రంగారెడ్డి

ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: నగర శివారులోని మేడ్చల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులకు ఖరీదైనవిగా మారి తలకు మించిన భారంగా మారాయి. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు, మద్యం, మటన్, చికెన్‌లతో పాటు విలువైన వస్తువులను బహుమతులు అందజేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తామేమి తక్కువ కాదంటూ ఒకరికిఒకరు పోటాపోటీగా భావించి ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు. ప్రస్తుత మేడ్చల్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం అభ్యర్థుల ధన ప్రవాహం చూస్తే రాష్ట్రంలోని మారుమూల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చేమోనని అనిపిస్తుంది.
ఒక్కో అభ్యర్థి ఓటుకు రూ.2000 కూడా ఇవ్వడానికి సైతం వెనుకాడటంలేదు. మేజర్ గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు చేస్తున్న ఖర్చులు చూస్తుంటే కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు అర్ధమవుతుంది. కొందరు అభ్యర్థులైతే పరపతి కోసం ఓటుకు పదివేలు కూడా పెట్టేందుకు సిద్దమవుతున్నారంటే పరిస్థితి ఎంత పోటాపోటీగా ఉందే అవగతం అవుతుంది. మండలంలోని 17 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 13 గ్రామ పంచాయతీల్లో 25వ తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. గ్రామాల్లో ప్రజలు కూడా అభ్యర్థుల మధ్య ఉన్న పోటాపోటీని దృష్టిలో ఉంచుకుని అందినకాడికి డిమాండ్ చేసి మరీ డబ్బులు దండుకుంటున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు వారికి తోచిన విధంగా అభ్యర్థులతో ఓప్పందం కుదుర్చుని తమ డిమాండ్‌లను నెరవేర్చుకుంటున్నారు. జనరల్ గ్రామ పంచాయతీ బరిలో నిల్చున్న అభ్యర్థులైతే ఏకంగా డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసేస్తున్నారు. మాములు గ్రామపంచాయతీల్లో కూడా రెండు వేల రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు ఓటర్లకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ రిజర్వ్‌డ్ పంచాయతీల్లో కూడా ఓటుకు వెయ్యి చెల్లిస్తున్నారనే ప్రచారం ఉంది. మండలంలోని మూడు ప్రధాన గ్రామ పంచాయతీల్లో ఇద్దరు హేమ హేమీలు బరిలో ఉండటంతో ఓటుకు ఎంతైనా ఇచ్చేందుకు వెనుకాడటం లేదని ప్రజలే బాహటంగా పేర్కొంటున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుల ఖర్చులు కూడా లక్షలు దాటుతుంది. డబ్బు ఖర్చుతో పాటు విలువైన బహుమతులు కూడా ముట్టజెపుతున్నారు. ఎన్నికలు జరుగుతున్నా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. మరికొందరు అభ్యర్థులైతే ఇంటింటికీ ఏకంగా మటన్, చికెన్ మందు సీసాలను కూడా సరఫరా చేయడం కొసమెరుపు.
మండంలోని 13 గ్రామపంచాయతీల్లో 25వ తేదిన రెండో విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం సాయంత్రం అభ్యర్థుల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు కావడంతో బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో ర్యాలీలు, నినాదాలు మైకుల మోతతో హోరెత్తించారు. బైక్ ర్యాలీలు, డప్పులు దరువులతో ఓటర్లను అకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ప్రచారానికి అఖరి రోజు పోటాపోటీగా జోరుగా ప్రచారం నిర్వహించారు. అధికారిక ప్రచారానికి తెరపడటంతో తెరవెనుక ప్రలోభాలు మొదలయ్యాయి.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
షాబాద్: రెండవ విడత ఎన్నికలకు మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో 105 మంది సర్పంచ్‌లు, 714 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నట్లు మండల అభివవృద్ధి అధికారి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బొబిలిగాం, తిర్ములపూర్, పోలారం, లక్ష్మణరావుగూడ, గొల్లూర్‌గూడ గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మండల పరిధిలోని అంతారంలో సర్పంచ్‌కి ముగ్గరు, వార్డు సభ్యులు 24 మంది, అప్పరెడ్డిగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 15 మంది, బొడంఫహాడ్ సర్పంచ్‌కి 5మంది, వార్డు సభ్యులు 28 మంది, చందనవెళ్లి సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 21 మంది, చర్లగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 16 మంది, దామర్లపల్లి సర్పంచ్‌కి నలుగురు, వార్డు సభ్యులు 18మంది, ఎర్రవల్లి సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 16 మంది, హైతాబాద్ సర్పంచ్‌కి ఐదు, వార్డు సభ్యులు 22 మంది, కక్కులూర్ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 22 మంది, కేసారం సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 16 మంది, కేశవగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 18 మంది, కోమరబండ సర్పంచ్‌కి ఐదు మంది, వార్డు సభ్యులకు 17 మంది, కుమ్మరిగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులకు 21 మంది, కుర్వగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 21 మంది, లింగారెడ్డిగూడ సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 20 మంది, మాచన్‌పల్లి సర్పంచ్‌కి 5 మంది, వార్డు సభ్యులు 18 మంది, మద్దూర్ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 20 మంది, మక్తగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 12 మంది, మల్లారెడ్డిగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 16 మంది, మన్మ్‌ర్రి సర్పంచ్‌కి ఐదు మంది, వార్డు సభ్యులు 18 మంది, ముద్దెంగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 16 మంది, నాగర్‌గూడ సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 19 మంది, నాగర్‌కుంట సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 20 మంది, నరేడ్లగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 10 మంది, పెద్దవేడు సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 18 మంది, పోతుగల్ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 17 మంది, రేగడిదోస్వాడ సర్పంచ్‌కి నలుగురు, వార్డు సభ్యులు 18 మంది, రుద్రారం సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 19మంది, సంకెపల్లిగూడ సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 18 మంది, సర్దర్‌నగర్ సర్పంచ్‌కి నలుగురు, వార్డు సభ్యులు 47 మంది, సీతారాంపూర్ సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 24 మంది, షాబాద్ సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 23 మంది, సోలిపేట్ సర్పంచ్‌కి నలుగురు, వార్డు సభ్యులు 23 మంది, తాళ్లపల్లి సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 29 మంది, తిమ్మరెడ్డిగూడ సర్పంచ్‌కి ముగ్గురు, వార్డు సభ్యులు 23 మంది, ఎల్గొండగూడ సర్పంచ్‌కి ఇద్దరు, వార్డు సభ్యులు 16మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. వీరందరికి గుర్తులు అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.