్‌గౌడ్, కంసాన్‌పల్లి, లింగారెడ్డిగూడ, కొండన్నగూడ, వెంకట్‌రెడ్డిపల్లి, కందివనం, వెల్‌జర్ల సర్పంచ్‌గా అమృతమ్మ నర్సింహారెడ్డి, నేరేళ్లచెరువు, శేరిగూడ గ్రామ సర్పంచ్‌గా ప్రశాంతి రెడ్డి గెలుపొందారు.
కొత్తూరు మండల పరిధిలోని ఎనుగుల మడుగు తండా, ఇన్ముల్‌నర్వ సర్పంచ్‌గా అజయ్ మిట్టునాయక్, తీగాపూర్ సర్పంచ్‌గా రమాదేవి, గూడూరు సర్పంచ్‌గా సత్తయ్య, మల్లాపూర్ సర్పంచ్‌గా సాయిలు, శేరిగూడ భద్రాయపల్లి సర్పంచ్‌గా ప్రభాకర్, సిద్ధాపూర్ సర్పంచ్‌గా తులసమ్మ, మక్తగూడ సర్పంచ్‌గా కాట్న రాజు, కొడిచర్ల సర్పంచ్‌గా వెంకట్‌రెడ్డి, నందిగామ మండల పరిధిలోని నందిగామ సర్పంచ్‌గా జిల్లెల వెంకట్‌రెడ్డి, చాకలిదానిగుట్ట తండా సర్పంచ్‌గా రాజునాయక్, మొత్కులగూడ సర్పంచ్‌గా వానరాసి ఎల్లమ్మ, ఈదులపల్లి సర్పంచ్‌గా బాలస్వామి, మామిడిపల్లి సర్పంచ్‌గా గడ్డం కవిత, బుగ్గోనిగూడ సర్పంచ్‌గా బండి నీలమ్మ, వెంకమ్మగూడ, నర్సప్పగూడ సర్పంచ్‌గా అశోక్, రంగాపూర్ సర్పంచ్‌గా ఎజి రమేష్, మేకగూడ సర్పంచ్‌గా పాండురంగారెడ్డి, నందిగామ, వీర్లపల్లి సర్పంచ్‌గా రాములమ్మ, అప్పారెడ్డిగూడ సర్పంచ్‌గా జెకె నర్సింలు, మొదళ్లగూడ సర్పంచ్‌గా ఎన్.ఉమారెడ్డి, శ్రీనివాసులగూడ సర్పంచ్ చంద్రారెడ్డి, తాళ్లగూడ సర్పంచ్‌గా అనిత, చేగూరు సర్పంచ్‌గా సంతోషలుగా గెలుపొందారు.
కేశంపేట మండల పరిధిలోని పుట్టవానిగూడ సర్పంచ్‌గా జగన్ నాయక్, తూర్పుగడ్డ తండా సర్పంచ్‌గా లలిత, పోల్కోనిగుట్ట తండా సర్పంచ్‌గా ఎం.శశికళ, దేవునిగుడి తండా సర్పంచ్‌గా శంకర్‌నాయక్, సంగెం సర్పంచ్‌గా జంగయ్య, భైర్‌ఖాన్‌పల్లి సర్పంచ్‌గా కృష్ణయ్య, మంగళిగూడ సర్పంచ్‌గా ఇందిరమ్మ, పాటిగడ్డ సర్పంచ్‌గా మిథాలి, కోనాయపల్లి సర్పంచ్‌గా బోయ మల్లేష్, చౌలపల్లి సర్పంచ్‌గా గూడ వీరేష్, అల్వాల్ సర్పంచ్‌గా టి.శ్రీలత, కొత్తపేట సర్పంచ్‌గా కె.నవీన్‌కుమార్, బోధునంపల్లి సర్పంచ్‌గా కమలమ్మ, పోమాల్‌పల్లి సర్పంచ్‌గా కృష్ణయ్య యాదవ్, సుందరాపురం సర్పంచ్‌గా రాములు నాయక్, నిర్దవెల్లి సర్పంచ్‌గా పార్వతమ్మ, తొమ్మిదిరేకుల సర్పంచ్‌గా సావిత్రి, లేమామిడి సర్పంచ్‌గా శ్రీశైలంగౌడ్, పాపిరెడ్డిగూడ సర్పంచ్‌గా టి.విష్ణువర్ధన్‌రెడ్డి, వేముల్‌నర్వ సర్పంచ్‌గా మంజుల మల్లేష్, కేశంపేట సర్పంచ్‌గా వెంకట్‌రెడ్డి, కొండారెడ్డిపల్లి సర్పంచ్‌గా పల్లె స్వాతి, ఇప్పలపల్లి సర్పంచ్‌గా ఆంజనేయులు, సంతాపూర్ సర్పంచ్‌గా అంజయ్య, లింగంధన సర్పంచ్‌గా మయూరి మధుగౌడ్, దత్తాయపల్లి సర్పంచ్‌గా అలివేలు, కాకునూరు సర్పంచ్‌గా లక్ష్మమ్మలు గెలుపొందారు.
