రంగారెడ్డి

ఎమ్మెల్యేను కలిసిన టీఆర్‌ఎస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 14: తెలంగాణ రాష్ట్ర సమితి పీర్జాదిగూడ పురపాలక సంఘం నాయకులు గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి సమస్యలపై వివరించారు. పట్టణంలోని పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్‌లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీటీసీలు వీకే నాదం గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నేతలు దర్గ దయాకర్ రెడ్డి, జెక్కా వెంకట్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, కుర్ర శివ కుమార్ గౌడ్, పప్పుల అంజిరెడ్డి, కౌడె పోచయ్య, ఎడవెల్లి రఘువర్దన్ రెడ్డి, వంగూరి నర్సింహా కోరారు. అనంతరం కుర్ర శివ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు.
వాలంటైన్స్‌డేకు వ్యతిరేకంగా
భజరంగ దళ్ నిరసన ర్యాలీ
ఉప్పల్, ఫిబ్రవరి 14: వాలంటైన్స్‌డేకు వ్యతిరేకంగా భజరంగ దళ్ ఉప్పల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కన్వీనర్ నవీన్ గౌడ్ నాయకత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రేవెల్లి రాజు, సీనియర్ నాయకులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్, బాలకృష్ణ, శ్రీనివాస్, వంశీ, నర్సింగ్, భరత్ రెడ్డి, దత్తసాయి, వేణుగోపాల్, సాయి, బద్రీ పాల్గొని నినాదాలు చేశారు. ప్రేమికుల రోజు దేశ సంస్కృతి కాదని, విదేశీ సంస్కృతిని విడనాడాలని పిలుపునిచ్చారు. హిందూ సాంప్రదాయంలో అందరినీ ప్రేమిస్తామని, నిజమైన ప్రేమ అంటే తల్లి, తండ్రీ, గురువుఅని ప్రేమకు ఆదర్శం శ్రీరామ చంద్రమూర్తి అని అభివర్ణించారు.
భగవంతుని ఆశీస్సులతో జీవించాలి
జీడిమెట్ల, ఫిబ్రవరి 14: భగవంతుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ గణేశ్‌నగర్‌లో అమృతాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూన శ్రీశైలం గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నాయకులు దుర్గారావు, వెంకటేశ్వర రావు, వెంకటేశ్, లింగం యాదవ్, నర్సింహారెడ్డి, యాదగిరి, మురళీ పాల్గొన్నారు.
మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు రుణాల పంపిణీ
* ఎమ్మెల్యే కేపీ వివేక్
జీడిమెట్ల, ఫిబ్రవరి 14: మహిళలు స్వశక్తితో ఎదిగేందుకే రుణాల పంపిణీ జరుగుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలో పొదుపు సంఘాలకు యూసీడీ రుణాల మంజూరు పత్రాలను వివేక్ అందజేశారు. వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పాటుపడుతుందని చెప్పారు. మహిళలు పురోగమిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. రుణాలను సక్రమంగా తీరుస్తూ మరిన్ని రుణాలను పొందాలని, స్వశక్తితో మహిళలు ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో ఉపకమిషనర్ విజయ్‌కుమార్, విక్టర్, యూసీడీ పీవో సంధ్య, హరిప్రియ, కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు మహ్మద్ రఫీ, విజయ లక్ష్మీ, సంధ్య, ఆశియ పాల్గొన్నారు.
ఈనెల 17న వేలం పాట
తలకొండపల్లి, ఫిబ్రవరి 14: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లికి చెందిన చెన్నారం గ్రామాలలో శ్రీ మళ్లీకార్జునస్వామి దేవాలయంలో ఈనెల 17న కొబ్బరికాయలు, పులిహోర, లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నట్లు చెన్నారం గ్రామ సర్పంచ్ తీపిరెడ్డి, స్వప్నరెడ్డి, ఆలయ కార్యదర్శి కోగూరు. మల్లరెడ్డి పెర్కొన్నారు. వేలం పాటను ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. పరిసర గ్రామాల నుంచి వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలం పాటను విజయవంతం చేయాలని వారు కొరారు.