కొందుర్గులో..
కొందుర్గు మండల పరిధిలోని అయోధ్యపూర్ తండా సర్పంచ్‌గా కెతావత్ బుడ్డిలక్ష్మీ, చెరుకుపల్లి సర్పంచ్‌గా కృష్ణవేణి, మహదేవ్‌పూర్ సర్పంచ్‌గా రాంచంద్రయ్య, రేగడిచిల్కమర్రి సర్పంచ్‌గా బుచ్చయ్య, ఉమ్మెంత్యాల సర్పంచ్ బ్యాగరి నర్సింలు, ఆగిరాల సర్పంచ్‌గా పుష్పమ్మ, పాత ఆగిరాల సర్పంచ్‌గా జంగం సంధ్య, బైరంపల్లి సర్పంచ్‌గా ఎర్ర ఆంజనేయులు, పులుసుమామిడి సర్పంచ్‌గా షరీఫా బేగం, గంగన్నగూడెం సర్పంచ్‌గా శశికళ శేఖర్, తంగళ్లపల్లి, వెంకిరాల సర్పంచ్‌గా లింగమయ్య, ముట్పూర్ సర్పంచ్‌గా నర్సింహ్మారెడ్డి, లాలాపేట సర్పంచ్‌గా జి.రాంరెడ్డి, కొందుర్గు సర్పంచ్‌గా అధిలక్ష్మీ, చిన్న ఎల్కిచర్ల సర్పంచ్‌గా సంధ్యరాణి, పర్వతాపూర్ సర్పంచ్‌గా దర్గా సరస్వతి, శ్రీరంగాపూర్ సర్పంచ్‌గా అరుంధతి రమేష్‌రెడ్డి, టేకులపల్లి సర్పంచ్‌గా పవిత్రదేవి, ఉత్తరాసిపల్లి సర్పంచ్‌గా జహారబీ, విశ్వనాథ్‌పూర్ సర్పంచ్‌గా శ్రీ్ధర్‌రెడ్డిలు గెలుపొందారు. జిల్లెడ్ చౌదరిగూడ మండల పరిధిలోని చిన్న చింతకుంట తండా, ధర్మ్యాతండా, వాచ్చ్య తండా, పద్మారం, తుమ్మలపల్లి, తూంపల్లి సర్పంచ్‌గా దేపల్లి సంతోష్, ఎదిర సర్పంచ్‌గా బాలరాజు, గాలిగూడ సర్పంచ్ పి.యాదయ్య, లచ్చంపేట సర్పంచ్‌గా బాలమణి, వీరన్నపేట్ సర్పంచ్‌గా సలీం, చౌదరిగూడెం, పీర్జాపూర్ సర్పంచ్‌గా ఆకుల సత్యమ్మ, జాకారం, కాస్లాబాద్, ముష్టిపల్లి, చేగిరెడ్డిఘనపూర్ సర్పంచ్ శివవౌళి, వీరన్నపల్లి, గుంజల్‌పహడ్, గుర్రంపల్లి సర్పంచ్‌గా పెద్దకుర్వ కిష్టమ్మ, ఎల్కగూడ, జిల్లెడ్, ఇంద్రానగర్ సర్పంచ్‌గా మహబూబీ, రావిర్యాల సర్పంచ్‌గా గెలుపొందారు.
కొడంగల్: కొడంగల్ మండలంలో సోమవారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మేజారిటి స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. భవనమ్మ తాండ సర్పంచ్ అభ్యర్థిగా గోవింద్ నాయక్, బోయపల్లి తాండ పార్థిబాయి, సంగాయిపల్లి పద్మమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 23 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరుగగా టీఆర్‌ఎస్ బలపర్చిన రావులపల్లిలో రమేష్ రెడ్డి, ఫ్యాలమద్ది గఫరున్నీసా బేగం, పోచమ్మకుంట తాండ శంకర్‌నాయక్, పలుగురాళ్ల తాండ దీప, చిన్న నందిగామ సావిత్రమ్మ, నాగారం నర్సింలు, స్వాతి, ఖాజాహైమాద్‌పల్లి అంజప్ప, లక్ష్మిపల్లి భీమమ్మ, పాటుమీదిపల్లి బాలమణి, ఆలేడ్ విజయలక్ష్మి, అప్పాయిపల్లి గీతా ఠాకూర్, టేకుల్‌కోడ్ గుండప్ప, కస్తూర్‌పల్లి శిరిషా గౌడ్, చిట్లపల్లి వెంకట్ రెడ్డి, రుద్రారం పట్లోళ్ల వెంకట్‌లక్ష్మి, పర్సాపూర్ సయ్యద్ అంజాద్ విజయకేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ బలపర్చిన హూసేన్‌పూర్ అనంతమ్మ, పెద్దనందిగామ శారదమ్మ, ఇందనూర్ బాల్‌రెడ్డి గెలుపోందారు. టీఆర్‌ఎస్ రెబల్‌గా అన్నారం సర్పంచ్ అభ్యర్థిగా అనిత 52 ఓట్ల మేజారిటీతో గెలుపోందడం జరిగింది. అంగడి రాయిచూర్, హస్నాబాద్ గ్రామాల ఫలితాలు కొనసాగుతున్నాయి.

గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తా
రాళ్ళ చిట్టంపల్లి సర్పంచ్ అభ్యర్థి ఫర్హానా బేగం
వికారాబాద్, జనవరి 21: గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికపుడు సమస్యలు పరిష్కరిస్తానని రాళ్ళ చిట్టంపల్లి సర్పంచ్ అభ్యర్థి ఫర్హాన బేగం అన్నారు. సోమవారం గ్రామంలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పాడైన రోడ్లను బాగు చేయిస్తామని, మురికినీటి కాలువలు నిర్మిస్తామని, వీధి దీపాలు వేయిస్తామని గ్రామానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

తాండూరులో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
* 82 శాతం పోలింగ్
తాండూరు, జనవరి 21: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా సోమవారం తాండూరు డివిజన్‌లోని ఏడు మండలాల పరిధిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. డివిజన్‌లోని 249 గ్రామ పంచాయతీలకు గాను, 39 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, సుమారు 200 వందలకు పైగా వార్డుల మెంబర్లు ఏకగ్రీవంగా నిలిచారు. సోమవారం నాటి పోలింగ్ సందర్భంగా మిగతా గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు ఎన్నికల పోలింగ్ జరిగింది. తాండూరు డివిజన్ పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఆర్.వై.వేణుమాధవరావు సమాచారం మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సమయానికి 82 శాతం పోలీంగ్ నమోదైనట్లు సాయంత్రం వెల్లడించారు. డివిజన్‌లోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ ప్రశాంతంగా కొనసాగినట్లు ఎన్నికల అధికారి వేణుమాధవ రావు పునరుద్గాటించారు.
శామీర్‌పేటలో మొదటి విడత సర్పంచ్‌ల ఎన్నిక
శామీర్‌పేట, జనవరి 21: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా శామీర్‌పేట మండలంలో సోమవారం 22 గ్రామపంచాయతీలకు గాను మూడు పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్నారు. సోమవారం ఎన్నికలు నిర్వహించగా వివిధ గ్రామాల వారీగా సర్పంచులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అద్రాస్ పల్లి గ్రామ సర్పంచ్‌గా బోయిని లత, అలియాబాద్ సర్పంచ్‌గా గురుక కుమార్, అనంతారం: మెరుగు నర్సింహ్మరెడ్డి, బాబాగూడ: మెడీ లత, బొమ్మరాశిపేట: మొలుగు గీతారాణి, జగన్‌గూడ: చందుపట్ల విష్ణువర్థన్‌రెడ్డి, కేశవరం: ఉడుతల జ్యోతి, కొల్తూర్: నల్లా శిల్ప, లక్ష్మాపూర్: సింగం ఆంజనేయులు, లింగాపూర్ తాండా: ధీరావత్ గోపి, మజీద్‌పూర్: సరసం మోహన్‌రెడ్డి, మూడు చింతలపల్లి: జాము రవి, మురహరిపల్లి: ధారా భాస్కర్, నాగిశెట్టిపల్లి: మొగుళ్ల కృపాకర్ రెడ్డి, నారాయణపూర్: ఉప్పరి రామచంద్రయ్య, పొన్నాల్: బి. సుకన్య, పోతారం: వంగా హరిమోహన్‌రెడ్డి, తుర్కపల్లి: జీడిపల్లి కవిత, ఉద్దమర్రి: యాంజాల అనురాథ, యాడారం: యంజాల సుజాతలను ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. లాల్‌గడి మల్కపేట, శామీర్‌పేట గ్రామ పంచాయితీ అభ్యర్థులను ఎన్నికల ఓట్లు లెక్కించడం వల్ల విజేతలైన అభ్యర్థులను ప్రకటించడం మరింత ఆలస్య కానున్నట్లు అధికారులు తెలిపారు.

సబ్‌జూనియర్ అథ్లెటిక్‌మీట్‌లో
రెయిన్‌బో విద్యార్థుల ప్రతిభ
జీడిమెట్ల, జనవరి 21: కొంపల్లిలోని సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్‌లో జరిగిన మేడ్చల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాన్యువల్ సబ్‌జూనియర్ అథ్లెటిక్స్‌మీట్‌లో చింతల్‌లోని రెయిన్‌బో స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబరించారు. అథ్లెటిక్ పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులైన పార్థసారధి, భార్గవ్, చరన్ సాయి, రఘు కార్తిక్, శ్రేణి, భరత్ భార్గవ్, ఆర్యన్‌గౌడ్ మెరిట్ సాధించి పథకాలు, ప్రశంసా పత్రాలను అందుకున్న సందర్భంగా పాఠశాల చైర్మన్ శాంతికుమార్ యాదవ్ అభినందించారు. మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తామని తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే పాఠశాల లక్ష్యమని పేర్కొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌ను వినియోగించుకోవాలి
* ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, జనవరి 21: సీఎం రిలీఫ్ ఫండ్‌లను వినియోగించుకోవాలని రాజేంద్రనగర్ శాసనసభ్యుడు టీ.ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ హనుమాన్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్‌నాయక్ అనే వ్యక్తికి ఇబ్బందులు పడుతుండడంతో రూ.60 వేలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్‌లను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మురళీధర్ రావును కలిసిన ఈబీసీ ఫోరం నాయకులు
బాలాపూర్, జనవరి 21: కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణల పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించినందున అందుకు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఈబీసీ ఫోరం రాష్ట్ర నాయకులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ.మురళీధర్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పుష్ఫ గుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు.
కంటి వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోండి
ఆమనగల్లు, జనవరి 21: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు, రాంరెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 105 మందికి కంటి పరీక్షలను కంటి వైద్యులు వెంకటస్వామి నిర్వహించి అందులో 46 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం మహబూబ్‌నగర్‌లోని రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించడం జరిగిందని లయన్స్ పీఆర్‌ఓ పాషా తెలిపారు.

వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు
షాబాద్, జనవరి 21: దైవాలగూడ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41వ రోజు మండలం సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామస్తులతో హోమం చేయించారు. అనంతరం స్వామి వారికి అభిషేకం చేసి నూతన పట్టు బట్టలు సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలంలోని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వేద పండితులతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు. వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

బీసీ ఉద్యోగుల క్యాలెండర్‌ను
ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు
రాజేంద్రనగర్, జనవరి 21: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీసీ ఉద్యోగుల క్యాలెండర్‌ను రాజేంద్రనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు టీ.ప్రకాష్ గౌడ్, మహబూబ్‌నగర్ శాసనసభ్యులు జే.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీసీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిని దరికి రానివ్వకుండా ప్రజలకు నిజాయితీతో సేవలందించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం బీసీ ఉద్యోగులు శ్రీనివాస్, పీ.్భక్షపతి, దశరథ్, ఎం.రమేష్, మురళి, కవిత, ఎం.కృష్ణ పాల్గొన్నారు.

నారపల్లి వీకర్ సెక్షన్ కాలనీ అభివృద్ధికి కృషి
* జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి
ఘట్‌కేసర్, జనవరి 21: నారపల్లి వీకర్ సెక్షన్ కాలనీ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తానని ఘట్‌కేసర్ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి తెలిపారు. మండల పరిధి నారపల్లిలోని వీకర్‌సెక్షన్ కాలనీ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు సోమవారం మంద సంజీవరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. వీకర్ సెక్షన్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి శాలువాలతో సన్మానించారు. కాలనీ అధ్యక్షుడు బీజీలీ జంగయ్య, ఉపాధ్యక్షుడు పరుశురాం గౌడ్, ప్రధాన కార్యదర్శి సోమాచారి, సహయ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి బాలాచారిలను అభినందించారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు నాగయ్య, శ్రీనివాస్, శాంతికుమార్, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.